E-Paper
Advertisement

Sahibzada Farhan: బాబర్ ఆజం అస‌లైన‌ మొన‌గాడు, అత‌ని ముందు స‌చిన్‌, కోహ్లీ చెత్త క్రికెట‌ర్లే

Sahibzada Farhan: బాబర్ ఆజం అస‌లైన‌ మొన‌గాడు, అత‌ని ముందు స‌చిన్‌, కోహ్లీ చెత్త క్రికెట‌ర్లే
Advertisement

Sahibzada Farhan:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) ప్రారంభం కాబోతున్నాయి నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెటర్లు రెచ్చిపోతున్నారు. మాజీ క్రికెటర్లతో పాటు ప్రస్తుతం పాకిస్తాన్ జట్టులో కొనసాగుతున్న వాళ్లు కూడా ఇండియన్ క్రికెటర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే లేటెస్ట్ గా విరాట్ కోహ్లీ ( Virat Kohli), సచిన్ టెండుల్కర్ పై ( Sachin Tendulkar) పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ ( Sahibzada Farhan ) షాకింగ్ కామెంట్స్ చేశారు. బాబర్ ఆజం ( Babar Azam ) ముందు విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ దేనికి పనికిరారని బాంబు పేల్చారు ఫర్హాన్. ఈ ఇద్దరి కంటే బాబర్ ఆజం తోపు ఆటగాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో సాహిబ్‌జాదా ఫర్హాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also  Read:  Inzamam-ul-Haq: కోహ్లీ యావ‌రేజ్ ప్లేయ‌ర్..వాడి కంటే బెట‌ర్ క్రికెట‌ర్లు పాకిస్థాన్‌లో గల్లీకొకడు ఉంటాడు

సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ కంటే బాబర్ బెస్ట్ క్రికెటర్

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) అంటూ పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్  ( Pakistan Super League 2026 Tournament ) అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో పాకిస్తాన్ క్రికెటర్లు చేస్తున్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటును కించపరిచేలా పాకిస్తాన్ మాజీలు అలాగే ప్రస్తుత క్రికెటర్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే విరాట్ కోహ్లీ అలాగే సచిన్ టెండూల్కర్ ఉద్దేశించి పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ ( Sahibzada Farhan ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాబర్ ఆజం ముందు సచిన్ టెండూల్కర్ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు దేనికి పనికిరారని మండిపడ్డారు. వాళ్లు ఇండియా తరఫున ఆడుతున్నారు కాబట్టి తోపు క్రికెటర్లుగా కనిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. కానీ ఆ ఇద్దరు క్రికెటర్లకు లేని, టెక్నిక్స్ బాబర్ ఆజం దగ్గర ఉన్నాయని పేర్కొన్నారు.

సచిన్ టెండూల్కర్ అలాగే విరాట్ కోహ్లీ కంటే మెరుగైన బ్యాటింగ్ శైలితో, అద్భుతంగా ఆడగల సత్తా బాబర్ ఆజం సొంతం అని పేర్కొన్నారు.  ముఖ్యంగా టి20 లలో విరాట్ కోహ్లీ కంటే బాబర్ ఆజం అత్యంత భయంకరంగా ఆడతాడని తెలిపారు. టి20 లలో అత్యధిక అర్థ సెంచరీలు ఉన్న నమోదు చేసిన విరాట్ కోహ్లీ రికార్డును కూడా తాజాగా బాబర్ ఆజం బద్దలు కొట్టినట్లు గుర్తు చేశారు. అయితే, ఫర్హాన్ చేసిన వ్యాఖ్యలకు ఇండియన్ అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. బాబర్ ఆజం కంటే విరాట్ కోహ్లీ అలాగే సచిన్ టెండూల్కర్ ఇద్దరు తోపు క్రికెటర్లని వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం చెత్త ప్రదర్శన కనబరుస్తున్న బాబర్ ఆజం కు జట్టులో స్థానమే లేదని.. అలాంటోడు సచిన్ టెండూల్కర్ అలాగే విరాట్ కోహ్లీకి పోటీ ఇస్తాడా ? అని ఫర్హాన్ కు కౌంటర్ ఇస్తున్నారు.

Advertisement

Also Read: Tanveer Ahmed: PSL జోక‌ర్ లీగ్ అయిపోయింది..ఐపీఎల్ కోసం డ్రామాలు ఆడే దుర్మార్గుల‌పై 3 ఏళ్ల బ్యాన్ వేయాల్సిందే

 

 

Related News

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

Big Stories

Advertisement
×