Rajeev Kanakala -Suma Kanakala: టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుమ కనకాల(Suma Kanakala) ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఒకవైపు సినిమా ఈవెంట్లు మరోవైపు ఇంటర్వ్యూ అంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సుమ భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. అయితే సుమ తీసుకుంటున్న ఈ రెమ్యూనరేషన్ లో కొంత భాగం సహాయ సహకారాలు చేయటానికే ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సుమ ఫెస్టివల్ ఫర్ జాయిస్ (Festival For Joys)అనే సంస్థ పేరిట అనాధలు, వృద్ధాశ్రమాలలో వృద్దులు, దివ్యంగులు ఉండే ఆశ్రమాల్లో పండగలు చేసుకోలేని వారి కోసం సపోర్ట్ చేస్తూ వారికి కూడా పండగ సంతోషాన్ని కల్పిస్తున్నారు.
ఇకపోతే సుమ ప్రారంభించిన ఈ ఫెస్టివల్ ఫర్ జాయిస్ అనే సంస్థ నేటికీ ఐదు సంవత్సరాలు కావడంతో ఒక ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమా కనకాలతో పాటు ఆమె భర్త రాజీవ్ కనకాల(Rajeev Kanakal) కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాజీవ్ కనకాల మాట్లాడుతూ సుమ గురించి గొప్ప విషయాలు తెలియజేశారు. సుమ ప్రయాణం మామూలు ప్రయాణం కాదు ఆమె ధ్రుడ నిశ్చయంతో వృత్తిపరమైన వ్యక్తిగత జీవితాన్ని విజయవంతంగా ముందుకు తీసుకు వెళుతుందని రాజీవ్ కనకాల తెలిపారు.
ఫెస్టివల్ ఫర్ జాయిస్ ప్రారంభించి ఐదు సంవత్సరాలు అయినప్పటికీ ఈమె అంతకు ముందు నుంచే ఎంతోమంది పేదవారికి తనదైన శైలిలోనే సహాయం చేస్తూ వచ్చారని తెలిపారు.చాలా గుప్త దానాలు చేసింది. పండగలు చేసుకోలేని వారికి మనలాగా పండగలు చేసుకోవాలి అని ఈ సంస్థ మొదలుపెట్టింది. ఇవన్నీ చేయటానికి ఆమె వెనుక మేమున్నా పెద్దగా సపోర్ట్ చేయలేదు కానీ సుమా మమ్మల్ని సపోర్ట్ చేయడమే కాకుండా తన చుట్టూ ఉన్న వాళ్లను సపోర్ట్ చేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకు వెళుతుందని తెలిపారు.
ఈరోజు చెబుతున్న సుమ ఇంకా 116 ఏళ్లు ఆరోగ్యంగా బ్రతకాలి. ఇలా ఇన్ని సంవత్సరాలు నువ్వు బ్రతుకుతూ ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలి అంటూ రాజీవ్ కాస్త ఎమోషనల్ అవుతూ మాట్లాడటంతో సుమా కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా ఈ ప్రసంగం తరువాత సుమ నేరుగా స్టేజ్ మీదకు వెళ్లి రాజీవ్ కనకాలను తీసుకువచ్చారు. అదేవిధంగా సుమ కూడా మాట్లాడుతూ నేను ఇన్నేళ్లు బ్రతకాలి అంటే ముందు నువ్వు సినిమాలలో చచ్చిపోకుండా ఉండాలి అంటూ అందరిని నవ్వించే ప్రయత్నం చేశారు. ఇలా సుమ చేస్తున్న ఈ గొప్ప సేవా కార్యక్రమాల గురించి తెలియడంతో సుమపై అభిమానులు కూడా ప్రశంసల కురిపిస్తున్నారు.
Also Read: గాడ్ ఆఫ్ వార్ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్.. ఎన్టీఆర్ కూడా ఓకే చేశారా?