Bigg Boss Buzzz Promo: బుల్లితెర టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎంతమంది ప్రేక్షకులు ఈ షోని చూస్తున్నారు. కాస్త ఎంటర్టైన్మెంట్ మరి కాస్త గొడవలు.. జనాలకు ఒక్కొక్కసారి పిచ్చెక్కి చెప్పి పనులు కూడా ఈ షోలో కనిపిస్తూ ఉంటాయి. అయినా ఈ షో టిఆర్పి రేటింగ్ మాత్రం తగ్గలేదు.. తెలుగులో ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకునే ఈ షో ప్రస్తుతం 9 వ సీజన్లోకి అడుగు పెట్టింది. ఇప్పటికే 9 వారాలు పూర్తి చేసుకుంది. అందరూ అనుకున్నట్లుగానే ఈ వారం డబల్ ఎలిమినేషన్ జరిగింది. ముందుగా రామ్ రాథోడ్ తనకి తన ఫ్యామిలీ గుర్తుకొస్తుందని ఎమోషనల్ అయ్యి హౌస్ నుంచి స్వచ్ఛందంగా బయటకు వచ్చేసాడు. అసలు ఈయన బిగ్ బాస్ కు రావడం ఎందుకు అని ప్రశ్నలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అసలు ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు అన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. ఆ తర్వాత సాయి శ్రీనివాస్ అతి తక్కువ ఓటీంగ్ తో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసాడు.. ఈయన శివాజీ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ బజ్ కు వచ్చారు. ఆ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. శివాజీ కౌంటర్ కు సాయి నోట మాట రాలేదు.. ఆ ఒక్క మాట జనాలను కన్ఫ్యుజన్ లో పడేస్తుంది..
ప్రోమో స్టార్ట్ అవ్వగానే శివాజీ సాయి శ్రీనివాస్ ను ఒక ఆట ఆడుకున్నాడు.. ఏంటి బిగ్ బాస్ లోకి వెళ్లిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని శివాజీ అడిగాడు. పర్లేదు సర్ బాగానే ఉంది అని సాయి అన్నాడు. నేను ఒక మాట చెప్పనా నువ్వు ఫ్రెష్ కాండిడేట్ నువ్వు మళ్ళీ కొత్తగా బిగ్ బాస్ లోకి అడుగు పెట్టే ఛాన్స్ కూడా ఉంది తెలుసా అని అంటాడు. ఆ మాట వినగానే సాయి శ్రీనివాస్ షాక్ అవుతాడు. ఎందుకంటే నువ్వు ఎక్కడ కనిపించలేదు. ఎక్కడ నువ్వు యాక్టివ్ గా ఉన్నావు. ఏం ఆట ఆడావు.. అంటూ శివాజీ కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తాడు.. నువ్వేదో చేస్తావని హౌస్ లోకి పంపిస్తే ఏమి చేయలేదు అంటూ గాలి తీసేసాడు శివాజీ.. మొత్తానికి అయితే సాయి శ్రీనివాస్ పరువుని గంగలో కలిపేసాడు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది.
Also Read :సింగర్ రామ్ రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్.. ఎంత సంపాదించడంటే..?
బిగ్ బాస్ హౌస్ లో కట్టప్ప ఎవరు అని శివాజీ అడుగుతాడు. నమ్మించి దారుణంగా మోసం చేసింది ఎవరు అని అడగగానే సాయి శ్రీనివాస్ రీతు చౌదరి అని నిర్మొహమాటంగా చెప్పేస్తాడు. ఆమె హౌస్ లో అందరిని నమ్మించి గొంతు కోసేస్తుంది మెయిన్ కట్టప్ప ఆమె అని సమాధానం చెప్పాడు. అంతేకాదు హౌస్ లో ఉన్న వాళ్ళు ఎవరూ కూడా నిజాయితీగా లేరు అందరూ వెన్నుపోటు పొడిచే వాళ్లే.. ఒక్క మాటలో చెప్పాలంటే అందరూ కట్టప్పలే అని సాయి శ్రీనివాస్ అనడంతో శివాజీ మైండ్ బ్లాక్ అయిపోయింది. హౌస్ లో ఉన్న వాళ్ళందరూ కట్టప్పలే అంట మరి బాహుబలి ఎవరు అన్నట్లు శివాజీ కౌంటర్లు వేశారు. అందరికన్నా ఎక్కువ కర్నింగ్ రీతు.. అందరినీ తన అవసరాలకు వాడుకుంటుంది అంటూ బాంబు పేల్చేశాడు సాయి శ్రీనివాస్.. మొత్తానికి సాయి శ్రీనివాస్ సమాధానాలకి శివాజీ కౌంటర్లు ప్రోమోకి హైలెట్ గా నిలిచాయి. మరి ఎపిసోడ్ ఎలా ఉంటుందో తెలియాలంటే అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిందే..