E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు నూతన అభరణాలు కొంటారు

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు నూతన అభరణాలు కొంటారు
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన జనవరి 26వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

  వృత్తి వ్యాపారాలలో భవిష్యత్తు ప్రణాళికను చేస్తారు. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటబయట శుభ ఫలితాలను పొందుతారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు ఇనుమడిస్తాయి. దైవానుగ్రహం తో ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో ఉత్తమ ప్రయోజనాలు పొందుతారు. నిరుద్యోగులకు అనుకూలంగా  ఉంటుంది.

వృషభం

Advertisement

వృత్తి ఉద్యోగాలలో  అధికారులు కోపానికి గురి కావల్సి వస్తుంది. శారీరక మానసిక అనారోగ్యాలు  ఉంటాయి. ఇతరుల మీద మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. అనుకొన్న సమయానికి అనుకున్న రీతిలో పనులు పూర్తికాక ఇబ్బందికి గురవుతారు. వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్త వహించాలి. 

మిథునం

బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత కలుగుతుంది. నూతన వస్తు, వాహన సౌకర్యం పొందుతారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.  ఉద్యోగులకు అనుకూలత పెరుగుతుంది.  వ్యాపారాలు వృద్ధి చెందుతాయి.

కర్కాటకం

Advertisement

వ్యాపార ఉద్యోగాలలో అధికారుల  సహాయ సహకారాలు  అందుతాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. సంఘంలో విశేషమైన గౌరవమర్యాదలు పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి.

సింహం

వృధా ఖర్చులు చేస్తారు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి వ్యాపారమున  ఆలోచన లో స్థిరత్వం లోపిస్తుంది. శరీర ఆరోగ్య సమస్యలు కొంత కలవర పెడతాయి.  సంతాన ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. 

కన్య

పాత మిత్రులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన  పనుల్లో తొందరపాటు నిర్ణయాలు చేస్తారు.  దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

 అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. వృత్తిఉద్యోగాలలో ఆర్థిక అనుకూలత కలుగుతుంది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అన్ని వైపుల  మంచి జరుగుతుంది. కొన్ని వ్యవహారాలు ఆత్మవిశ్వాసంతో దైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు.  వ్యాపారాలు లాభిస్తాయి.

వృశ్చికం

నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు విషయంలో జాగ్రత్త వహించాలి. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. సౌకర్యాల కొరత లేకున్నా  ఇతరుల వలన ఇబ్బందులు ఉంటాయి. కారణం లేకుండానే  కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి  ఉద్యోగాలలో సమస్యలు మానసిక చింతను  కలిగిస్తాయి. 

ధనుస్సు

ఉద్యోగ విషయంలో  మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఇంట  బయట అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన వస్తువులను సేకరించి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు అనుకూల సమయం.  

మకరం

వ్యాపార వ్యవహారాలలో ఒడిదుడుకులు ఉంటాయి. ఉద్యోగ విషయమై  చెయ్యను పనికి నిందలు పడతారు. చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు అధికం అవుతాయి. బంధువుల నుండి ఋణ  వత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది.  నిరుద్యోగ ప్రయత్నాలకు నిరాశ తప్పదు.  

కుంభం

వ్యాపారాలు  సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత కలుగుతుంది. బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులలో అవాంతరాలు అధిగమించి ముందుకు సాగుతారు.  విలువైన వస్తువులు బహుమతులుగా లభిస్తాయి.

మీనం

వ్యాపారపరంగా ఆత్మ విశ్వాసంతో స్థిర నిర్ణయాలు అమలుపరచి  మంచి ఫలితాలను సాధిస్తారు. నిరుద్యోగులు లభించిన అవకాశాలను జారవిడువకుండా  చూసుకోవాలి. ఇతరులతో వివాదాలు కలిగిన విజయం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల ఆదరాభిమానాలకు పొందుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. 

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×