E-Paper
Advertisement

Actress Srisatya : సీరియల్స్‌లో తెలుగు వాళ్లను ఇలానే చూస్తారు.. రెమ్యూనరేషన్ మరీ దారుణం..

Actress Srisatya : సీరియల్స్‌లో తెలుగు వాళ్లను ఇలానే చూస్తారు.. రెమ్యూనరేషన్ మరీ దారుణం..
Advertisement

Actress Srisatya :  బుల్లితెర ప్రేక్షకులకు శ్రీ సత్య గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. బుల్లితెర నటిగా బాగా పాపులర్ అయిన ఈమె ప్రస్తుతం గ్లామర్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది.. ఈమధ్య వరుస అవకాశాలను అందుకుంటూ ఫుల్ బిజీగా గడుపుతున్న శ్రీ సత్య ఇటీవల సర్జరీ కూడా చేయించుకుందని వార్తలు వినిపించాయి.. ఇకపోతే చిన్నప్పటి నుంచి మోడలింగ్‌ పై ఇష్టంతో ఆమె సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందుకు ఆమె తల్లిదండ్రులు కూడా ఎంతగానో ప్రోత్సహించారు. అలా తాను మోడలింగ్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం వరుసగా సీరియల్స్, సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. అంతేకాదు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.. సీరియల్స్లలో తెలుగు వాళ్లకు ఎలాంటి గౌరవం ఉంటుంది అన్న విషయాన్ని బయటపెట్టింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవడంతో ఈమె మరోసారి వార్తల్లో నిలిచింది. అసలు శ్రీ సత్య ఏం చెప్పిందో ఒకసారి తెలుసుకుందాం..

తెలుగు వాళ్లకు రెమ్యూనరేషన్ తక్కువ..

సీరియల్ ముద్దుగుమ్మ శ్రీ సత్య తాజాగా యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ లో పాల్గొంది. అందులో తన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది. తెలుగు వాళ్లకి సీరియల్స్లలో అవకాశాలు వస్తాయి. కానీ వాటికి వచ్చే రెమ్యూనరేషన్ చాలా తక్కువ ఉంటుందని ఆమె పచ్చి నిజాలను బయటపెట్టింది. ఈమె మాట్లాడుతూ.. మిగిలిన వాళ్ళకి అడిగినంత ఇస్తారు. అంతే కాదు వాళ్లకి ఫెసిలిటీస్ కూడా బాగుంటాయి.. మనవాళ్ళకి ఏదో ఊతభత్యంలాగా రెమ్యూనరేషన్ ఇస్తారు. ఒక్కరోజుకు మాకు 10 వేలు ఇస్తారు. అదే మిగిలిన ఇండస్ట్రీల నుంచి వచ్చిన హీరోయిన్లు ఒకరోజుకు 30 వేలకు పైగా ఇస్తున్నారు. తెలుగు వాళ్లు అంటే ఏంటో తక్కువగా చూస్తారు అని శ్రీసత్య అంది.

Advertisement

Also Read : అనశ్వర రాజన్ అందానికి రహస్యం.. రోజూ అదే పనా..? సీక్రెట్ రీవిల్…

శ్రీసత్య ఎమోషనల్ స్టోరీ..

శ్రీసత్య సినిమాలతో పాటుగా, షార్ట్ ఫిల్మ్స్, సిరీయళ్లలో కూడా నటిస్తోంది. శ్రీ సత్య మోడల్‌గా ప్రయాణాన్ని ఆరంభించింది. అందులో తనదైన అందచందాలతో మాయ చేసిన ఈ చిన్నది.. మిస్ ఆంధ్రాగా గెలిచింది.. ఆ తర్వాత ఎన్నో బ్రాండ్లకు ప్రమోట్ చేస్తూ తన క్రేజ్ ను పెంచుకుంది. ప్రస్తుతం ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది.. అంతేకాదు తన ఫ్యామిలీ స్టోరీని చెప్పి ఎమోషనల్ అయింది.. గతంలో తన తల్లి అనారోగ్యానికి గురవడంతో ఆ తర్వాత తన తండ్రి తల్లిని చూసుకుంటూ ఇంట్లో ఉండిపోయాడని చెప్పింది. ఆ తర్వాత ఇల్లు కడవడానికి కష్టంగా మారింది.  ఆ బాధ్యతలను తీసుకున్నాను. అలా నేను ఇలా గ్లామర్ ఫీల్డ్ లోకి వచ్చేసాను అని ఆమె అన్నారు. అయితే మొదట్లో ఒక రోజుకి 5వేలు ఇచ్చేవారు. సీరియల్స్ 30 రోజులు పాటు షూటింగ్ జరుగుతూ ఉంటాయి.. దాంతో మా ఇంటికి గడవడానికి సరిపోయేది.. ఇప్పుడు ఒక వైపు సీరియల్స్ సినిమాలతో పాటుగా నేను ఇంస్టాగ్రామ్ లో కూడా బాగానే సంపాదిస్తున్నట్లు చెప్పింది.. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

Related News

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Karthika Deepam2 : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారెక్టర్ అవుట్..

Intinti Ramayanam Today Episode: అవనిని కొట్టించిన పల్లవి.. రెచ్చిపోయిన అక్షయ్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి విశ్వం వార్నింగ్.. వేధవతికి సీరియస్.. భాగ్యం ప్లాన్ సక్సెస్..

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Big Stories

Advertisement
×