BRS: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్మఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి, ఆ పార్టీ సీనియర్ లీడర్లకి మధ్య గ్యాప్ పెరిగిపోతోందన్న ప్రచారం జరుగుతోంది. స్థానిక నాయకులు ఎమ్మెల్యే వ్యవహరశైలిపై అసంతృప్తి తో రగిలిపోతున్నారంట. కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నియోజకవర్గం లోని సీనియర్లంతా జట్టుకట్టి రాజీనామాలకి సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది .. లోకల్ లీడర్ల రహస్య సమావేశం వెనుక రాజీనామానే కారణం అన్న చర్చ జోరందుకుంది. పాడి కౌశిక్ రెడ్డితో ఇక వేగలేమని గులాబి క్యాడర్ అధిష్టానికి స్పష్టం చేసిందంట. ఇలాంటి పరిస్థితుల్లో హుజురాబాద్‌లో బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిత్యం ఏదోక వివాదంలో మునిగి ఈత కొడుతూనే ఉంటారు. ఫైర్ బ్రాండ్‌గా ఓన్ హైప్ కోసం పాకులాడుతూ, సొంత మైలేజ్ పెంచుకోవడానికి నిత్యం అరాటపడుతూ పప్పులో.. కాదుకాదు తప్పులలో కాలేస్తున్నారన్న చర్చ నడుస్తోంది. ప్రత్యర్శులపై ఇష్టానుసారం పరుషపదజాలంతో విమర్శలు చేస్తూ.. ఫైర్ బ్రాండ్‌గా ఫోకస్ అవ్వడానికి తాపత్రయపడుతుంటారన్న విమర్శలు కౌశిక్‌రెడ్డిపై ముందు నుంచి ఉన్నాయి.
వాస్తవానికి తనను గెలిపించకపోతే ఆత్మహత్యే శరణ్యమని గత ఎన్నికల ప్రచారంలో కౌశిక్ రెడ్డి ప్రజలను లిటరల్‌గా బతిమలాడుకుని, ఎమోషన్ బ్లాక్ మెయింలింగ్ చేసి గట్టెక్కారు. అయితే గెలిచాక ఆయన వ్వవహారం పూర్తిగా మారిపోయిందని గులాబీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఆ క్రమంలో ఇప్పుడు హుజురాబాద్ లోని బీఅర్ఎస్ సీనియర్ లీడర్లలంతా కౌశిక్ రెడ్డి వ్యవహారశైలి వలన తీవ్ర అవేదనతో, అసహానికి గురి అవుతున్నారట. గత ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఅర్ఎస్‌కి వ్యతిరేక పవనాలు వీచినా, గులాబి బాస్‌పై మమకారం, గౌరవంతో, కౌశిక్ రెడ్డిని గెలిపించుకున్న అదే క్యాడర్ ఇప్పుడు ఎందుకు గెలిపించామా అని లోలోపల మధన పడుతూ, అసంతృప్తితో రగిలిపోతున్నారంట. ఉద్యమం సమయం నుండి గులాబీ పార్టీలో కేసీఅర్‌కు అండగా నడుస్తూ వచ్చిన క్యాడర్, ఇప్పుడు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీరుతో పార్టీకి దూరమయ్యే ఆలోచనలో ఉండటం గమనార్హం. ఎమ్మెల్యే గా గెలిచిన తరువాత సీనియర్ లీడర్లు, ఉద్యమకారులని పక్కన బెట్టి, తన వెంట వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తూ, తమని పట్టించుకోవడం లేదని గులాబీ పార్టీ నేతలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో పర్యటించేటప్పుడు, కనీసం తమకి సమాచారం ఇవ్వడం లేదని, ఏదైనా పనికోసమో, అభివృద్ధి విషయంలోనో కలవడానికి వెళ్ళితే పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.
Also Read: CM Chandrababu: సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు.. టిడ్కో ఇళ్లకు డబ్బులు వాపస్..!
ఇటీవల జరిగిన పంచాయతీ, మునిసిపల్ ఎన్నికలల్లో సీనియర్లని పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం, అనుభవజ్ఞులైన సీనియర్లు ఉన్నా కూడా.. కౌశిక్‌రెడ్డి సొంత అజెండాతో ఏ నిర్ణయాలు తీసుకోవడం కారణంగానే పార్టీ ఓడిపోవడానికి కారణమని క్యాడర్ మండిపడుతోంది. వ్యక్తిగత సమస్యలని పార్టీ సమస్యలుగా చూపించడం వలన గందరగోళ పరిస్థితి నెలకొందని, ఆయన కారణంగా హుజురాబాద్ నియోజకవర్గంలో బీఅర్ఎస్ బలం రోజురోజుకు బలహీనపడుతుందని ముందు నుంచి ఉన్న పార్టీ శ్రేణులు అవేదన వ్యక్తం చేస్తున్నాయంట. కౌశిక్ రెడ్డి తో విసిగిపోతున్న హుజురాబాద్ నియోజకవర్గం లోని ఐదు మండలాల బీఅర్ఎస్ సీనియర్లు ఇప్పుడు ఉమ్మడి రాజీనామాలకి సిద్దం అవుతున్నారన్న ప్రచారం మొదలైంది. ఎమ్మెల్యే వైఖరి కారణంగా తమ రాజకీయ భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని, ఇప్పటికే ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కోంటున్నామని నాయకులు బహిరంగంగా నే విమర్శలు చేస్తున్నారు.. తమ సమస్యలు పరిష్కరించాలని, స్థానిక అభివృద్ధి విషయం లో పలుమార్లు కౌశిక్ రెడ్డిని కలిస్తే అసలు పట్టించుకోవడం లేదని వారంతా ఫైర్ అవుతున్నారు.
ఈ నేపధ్యంలో కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని గులాబీ బాస్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోవడంతో, తామే పార్టీని వదిలి వెళ్ళడం బెటరన్న అలోచనకి వచ్చారంట. హుజురాబాద్‌లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గులాబీ పార్టీ పెద్దలు పట్టించుకోకపోవడంతో పార్టీ మారాలని చర్చించుకుంటున్నారంట. ఆ క్రమంలో నియోజకవర్గంలోని ఐదు మండలాల బిఅర్ఎస్ నాయకులు రహస్య సమావేశం ఏర్పాటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కౌషిక్ రెడ్డి వలన తాము ఎదుర్కుంటున్న ఇబ్బందులు, పార్టీ పరిస్థితి దిగజారి పోవడం, ఆయన వ్యక్తిగత సమస్యలని పార్టీ సమస్యలుగా ప్రజల్లోకి తీసుకెళ్లడానిక చేస్తున్న ప్రయత్నాలతో.. పార్టీ ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయిందంటున్నారు. అందుకే నియోజకవర్గంలోని కౌశిక్‌రెడ్డి వ్యతిరేకులంతా ఎకతాటిపైకి వచ్చి ఉమ్మడి రాజీనామాల నిర్ణయం తీసుకున్నారంట. మరి బీఆర్ఎస్ అధిష్టానం పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేస్తుందా? లేకపోతే ఎప్పటిలాగే కౌశిక్‌రెడ్డికే మద్దతిస్తుందో చూడాలి.
Also Read: Vahan Portal: వాహనాదారులకు గుడ్ న్యూస్.. రాష్ట్రంలో నేటి నుండి వాహన్ పోర్టల్ ప్రారంభం