E-Paper
Advertisement

సుధీర్ పెళ్లి చేసుకోకపోవడం వెనుక ఇంత నరకమా.. 14 ఏళ్ల ప్రేమ, బ్రేకప్!

సుధీర్ పెళ్లి చేసుకోకపోవడం వెనుక ఇంత నరకమా.. 14 ఏళ్ల ప్రేమ, బ్రేకప్!
Advertisement

Sudigali Sudheer: మెజీషియన్ గా తన కెరియర్ ను ప్రారంభించి.. ఆ తర్వాత బుల్లితెరపై ప్రసారమవుతున్న కామెడీ ఎంటర్టైన్మెంట్ షో ‘జబర్దస్త్’ లోకి అడుగుపెట్టి, కమెడియన్ గా కొంతకాలం పనిచేసి ఆ తర్వాత తన ప్రతిభతో టీం లీడర్ గా ఎదిగి ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్నారు సుడిగాలి సుధీర్.. ముఖ్యంగా ఈ షోలో ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను లతో కలిసి చేసిన వందల కొద్దీ స్కిట్స్ చేసి మంచి రేటింగ్ ను సొంతం చేసుకున్నాయి అలా ఈ ముగ్గురికి మంచి పేరు లభించింది. అంతేకాదు సుధీర్ జబర్దస్త్ లో ఉన్నప్పుడు ప్రముఖ యాంకర్ రష్మీతో కొనసాగించిన ప్రేమాయణం షోకే హైలెట్గా నిలిచింది. ఇక వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన విషయం తెలిసిందే.

సుధీర్ పెళ్లి చేసుకోకపోవడానికి అసలు కారణం అదేనా?

సుధీర్ కి ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఆయనకు సినిమాలలో అవకాశాలు లభించాయి. అలా సాఫ్ట్వేర్ సుధీర్ సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన ఈయన.. ఆ తర్వాత పలు చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇక ప్రస్తుతం ‘గోట్’ అనే సినిమాలో హీరోగా నటిస్తూనే మరొకవైపు ది ఫ్యామిలీ స్టార్ వంటి షోలలో హోస్టుగా వ్యవహరిస్తూ బిజీగా మారిపోయారు. ఇకపోతే సుధీర్ ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా.. వివాహం అనే మాట ఆయన ఎత్తడం లేదు. పైగా తన తమ్ముడికి వివాహం చేశాడే కానీ తన వివాహం గురించి ఆలోచించడం లేదని , ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూడగా.. ఆయన పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయం తెలిసి అందరినీ నవ్వించే సుధీర్ జీవితంలో ఇంత విషాదం ఉందా ? 14 ఏళ్ల పాటూ ప్రేమించిన అమ్మాయి సడన్ గా బ్రేకప్ చెప్పడానికి గల కారణం ఏమిటి? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Advertisement

also read:42 ఏళ్ల వయసులో తొలిసారి తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ!

14 ఏళ్ల ప్రేమ.. కట్ చేస్తే..

అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ వేదికగా “సర్కార్ సీజన్ 6″ షో ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి కి సుదీర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ షోలో యాంకర్ విష్ణుప్రియ కూడా యాడ్ అయింది. ఇద్దరు కలిసి తమదైన వాక్చాతుర్యంతో ముందుకు నడిపిస్తున్నారు. ఇకపోతే గతంలో వీరిద్దరూ పోవే పోరా షో చేసి మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే.. ఇకపోతే తాజాగా ఈ షో కి సంబంధించిన ప్రోమోని విడుదల చేయగా.. అందులో ప్రతాప్ మూవీ టీం సందడి చేసింది. తిరువీర్ , స్నేహ, ప్రసాద్ బెహరా , రవి ఆంటోనీలు సందడి చేశారు. ఈ ఎపిసోడ్ లో భాగంగా చిత్ర యూనిట్ సుదీర్ ను ప్రశ్నించారు. ప్రతి ఒక్కరు తమ తొలిప్రేమ గురించి చెప్పాలని అడగ్గా.. మీరు చెప్పండి అంటూ తిరువీర్ సుదీర్ ని ప్రశ్నించారు.

Advertisement

దీంతో విష్ణు ప్రియ మాట్లాడుతూ.. ” 14 ఏళ్ల రిలేషన్షిప్ కదా ఎందుకు బ్రేకప్ అయ్యింది? ” అని అడగ్గా సుదీర్ మాట్లాడుతూ..” అవును 14 ఏళ్ల రిలేషన్షిప్.. స్కూల్ నుంచే పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. నేను ఇక్కడే హైదరాబాద్ వచ్చి పని చేసుకుంటున్నాను.. కానీ తను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంది అని తెలిసింది. ఎందుకు అని అడిగాను. నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను డిస్టర్బ్ చేయొద్దు అని అంది. ఇక ఏం చేయాలో అర్థం కాలేదు.. నక్లెస్ రోడ్ లో అరుస్తూ పరిగెత్తాను ” అంటూ ఆరోజు బాధాకర సంఘటనలను గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు సుధీర్. ప్రస్తుతం తన మీద తన ఫ్యామిలీ ఆధారపడి ఉందని.. బ్రేకప్ చెప్పకపోతే ఎంతమంది ప్రేమ నాకు దొరికేది కాదేమో అంటూ కూడా సంతోషం వ్యక్తం చేశారు.

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×