BigTV English
Advertisement

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (10/11/2025) ఆ రాశి వారికి వృథా ఖర్చులు – వృత్తి వ్యాపారాలలో నష్టాలు 

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (10/11/2025) ఆ రాశి వారికి వృథా ఖర్చులు – వృత్తి వ్యాపారాలలో నష్టాలు 

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన నవంబర్‌ 10వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 


మేష రాశి:  

వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య సమస్యలు భాదిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.  చేపట్టిన పనులు వాయిదా పడతాయి. బంధువర్గంతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఇంటాబయట ఊహించని సమస్యలు కలుగుతాయి.

వృషభ రాశి:

నిరుద్యోగుల యత్నాలు సఫలమవుతాయి. మిత్రులతో విందువినోద  కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి.  వృత్తి, వ్యాపారాలలో మరింత అనుకూలంగా సాగుతాయి.  నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధన వస్తు లాభాలు పొందుతారు.


మిథున రాశి:  

చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఒక వ్యవహారంలో  మాటపట్టింపులు తప్పవు. నిరుద్యోగులకు శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహ పరుస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.

కర్కాటక రాశి:

వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. స్థిరస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి.

సింహరాశి:

వ్యాపార, ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. ముఖ్యమైన  వ్యవహారాలలో  కొద్దిపాటి ఆటంకాలు తప్పవు. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.  చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.

కన్యారాశి :

కుటుంబ సభ్యులతో  దైవదర్శనాలు చేసుకుంటారు. నూతనోత్సాహంతో  కొన్ని పనులు పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. నూతన గృహ వాహన యోగం ఉన్నది. సమాజంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

తులారాశి:

వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. స్థిరాస్తి క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. రాజకీయ ప్రముఖుల నుండి  సమావేశాలలో ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.

వృశ్చికరాశి:

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో అధికారుల నుండి ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఉద్యోగయత్నాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

ధనస్సు రాశి:

వృత్తి, వ్యాపారాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు.   స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలసి రావు. సోదరులతో ఆస్తి   విషయంలో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆలయ సందర్శనం చేసుకుంటారు.

మకరరాశి:

వ్యాపారాలు విస్తరణ  ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. విద్యార్థుల కష్టం ఫలిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

కుంభరాశి:

వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు  తొలగుతాయి. చాలా కాలంగా పూర్తికాని  పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందువినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూరపు బంధువుల నుండి విలువైన సమాచారం  సేకరిస్తారు. సంతాన విద్య ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి.

మీనరాశి:

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.  ముఖ్యమైన  పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో సహోద్యోగులతో మాటపట్టింపులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయడం మంచిది. వృత్తి వ్యాపారాల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

 

Related News

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (09/11/2025) ఆ రాశి వారికి ఊహించని మార్పులు – వారికి బంధువులతో గొడవలు  

Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు (నవంబర్‌ 9 – నవంబర్‌ 15)  ఆ రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది – నూతన వాహన యోగం 

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (08/11/2025) ఆ రాశి వారికి కుటుంబ సభ్యులతో గొడవలు – వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (07/11/2025) ఆ రాశి వారికి  నూతన వాహన యోగం – ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్తలు

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (06/11/2025) ఆ రాశి ఉద్యోగులకు ప్రమోషన్లు – వారికి ఆకస్మిక ప్రయాణాలు

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (05/11/2025) ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారికి వృత్తి వ్యాపారాలలో నష్టాలు 

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (04/11/2025) ఆ రాశి ఉద్యోగుల సమస్యలు తీరుతాయి – వారికి ఆర్థికపరమైన నష్టాలు   

Big Stories

×