E-Paper
Advertisement

TV Actress : తమిళ బుల్లితెరపై తెలుగు క్రేజీ హీరోయిన్స్.. సౌత్ లో ఫుల్ డిమాండ్..

TV Actress : తమిళ బుల్లితెరపై తెలుగు క్రేజీ హీరోయిన్స్.. సౌత్ లో ఫుల్ డిమాండ్..
Advertisement

TV Actress : ఈమధ్య సినిమాలన్నీ కూడా గ్రాఫిక్స్ మీదనే నడుస్తున్నాయి. విజువల్ వండర్ గా ఎన్నో సినిమాలు అద్భుతాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్న సరే సీరియల్స్ కి మాత్రం డిమాండ్ ఎక్కడ తగ్గడం లేదు. ప్రతి ఇండస్ట్రీలో సీరియల్స్ కున్న డిమాండ్ అలాంటిది మరి. ప్రతిరోజు కూడా ప్రేక్షకులను అలరించడానికి సీరియల్స్ సిద్ధంగా ఉన్నాయి. వీటిలో నటించిన కొందరు యాక్టర్లు దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ముఖ్యంగా చాలామంది సౌత్‌లో ఒకేసారి వివిధ భాషల్లో నటిస్తూ బుల్లితెర ఆడియన్స్‌ ను ఆకట్టుకుంటున్నారు. తెలుగు, కన్నడ ముద్దుగుమ్మలు తమిళంలో సీరియల్స్ చేస్తూ అక్కడ కూడా స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాయి. అక్కడ వరుసగా సీరియల్స్ చేస్తూ దూసుకుపోతున్న హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

సమీరా షరీఫ్..

సమీరా షరీఫ్.. తెలుగు బుల్లితెరపై భార్యామణి వంటి సూపర్ హిట్ సీరియల్ లో నటించిన ఈ హైదరాబాది ముద్దుగుమ్మ తమిళంలో క్రేజీ ఆఫర్ ని అందుకొని అక్కడ కూడా స్టార్ ఇమేజిని సొంతం చేసుకుంది. తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ‘పగల్ నిలవు’ సీరియల్‌తో బాగా పాపులర్ అయింది ఆ తర్వాత వరుసగా సీరియల్స్ చేసి అక్కడ ఫుల్ డిమాండ్ ఉన్న హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో కొన్ని సీరియల్స్ చేసింది. కానీ ఆ తర్వాత తెలుగులో ఒక్క సీరియల్ కూడా చేయలేదు. సమీరా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యామిలీ గురించి వీడియోలను చేస్తూ వస్తుందన్న విషయం తెలిసిందే..

శోభా శెట్టి..

Advertisement

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మ శోభ శెట్టి. ఈమె తెలుగులో చేసిన సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ముత్తళగు’ సీరియల్‌తో తమిళ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. వరుసగా వివిధ తమిళ సీరియల్స్‌లో పవర్‌ఫుల్ రోల్స్ చేస్తూ, అక్కడి ఆడియన్స్‌కి కూడా దగ్గరైంది.. తెలుగు టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో కంటెస్టెంట్ గా పాల్గొంది. ఆ తర్వాత తెలుగు సీరియల్స్లలో పెద్దగా కనిపించలేదు. ప్రస్తుతం తమిళ సీరియల్స్లలో నటిస్తూ బిజీగా ఉంది.

రచిత మహాలక్ష్మి..

ఈమె కూడా కన్నడ నటినే.. బెంగుళూరుకు చెందిన ఈమె తెలుగులో స్వాతి చినుకులు వంటి సూపర్ హిట్ సీరియల్ లో నటించింది. జీ తెలుగులో ప్రసారమైన మా ఇంటి మహాలక్ష్మి సీరియల్స్‌తో క్రేజ్ ను సంపాదించుకుంది. తమిళంలో ‘నామ్ ఇరువర్ నమక్కు ఇరువర్ సీజన్ 2’, ‘సెంబరుతి’, ‘సత్య సీజన్ 2’ వంటి హిట్ సీరియల్స్ లలో నటించింది. బిగ్ బాస్సీజన్ 6 తమిళంలో కూడా కంటెస్టెంట్ గా పాల్గొంది.. ప్రస్తుతం ఈమె వరుసగా సీరియల్స్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

ప్రీతీ అశ్రానీ..

Advertisement

జీ తెలుగులో వచ్చిన పక్కింటి అమ్మాయి సీరియల్‌తో కెరీర్ స్టార్ట్ చేసిన ప్రీతి.. ప్రెజర్ కుక్కర్, సీటీమార్, యశోద, మళ్లీరావా వంటి సినిమాలలో కూడా నటించింది. పుట్టింది మాత్రం గుజరాత్ లైనా పెరిగింది హైదరాబాదులోనే.. ఈమె తమిళంలో వరుసగా సీరియస్ చేస్తూ బిజీ హీరోయిన్గా మారిపోయింది..

Also Read : అవని సేఫ్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్.. చక్రధర్ చెప్పిన నిజం ఏంటి..?

ఇక ఈమెతో పాటుగా.. స్వాతి కొండే కూడా కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చింది.. ఆమె తెలుగులో పలు సీరియల్స్ లలో నటించింది.. ఆ తర్వాత తమిళంలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ వరుసగా సీరియల్స్లలో నటించే అవకాశం అందుకుని క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. వీరందరూ కూడా హీరోయిన్లు తెలుగులో పలు సీరియల్స్ వాళ్ళు నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈమధ్య వీళ్ళలో ఏ ఒక్కరు కూడా తెలుగు సీరియల్స్ లో కనిపించలేదు.

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×