E-Paper
Advertisement

Telugu TV Serials: ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడ్డట్లే.. టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న పొదరిల్లు..

Telugu TV Serials: ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడ్డట్లే.. టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న పొదరిల్లు..
Advertisement

Telugu TV Serials : బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని పంచడంలో సీరియల్స్ ముందు వరుసలో ఉంటాయి. ఒకప్పుడు సీరియల్స్ ఎమోషనల్ స్టోరీ తో జనాలని కట్టిపడేసేవి.. ఇంకా చెప్పాలంటే కన్నీళ్లు పెట్టించేవి కూడా.. అయితే ఈమధ్య వస్తున్న కొత్త సీరియల్స్ మాత్రం జనాలను ఎంతగా ఆకట్టుకుంటున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చూస్తున్నంతసేపు ఆ స్టోరీ సినిమా స్టోరీ నా సీరియల్ స్టోరీ నా అని కన్ఫ్యూషన్ కూడా మొదలవుతుంది. ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న తెలుగు సీరియల్స్ అన్నీ కూడా ఒకదాన్ని మించి మరొకటి ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు.. ముఖ్యంగా చెప్పాలంటే స్టార్ మా లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్నాయి.. మరి ఈ వారం ఈ ఛానల్ లో ప్రసారమైన సీరియల్స్ రేటింగు ఎలా ఉంది..? ఏది సీరియల్ శుభం కార్డు వేసుకోబోతుంది అన్నది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..

కార్తీక దీపం 2.. 

గతంలో వచ్చిన సూపర్ హిట్ సీరియల్ కార్తీకదీపం సీరియల్ గా కార్తీకదీపం 2 ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. ఈసీదులు కాస్త బోరింగ్ కూడా ఈ మధ్య అనిపిస్తుందని జనాల్లో టాక్ వినిపిస్తుంది. రెండో సీజన్లో డాక్టర్ బాబు దీప  కలిసిపోయారు అనుకుంటే వాళ్లకు కష్టాలు మాత్రం వదలట్లేదు అని సీరియల్స్ చూస్తే తెలుస్తుంది. అయితే ఈ మధ్య ఈ సీరియల్ స్టోరీ నత్త నడకగా సాగుతుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కొత్త సీరియల్స్ రావడంతోనే ఈ సీరియల్ చూసే వారి సంఖ్య తగ్గిందని ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.. గతవారంతో పోలిస్తే ఈ వారం టీఆర్పి రేటింగ్ కూడా దారుణంగా పడిపోయిందని తెలుస్తుంది. 13. 26 టీఆర్పి నమోదు చేసుకుంది..

ఇల్లు ఇల్లాలు పిల్లలు.. 

Advertisement

స్టార్ మా లో ప్రసారమవుతున్న మరో సక్సెస్ఫుల్ సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు. ఈ సీరియల్ ఎప్పుడూ స్థానంలోనే కొనసాగుతుంది.. కొత్త సీరియల్స్ వచ్చినా సరే ఈ సీరియల్ మాత్రం తన స్థానాన్ని మారలేదు. ప్రస్తుతం అమూల్య పెళ్లి విశ్వాంత జరుగుతుందా లేదా కొత్త అబ్బాయితో జరుగుతుందా అన్న అంశం ఆసక్తిగా మారింది. గత వారంతో పోలిస్తే.. ఈ వారం 12.15 ఉంది.. ఇక రాను నీకు ఎపిసోడ్లు మరింత ఆసక్తికరంగా మారబోతున్నాయని తెలుస్తుంది. మరి ఈ సీరియల్ రెండో స్థానం నుంచి మొదటి స్థానానికి వస్తుందేమో చూడాలి..

పొదరిల్లు.. 

 గత ఏడాది బిగ్ బాస్ షో టైం లోనే ప్రేక్షకులు ముందుకు వచ్చిన సీరియల్ పోదరిల్లు ప్రస్తుతం జనాలని బాగా ఆకట్టుకుంటూ వస్తుంది.. డిసెంబర్ 22న జనాల్లోకి వచ్చిన ఈ సీరియల్ రోజురోజుకీ ఇంట్రెస్ట్ గా మారుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ముందు వచ్చిన చెవులు కన్నా వెనుక చిన్న కొమ్ములే మిన్న అన్న సామెతకు తగ్గట్లుగా టిఆర్పి రేటింగ్ ఓ రేంజ్ లో నమోదవడం మామూలు విషయం కాదు. ఇటీవల పాపులర్ ఇన్ సొంతం చేసుకున్న ఈ సీరియల్ 9.53 సొంతం చేసుకుంది.. ఈసీలు రోజురోజుకీ పాపులర్ అవడంతో అతి త్వరలోనే కార్తీకదీపం ప్లేస్ ని రీప్లే చేసేలా కనిపిస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. 

Advertisement

 ఇక మూడో స్థానంలో కొనసాగుతున్న సీరియల్ విషయానికి వస్తే బాలు సీరియల్ గుండెనిండా గుడిగంటలు ఉంది.. దీని టీఆర్పీ రేటింగ్.. 11.26 ఉండగా, ఇంటింటి రామాయణం 11.12, చిన్ని  9. 53 రేటింగ్ ను నమోదు చేసుకుంది. నిండు నూరేళ్ల మనసు 7. 62 ఉండగా, మిగిలిన సీరియల్స్ తర్వాత స్థానంలో ఉన్నాయి.. ఏది ఏమైనా కూడా పొదరిల్లు సీరియల్ వల్ల బ్రహ్మముడి సీరియల్ కూడా డౌన్ అయిపోయిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇకముందు ఈ సీరియల్ స్టోరీ రోజుకో మలుపు తిరుగుతుంది మరి టిఆర్పి రేటింగ్ ఏ మాత్రం అందుకుంటుందో చూడాలి. 

Related News

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×