E-Paper
Advertisement

మారనున్న పానగల్ ఛాయా సోమేశ్వరాలయం రూపురేఖలు.. కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం!

మారనున్న పానగల్ ఛాయా సోమేశ్వరాలయం రూపురేఖలు.. కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం!
Advertisement

Panagal: స్వేచ్చ బ్యూరో: చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం కలిగిన పానగల్ ఛాయా సోమేశ్వరాలయానికి మహర్దశ పట్టనుంది. శతాబ్దాల చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం సుమారు రూ.20 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు ప్రణాళిక సిద్ధం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆలయ చారిత్రక స్వరూపాన్ని కాపాడుతూనే భక్తులు, పర్యాటకులకు ఆధునిక సౌకర్యాలు కల్పించేలా అభివృద్ధి చేపట్టనున్నారు.

ఆలయ వాస్తు విశేషాలు..

పానగల్ ప్రాంతం ఇప్పటికే చారిత్రక కట్టడాలు, శిల్పకళా సంపదకు ప్రసిద్ధి చెందింది. ఛాయా సోమేశ్వరాలయంలోని ప్రత్యేక నిర్మాణశైలి, శిల్పకళ, ఆలయ వాస్తు విశేషాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇప్పటివరకు తగిన స్థాయిలో మౌలిక వసతులు లేకపోవడంతో ఈ ప్రాంతానికి ఆశించిన స్థాయిలో పర్యాటకుల రాక పెరగలేదనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలనే నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

చారిత్రక వైభవానికి ఆధునిక వసతులు

Advertisement

అభివృద్ధి ప్రణాళికలో ఆలయ పరిసరాలను సుందరీకరించడంతో పాటు భక్తులు, పర్యాటకుల సౌకర్యాలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. సందర్శకులు సులభంగా ఆలయాన్ని వీక్షించేలా పరిసరాల అభివృద్ధి, రహదారులు, పార్కింగ్, తాగునీరు, మరుగుదొడ్లు, విశ్రాంతి ప్రాంతాలు వంటి సదుపాయాలను మెరుగుపరిచే దిశగా చర్యలు చేపట్టనున్నారు.

Also read: ప్రాజెక్టులు కట్టింది మీరు.. కూలిపోతే మమ్మల్ని అంటారా?: మంత్రి ఉత్తమ్

పర్యాటక కేంద్రంగా అభివృద్ధి..

Advertisement

పానగల్‌లోని ఛాయా సోమేశ్వరాలయాన్ని కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా చారిత్రక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యం ముందుకు వస్తోంది. నల్గొండ జిల్లాలోని ఇతర చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాంతాలతో అనుసంధానం చేస్తూ ప్రత్యేక పర్యాటక సర్క్యూట్‌ను అభివృద్ధి చేసే అవకాశం ఉంది. దీంతో జిల్లాకు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరగడంతో పాటు స్థానికంగా ఉపాధి, వ్యాపార అవకాశాలు కూడా మెరుగుపడే అవకాశం ఉంది. ఆలయ చరిత్ర, శిల్పకళ, నిర్మాణ విశిష్టతను సందర్శకులకు వివరించేలా సమాచార కేంద్రాలు, గైడ్ సదుపాయాలు, డిజిటల్ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తే యువతతో పాటు దేశ, విదేశీ పర్యాటకులను కూడా ఆకర్షించే అవకాశం ఉంటుంది. తద్వారా పానగల్ పేరు మరింత విస్తృతంగా ప్రపంచ పర్యాటక పటంలో నిలిచే అవకాశం ఉంది.

స్థానికంగా ఉపాధి అవకాశాలు

పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందితే పానగల్ పరిసర ప్రాంతాల్లో స్థానికులకు అనేక రకాల ఉపాధి అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది. హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా, గైడ్ సేవలు, హస్తకళలు, స్థానిక ఉత్పత్తుల విక్రయం వంటి రంగాలు అభివృద్ధి చెందవచ్చు. దీంతో ఆలయ అభివృద్ధి కేవలం ఆధ్యాత్మిక, పర్యాటక రంగానికే పరిమితం కాకుండా స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతమిచ్చే అవకాశం ఉంది. రూ.20 కోట్ల నిధులతో ప్రారంభం కానున్న ఈ అభివృద్ధి కార్యక్రమం సాకారం అయితే పానగల్ ఛాయా సోమేశ్వరాలయం నల్గొండ జిల్లాలోనే కాకుండా తెలంగాణలోనే ప్రముఖ ఆధ్యాత్మిక, చారిత్రక పర్యాటక కేంద్రంగా ఎదిగే అవకాశం ఉంది. చరిత్ర, శిల్పకళ, ఆధ్యాత్మికతకు నిలయమైన పానగల్‌కు కొత్త గుర్తింపు తీసుకురావడంలో ఈ ప్రాజెక్టు కీలక మలుపుగా నిలవనుంది.

రూ. 20 కోట్లు నిధులు..

పానగల్‌ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు.. సీఎం, డిప్యూటీ సీఎంకు మంత్రి కోమటిరెడ్డి కృతజ్ఞతలు
పానగల్‌ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్ల నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పానగల్‌ ఛాయా సోమేశ్వరాలయానికి చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉందని, ఆలయ అభివృద్ధితో నల్గొండ జిల్లాలో పర్యాటక రంగానికి మరింత ఊతం లభిస్తుందని మంత్రి చెప్పారు. ఆలయాన్ని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యే క చొరవతో చాయ సోమేశ్వర ఆలయానికి రూ. 20 కోట్లు నిధుల మంజూరుపై ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతుంది.

Also read: దుండిగల్‌లో దారుణం.. ఇంటి తాళాలు పగలగొట్టి స్థలాన్ని ఆక్రమించిన రౌడీషీటర్!

Tags

Related News

నా ప్రాణం తీద్దామని చూశారు.. కేటీఆర్‌పై ఎంపీ అరవింద్ సంచలన ఆరోపణలు!

దుండిగల్‌లో దారుణం.. ఇంటి తాళాలు పగలగొట్టి స్థలాన్ని ఆక్రమించిన రౌడీషీటర్!

శంషాబాద్‌లో హవాలా గుట్టు రట్టు.. కోటి 56 లక్షల విదేశీ కరెన్సీ సీజ్!

ప్రాజెక్టులు కట్టింది మీరు.. కూలిపోతే మమ్మల్ని అంటారా?: మంత్రి ఉత్తమ్

తెలంగాణలో విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్?

ఆర్టీఏలో రొటేషన్‌కు రాంరాం.. హోంగార్డులదే రాజ్యం!

రాహుల్ గాంధీ ఇప్పట్లో ప్రధాని కావడం కష్టమే.. రాంచందర్ రావు సెటైర్లు

Big Stories

Advertisement
×