E-Paper
Advertisement

ప్రభుత్వాన్ని మోకరిల్లేలా చేశారంటూ సంచలన ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్!

ప్రభుత్వాన్ని మోకరిల్లేలా చేశారంటూ సంచలన ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్!
Advertisement

Prakash Raj:విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ప్రకాష్ రాజ్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా సమాజంలో జరిగే ప్రతి అంశంపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. మొన్నటి వరకు ప్రశ్నా రావణ్ కి మద్దతుగా పలు పోస్టులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులను టార్గెట్ గా చేసుకొని వివిధ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ స్టూడెంట్స్ వివాదంపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

ప్రభుత్వాన్ని మోకరిల్లేలా చేశారు -ప్రకాష్ రాజ్

అయితే ఇప్పుడు తాజాగా మరో ట్వీట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. ” ప్రభుత్వాన్ని మోకరిల్లేలా చేశారు ” అంటూ ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.. గత కొన్ని రోజుల క్రితం నీట్ పేపర్ లీకేజీపై పెద్ద ఎత్తున నిరసనలు మొదలైన విషయం తెలిసిందే. ఢిల్లీ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు, విద్యార్థులు తమకు న్యాయం జరగాలి అని.. నీట్ పేపర్ అవకతవకలలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు అండగా నిలవాలని, నీట్ పేపర్ లీకేజ్ పై బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్(Dharmendra Pradhan) రాజీనామా చేయాలి అంటూ పెద్ద ఎత్తున నిరసనలు మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా ఈ నిరసన వెల్లువెత్తుతున్న నేపథ్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా అర్థరాత్రి సమయంలో ఒక వీడియో రిలీజ్ చేస్తూ.. జూలై 24న అత్యవసర కేబినెట్ సమావేశం కూడా ఏర్పాటు చేశారు.

Advertisement

also read:స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న చెన్నై లవ్ స్టోరీ బ్యూటీ.. ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

జెన్ జీ నెగ్గింది.. ధర్మేంద్ర రాజీనామాపై ప్రకాష్ రాజ్ ట్వీట్..

అయితే ఎట్టకేలకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఈ విషయంపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. “నా ప్రియమైన బొద్దింకలారా.. ప్రియమైన సోనమ్ వాంగ్ చుక్ గారికి, యువతకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి అభినందనలు. మీరు ఒక ప్రభుత్వాన్ని మోకరిల్లేలా చెయ్యగలరని నిరూపించారు. # జస్ట్ ఆస్కింగ్” అంటూ తన మనసులోని భావాలను వ్యక్తపరిచారు. అంతేకాదు రెడ్ బుక్ చూపిస్తున్న ఫోటోని కూడా ఆయన షేర్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మోదీ భయపడ్డారు – ప్రకాష్ రాజ్

Advertisement

ఇకపోతే ఇటీవల ఈ వివాదంపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ.. ఇకపై పేపర్ లీక్ జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటాం అంటూ ఒక వీడియో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై కూడా ప్రకాష్ రాజ్ స్పందిస్తూ..” మోదీ భయపడ్డారు.. ఆ భయాన్ని నేను ఆయన ముఖంలో చూశాను.. నా దేశ యువతకు ధన్యవాదాలు.. కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలకు చాలా చాలా ధన్యవాదాలు ” అంటూ పోస్ట్ పెట్టారు.

Related News

‘చెన్నై లవ్ స్టోరీ’కి రూ.కోటి రూపాయల ఫ్రీ టికెట్లు?ఏంటిది కిరణ్?

సూర్య సినిమా థియేట్రికల్ రైట్స్ లొల్లి.. అడ్వాన్స్ ఇచ్చిన వాళ్లకు షాక్!

స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న చెన్నై లవ్ స్టోరీ బ్యూటీ.. ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

‘ఆ అక్కలంతా ఏమైపోయారు?’.. NEET పేపర్ లీక్‌పై స్పందించిన అనసూయ!

అఖిల్ ఏ దేశ పౌరుడో తెలుసా.. త్వరలోనే?

నీట్ పేపర్ లీక్ వివాదంపై నవదీప్ షాకింగ్ రియాక్షన్?

మా ఆయనకే లేని నొప్పి మీకెందుకురా నాయనా?.. సాలిడ్ పంచ్ ఇచ్చిన వెటరన్ బ్యూటీ !

Big Stories

Advertisement
×