E-Paper
Advertisement

పనామా బ్రిడ్జిపై భారీ పేలుడు.. పలువురికి తీవ్రగాయాలు, ఉలిక్కిపడిన అమెరికా, ఎవరి పని?

పనామా బ్రిడ్జిపై భారీ పేలుడు.. పలువురికి తీవ్రగాయాలు, ఉలిక్కిపడిన అమెరికా, ఎవరి పని?
Advertisement

Panama Canal Bridge: పనామాలోని బ్రిడ్జ్ ఆఫ్ ది అమెరికా సమీపంలో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.ఈ ఘటనతో ఒక్కసారిగా అమెరికా ఉలిక్కిపడింది. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తోంది. ప్రమాదవ శాత్తూ జరిగిందా? దీని వెనుక ఎవరైనా ప్రమేయముందా? ఆరా తీస్తోంది? దీనికి సంబంధించి వీడియో వైరల్ అయ్యింది.

పనామా బ్రిడ్జిపై భారీ పేలుడు.. మంటల్లో ఆయిల్ ట్యాంకర్

Advertisement

పనామాలోని భారీ వంతెన ఈ ఉదయం భారీ ట్యాంకర్ పేలిపోయింది. దీంతో మంటలు భారీ ఎత్తున వ్యాపించాయి. ఈ పేలుడు తర్వాత చెలరేగిన మంటలు వంతెన ప్రధాన భాగానికి వ్యాపించాయి. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. మరొక వ్యక్తి గల్లంతు అయినట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ప్రపంచంలోని కీలకమైన సముద్ర మార్గాల్లో ఇది కూడా ఒకటి. పనామా కెనాల్‌పై భారీ వంతెనను నిర్మించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా అమెరికా ఉలిక్కిపడింది. ఇరాన్‌పై యుద్ధం నేపథ్యంలో ఎవరైనా కావాలనే ఈ ప్రమాదానికి పాల్పడ్డారా? అనే కోణంలో ఆరా తీస్తోందట. ఫ్యూయల్ ట్యాంకర్‌లో ఈ పేలుడు ఘటన జరిగింది. అయినప్పటికీ అన్ని కోణాల్లో దర్యాప్తులో నిమగ్నమైంది.

Advertisement

పలువురికి తీవ్రగాయాలు, ఉలిక్కిపడిన అమెరికా 

పనాబా బ్రిడ్జిపై ఆయిల్ ట్యాంకర్ వెళ్తోంది. తొలుత మంటలు చెలరేగాయి, ఆ తర్వాత భారీ శబ్దం చేస్తూ పేలుడు చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. క్షణాల్లో మంటలు వంతెనను చుట్టుముట్టాయి. అదే సమయంలో వంతెనపై చాలా వాహనాలు వెళ్తున్నాయి.

ఈ ఘటనలో వంతెన ఎంత వరకు ధ్వంసమైందనే విషయంపై ఇంకా తెలియాల్సివుంది. ఈ నేపథ్యంలో భద్రతా కారణాలు చూపిస్తూ బ్రిడ్జిని తాత్కాలికంగా మూసి వేసినట్లు పనామా స్టేట్ పబ్లిక్ వర్క్స్ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఘటన తర్వాత వంతెన నాణ్యత, ఇతరత్రా పరిస్థితులపై తనిఖీలు ముమ్మరం చేశారు.

ALSO READ: సమయం లేదు మిత్రమా.. ఒక్కరోజులో ఇరాన్ మటాష్, ట్రంప్ కీలక వ్యాఖ్యలు

వంతెనపై వాహనాల రాకపోకలను నిలిపి వేశారు. పబ్లిక్ వర్క్స్ విభాగానికి చెందిన ప్రత్యేక బృందాలు వంతెన నాణ్యతను పరిశీలన చేస్తోంది. సురక్షితమని నిర్ధారించిన ఈ వంతెనపై వాహనాల రాకపోకలను అనుమతిస్తామని తెలిపింది. 1.6 కిలోమీటర్లు పొడవనున్న ఈ వంతెనను బ్రిడ్జ్ ఆఫ్ ది అమెరికాగా పిలుస్తారు.

పనామా సిటీకి కలిపే ముఖ్యమైన రవాణా రహదారి ఇది. ప్రపంచంలో కీలక షిప్పింగ్ ఛోక్‌ పాయింట్ పనామా కాలువ. హోర్ముజ్ జలసంధి ఉద్రిక్తతలు పెరగడంతో ఈ కాలువ ద్వారా రవాణా తీవ్రమైంది. ముడి చమురు రవాణాను అమెరికా ఈ కాలువ కుండా ఆసియా వైపు మళ్లించినట్టు తెలుస్తోంది.

 

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×