Telugu TV Serials : తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టీవీ ఛానెల్స్ లలో ఎక్కువగా వినిపించేవీ సీరియల్స్.. బుల్లితెరపై ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటే ఉంటాయి.. ఇక గత కొన్ని రోజులుగా సీరియల్స్ మధ్య గట్టి పోటీ ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల కాలంలో ప్రసారమయ్యే ప్రతి సీరియల్ కూడా డిఫరెంట్ స్టోరీ తో రావడంతో.. జనాలు కూడా ప్రతి సీరియల్ ని మిస్ అవ్వకుండా చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇకపోతే ముఖ్యంగా స్టార్ మా చానల్లో ప్రసారం అవుతున్న అన్ని సీరియల్స్ కూడా మంచి కాన్సెప్ట్ రావడంతో జనాలు వీటిని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.. ప్రతివారం సినిమాలకు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో.. అదే విధంగా సీరియల్స్ కి కూడా టిఆర్పి రేటింగ్ ఉంటుందన్న విషయం తెలిసిందే.. ఇక గత వారంతో పోలిస్తే ఈవారం టిఆర్పి రేటింగ్ కాస్త తగ్గినట్లు కనిపిస్తోంది మరి ఏ సీరియల్ రేటింగ్ ఎలా ఉందో ఒక్కసారి మనం ఇక్కడ తెలుసుకుందాం..
తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటాయి.. గత కొన్ని రోజులుగా టీవీ సీరియల్స్ లో కొన్ని సీరియల్స్ మాత్రమే టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్నాయి. మరికొన్ని సీరియల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న వస్తున్నాయి. ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపించే సీరియల్ కార్తీకదీపం 2 దానికి పోటీగా స్టార్ మహిళ ప్రసారమవుతుంది మరో సూపర్ హిట్ సీరియల్ గుండెనిండా గుడి గంటలు. ఈ రెండు సీరియల్స్ గట్టి పోటీగా బరిలోకి దిగుతున్నాయి. మరి ఇటీవల కాలంలో వచ్చిన ప్రతి సీరియల్ కూడా చూడాలని ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఇప్పుడు ఎక్కువమంది బాలు సీరియల్ లో ఇంకొంచం మార్పులు ఉంటే బాగుండు అని అభిప్రాయపడుతున్నారు. మొన్నటివరకు టాప్ లో ఉన్న ఈ సీరియల్ ఇప్పుడు మళ్లీ సెకండ్ ప్లేస్ లో కెళ్ళిపోవడంతో ఫ్యాన్స్ చాలా ఫీలవుతున్నారు. ఈవారం కూడా ఈ సీరియల్ రెండో స్థానంలోనే కొనసాగుతుంది… ఈ స్టోరీలు అనుకోని మార్పులు గనుక జరిగితే టిఆర్పి రేటింగ్ పెరగడంతో పాటుగా మొదటి స్థానంలో ఉండవచ్చు.. ఈ వారం టీవీ సీరియల్స్ రేటింగ్ ఎలా ఉందంటే..
స్టార్ మా ఛానెల్ లో కొనసాగుతున్న ప్రతి సీరియల్ జనాలను బాగా అలరిస్తున్నాయి. ఈ మధ్య టీవీల్లోకి ప్రతిరోజు ప్రసారం అవుతున్న సీరియల్ డిఫరెంట్ స్టోరీతో ఉండటంతో వీటి మధ్య పోటీ గట్టిగానే ఉంటుంది.. స్టార్ మా సీరియల్స్ కి కాస్త పోటీ ఎక్కువే.. ఇకపోతే గత వారంతో పోలిస్తే ఈవారం టిఆర్ఫీ రేటింగ్ సీరియల్స్ కి తగ్గిందని తెలుస్తుంది.. ఇటీవల ఏ సీరియల్ కి ఎంత రేటింగ్ నమోదయింది అన్నది చూస్తే.. ఫస్ట్ ప్లేసులో కార్తీక దీపం 2 కొనసాగుతుంది. ఈ సీరియల్ రేటింగు 11.00 గా ఉంది.. రెండవ స్థానంలో గుండెనిండా గుడిగంటలు కొనసాగుతుంది. ఇక రేటింగ్ విషయానికొస్తే .. 10.50 ఉంది. పొదరిల్లు 10.55, ఇంటింటి రామాయణం 10.06, ఇల్లు ఇల్లాలు పిల్లలు 09.46, నువ్వులేక నేను లేను 8, 9.30, నిండు మనసులు 8.00, చిన్ని 7.13, బ్రహ్మముడి 7.07.. అయితే ఇప్పటివరకు ఈ సీరియల్స్ మంచి రేటింగ్ను నమోదు చేసుకున్నాయి. ఈ వారం కార్తీకదీపం 2, గుండెనిండా గుడి గంటలు సీరియల్ పోటీ పడుతున్నాయి.. ఇంటింటి రామాయణం సీరియల్ కూడా గత వారంతో పోలిస్తే ఈ వారం కాస్త మంచి టీఆర్పి రేటు నమోదు చేసుకొని దూసుకుపోతుంది.. ఈవారం రేటింగు కాస్త తక్కువగానే ఉంది. ఇక వచ్చేవారం ఏ సీరియల్ రేటింగ్ఎంత నమోదు చేసుకుంటుందో చూడాలి..