Telugu TV Serials: తెలుగు ప్రేక్షకులకు నిత్యం వినోదాన్ని అందిస్తున్న సీరియల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల కాలంలో వస్తున్న సీరియల్స్ స్టోరీలతో జనాలని విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తున్నాయి. గత కొన్ని నెలలుగా కొత్త సీరియల్స్ కి కొదవ లేకుండా ప్రతి చానలు పోటీపడి మరి అందిస్తున్నాయి. నిన్న కాక మొన్న వచ్చిన సీరియల్స్ తో పాటుగా కొన్ని నెలలుగా ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలని ప్రతి రోజు ఆకట్టుకుంటూ మంచి టిఆర్పి రేటింగ్ ను సొంతం చేసుకుంటున్నాయి. ఈ మధ్యకాలంలో వచ్చే సీరియల్స్ కి డిమాండ్ కూడా ఎక్కువ అవడంతో వాటి గురించి తెలుసుకునేందుకు జనాలు కూడా ఎక్కువ ఆసక్తి కనపరుస్తూ వస్తున్నారు. స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ ఎప్పటికప్పుడు మంచి రేటింగ్ తో దూసుకుపోతున్నాయి. మరి ఈవారం తెలుగు టీవీ చానల్స్ లలో ప్రసారమవుతున్న సీరియల్స్ టాప్ రేటింగ్ గురించి ఒక్కసారి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
స్టార్ మా లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే ప్రతిరోజు కూడా కొత్త కొత్త సీరియల్స్ ని ప్రసారం చేస్తున్న కూడా అన్ని సీరియల్స్ ఆకట్టుకుంటూ అలరిస్తూ వస్తున్నాయి. సినిమాలుకి ఎలాగైతే బాక్స్ ఆఫీస్ ఉంటాయో సీరియల్స్ కి అలాగే ప్రతివారం టిఆర్పి రేటింగ్ అనేది ఉంటుంది. ఈవారం టిఆర్పి రేటింగ్ విషయానికొస్తే గుండె నిండా గుడి గంటలు సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. రెండు స్థానంలో కార్తీకదీపం సీరియల్ కొనసాగదా? ఇంటింటి రామాయణం సీరియల్ ఇప్పటికే శుభం కార్డు వేసుకో పోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు సీరియల్ స్టోరీ చూస్తే దాదాపు పడబోతుంది అని తెలుస్తుంది. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియలేదు గాని ప్రస్తుతం అయితే ఇది హాట్ టాపిక్ గా మారింది.
తెలుగు స్టార్ మా ఛానెల్ లో ప్రసారం అవుతున్న ప్రతి ఒక్క సీరియల్ బుల్లితెర ఆడియన్స్అలరిస్తున్నాయి. ఈ మధ్య టీవీల్లోకి ప్రతిరోజు ప్రసారం అవుతున్న సీరియల్ డిఫరెంట్ కథతో ఉండటంతో వీటి మధ్య పోటీ ఎప్పటికీ ఉంటుంది.. ఈ మధ్య ప్రతి సీరియల్ కి ఎంత రేటింగ్ నమోదయింది అన్నది చూస్తే.. ఫస్ట్ ప్లేసులో గుండెనిండా గుడిగంటలు కొనసాగుతుంది. ఈ సీరియల్ రేటింగు 12.63 గా ఉంది.. రెండవ స్థానంలో కార్తీక దీపం 2 కొనసాగుతుంది. ఇక రేటింగ్ విషయానికొస్తే .. 12.50 ఉంది. పొదరిల్లు 11. 65, ఇంటింటి రామాయణం 11.44, ఇల్లు ఇల్లాలు పిల్లలు 10.27, నువ్వులేక నేను లేను10.10, నిండు మనసులు 9.30, చిన్ని 8.23, బ్రహ్మముడి 8.07.. అయితే ఇప్పటివరకు ఈ సీరియల్స్ మంచి రేటింగ్ను నమోదు చేసుకున్నాయి. ఇంటింటి రామాయణం సీరియల్ కూడా గత వారంతో పోలిస్తే ఈ వారం కాస్త మంచి టీఆర్పి రేటు నమోదు చేసుకొని దూసుకుపోతుంది.. ఈవారం రేటింగ్ కాస్త పెరిగింది. ఇక వచ్చేవారం ఏ సీరియల్ కు రేటింగ్ఎంత పెరుగుతుందో చూడాలి.. ప్రస్తుతం బిగ్ బాస్ కూడా ప్రసారమవుతున్న నేపథ్యంలో సీరియల్ కి రేటింగ్ కూడా కాస్త తగ్గిందనే వాదన కూడా వినిపిస్తుంది మరి వచ్చేవారం ఈ రేటింగ్ ఇంకా పెరుగుతూనేమో చూడాలి..