Actress Pawan Sai : బుల్లితెర హీరో పవన్ సాయి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒక్కో సీరియల్ తో ప్రేక్షకులకు ఆకట్టుకుంటూ ప్రస్తుతం టాప్ లో కొనసాగుతున్నాడు. టాప్ సీరియల్ హీరోలలో ఈయన ఒకడు.. మొగలిరేకులు సీరియల్ లో నటించాడు ఆ తర్వాత ముద్దమందారం సీరియల్ లో హీరోగా నటించాడు. ఈ సీరియల్లో అతని లైఫ్ నీ పూర్తిగా మార్చేసింది.. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే కథతో రావడంతో ఎక్కువమంది ఈ సీరియల్కు బాగా కనెక్ట్ అయ్యారు. అప్పట్లో జీ తెలుగులో ఇదే టాప్ సీరియల్. అయితే ఈయన సీరియల్ లైఫ్ గురించి అందరికీ తెలుసు కానీ రియల్ లైఫ్ గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. నిజానికి ఈయన రియల్ లైఫ్ లో భార్యతో విడాకులు తీసుకున్నాడు అన్న విషయం తెలిసిందే. పచ్చని కాపురంలో విడాకులు రావడానికి కారణం ఓ సీరియల్ హీరోయిన్ అని ఇప్పటికే ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. నిజంగానే ఆమె పవన్ సాయితో రిలేషన్ లో ఉందా? తన భార్యతో విడాకులు తీసుకోవడానికి ఆ హీరోయిన్ కారణమా? అసలు మ్యాటర్ ఏంటి అన్నది తెలుసుకుందాం..
సీరియల్ హీరో పవన్ సాయి కి పెళ్లి అయ్యిందా అనే డౌట్ చాలా మందికి వస్తుంది. అవును ఆయనకు పెళ్లి అయ్యింది. విడాకులు కూడా అయ్యాయి. భార్యతో విడాకులు తీసుకోవడానికి కారణం ముద్దమందారం సీరియల్ హీరోయిన్ తనూజ అంటూ అప్పటిలో సోషల్ మీడియాలో బాగానే వార్తలు వినిపించాయి. తనూజ, పవన్ సాయి రిలేషన్ ని మైంటైన్ చేస్తూ వస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో ఒక రూమర్ ఉంది. ఇందులో ఎంత మాత్రం నిజముందో తెలియదు కానీ, తనూజ కి పవన్ సాయి అంటే విపరీతమైన ఇష్టం తన జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్న కూడా దానికి పవన్ సాయి సలహాలు తీసుకునేదని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.. అంతేకాదు అతనింటే చాలా ఇష్టం పుడితే అతని లాగా పుట్టాలంటూ పవన్ సాయి పై ప్రశంసలు కురిపించింది. దీంతో వీళ్ళిద్దరూ రిలేషన్ లో ఉన్నారని కన్ఫామ్ అయిపోయింది. ఇదిలా ఉండగా ఈ మధ్య తనుజ బిగ్బాస్ లో కంటెస్టెంట్ గా కొనసాగుతుంది.. ఆమెను గెలిపించేందుకు పవన్ సాయి ప్రమోషన్స్ మొదలుపెట్టినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read: హౌస్ మొత్తం కట్టప్పలే.. వెన్నుపోటు పొడిచారు.. శివాజీ స్ట్రాంగ్ కౌంటర్..
తనూజ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. జీ తెలుగు ఛానల్ లో సెన్సేషనల్ హిట్ గా నిల్చిన ముద్దా మందారం అనే సీరియల్ లో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత అదే జీ తెలుగు ఛానల్ లో ఈమె ‘అగ్ని పరీక్ష’ లో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత ఓ డ్యాన్స్ షోలో పాల్గొన్నారు. దీని తర్వాత కుకింగ్ షోలో పాల్గొన్నారు. అదే ఆమెకు ప్లస్ అని చెప్పాలి. అలా తన క్రేజ్ ని పెంచుకుంటూ వచ్చినా తనుజ ఇప్పుడు బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా కొనసాగుతుంది. హౌస్ లో స్ట్రాంగ్ కంటెంట్ గా తొమ్మిది వారాలు నుంచి ఉంది. ఎటువంటి గొడవలకు కేరాఫ్ గా మారకుండా చాలా సేఫ్ గా గేమ్ ఆడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పవన్ కళ్యాణ్, ఇమ్మానుయేల్ వంటి వారికి కూడా టైటిల్ కొట్టేందుకు సమానమైన అర్హతలు ఉన్నాయి. కానీ ఎందుకో తనూజ తో గొడవలు పెట్టుకోవడానికి భయపడుతూ, చాలా సేఫ్ గా ఆడుతున్నారు.. విన్నర్ అయ్యే అర్హతలు సంపాదించుకుంది. మరి ఫైనల్ గా ఎవరు విన్నర్ అవుతారో చూడాలి..