BigTV English

Trinayani Serial Today October 23rd: ‘త్రినయని’ సీరియల్‌:  త్రినేత్రి ఎంట్రీతో మారిపోయిన ప్రాణగండం – నిజం తెలుసుకుంటానన్న నయని

Trinayani Serial Today October 23rd: ‘త్రినయని’ సీరియల్‌:  త్రినేత్రి ఎంట్రీతో మారిపోయిన ప్రాణగండం – నిజం తెలుసుకుంటానన్న నయని

 


 trinayani serial today Episode: నీళ్లలో విశాల్‌ చేయి పెట్టగానే నీళ్లు రంగు మారిపోతాయి. అది చూసిన అందరూ షాక్‌ అవుతారు.  నీళ్లు మొత్తం ఎరుపురంగుగా మారగానే విశాల్‌ భయపడతాడు. అంటే మా అక్క చావుకు కారణ అయ్యేది విశాల్‌ బావగారేనా..? అంటుంది సుమన. పెద్దమ్మ ఇప్పుడు చెప్పు నిజం నీకు పుస్తకంలో ఎవరి పేరు కనబడింది అని విశాలాక్షి అడగ్గానే హాసిని విశాల్‌ పేరు కనబడింది అని చెప్తుంది. విధి విచిత్రం అంటే ఇదే అమ్మా.. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అమ్మవారి మీద భారం వేయడమే మిగిలింది అని చెప్పి విశాలాక్షి వెళ్లిపోతుంది.

విశాల్ ఆలోచిస్తూ కూర్చుని ఉంటాడు. తిలొత్తమ్మ వచ్చి ఏంటి నాన్నా.. అలా దిగాలుగా ఉండిపోయావు అంటుంది. నువ్వు లేక నేను లేను.. నువ్వుంటే ప్రాణమనే తమ్మీనే భార్య జీవితానికి తెర దించుతాడని ఎవరైనా అనుకుంటారా? అంటాడు వల్లభ. ఇంతలో నయని వచ్చి బాబు గారు అనుకున్నాక మీకెందుకు సమస్య బావగారు అని అడుగుతుంది. ఇది వండర్‌ తెలుసా? నయని ఇలా అంటుందని నేను ఊహించలేదు అంటుంది తిలొత్తమ్మ. మరీ ఇంత బాగా నటించాల్సిన అవసరం లేదు అత్తయ్యా అంటుంది హాసిని.


ఏయ్‌ నటించింది మమ్మీ కాదు.. నువ్వు.. అని వల్లభ అంటాడు. నయని నీళ్లు రంగు మారినందుకు నన్ను అపార్థం చేసుకుంటున్నావా? అని విశాల్‌ అడుగుతాడు. మీరు దాని గురించి ఆలోచించకండి.. రేపే ఎల్లుండో కాదు.. ఇప్పుడు ఈ క్షణం మీరు నా ప్రాణాలు పోవడానికి కారణం అయితే ఈ జన్మకు ఇంతకన్నా కావాల్సింది ఏంటని నేను కళ్లు మూస్తాను అంటుంది నయని. ఇంత ప్రేమ ఉన్నవాడివి.. నయనికి యముడివి అయ్యావని ఎలా అనిపించుకుంటావు నాన్నా అంటుంది తిలొత్తమ్మ. నీళ్లు రంగు మారితే మారాయి.. కానీ రంగులు మార్చే మీతోనే అసలు ప్రమాదం అంటున్నాను అంటుంది హాసిని.

ఇంతలో నయని కల్పించుకుని చూడండి అత్తయ్యా ఇది మా భార్యాభర్తల సమస్య .. ఇందులో ఎంత వరకు నిజం ఉందనేది అనుమానం అంటుంది నయని. నయని మీ ఆయనే నిన్ను యమలోకానికి పంపిస్తాడని తెలిశాక కూడా ఇంకా సెంటిమెంటు మాటలెందుకు అంటుంది తిలొత్తమ్మ. దీంతో విశాల్‌ ఇది జరగదు.. జరగనివ్వను.. అంటాడు. ఏమో తన ప్రమేయం లేకుండా ఏదైనా ప్రమాదం రావొచ్చేమో అంటుంది నయని.. ఇంత క్లారిటీగా ఉన్నారంటే మీ జంటను ఎవ్వరూ విడదీయలేరు అంటుంది తిలొత్తమ్మ. దీంతో మీరు తప్పా ఎవరూ లేరు అంటుంది హాసిని. హాసినిని తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతారు తిలొత్తమ్మ, వల్లభ.

విక్రాంత్‌ డల్లుగా వస్తుంటే.. ఏంటి బుల్లిబావగారు పరుగుపందెంలో అలిసిపోయిన ఎద్దుకు తాగడానికి నీళ్లు దొరకనట్టు అంత డల్లుగా వచ్చారు అని అడుగుతుంది. దీంతో ఏయ్‌ విసిగించకు పక్కకు పో అంటాడు. పక్కకు వెళితే మళ్లీ రావచ్చు కానీ పైకి పోతే మళ్లీ రాలేము కదా.. నేను అంటుంది మీకు అర్థం అవుతుందా..? అని సుమన అడగ్గానే తెలుసే నాకు తెలుసు.. చనిపోతే మళ్లీ రాలేము అనేగా అంటూ గుర్తుగా చూస్తుంటాడు విక్రాంత్‌.

ఏంటీ కొడతారా..? కొట్టండి నేనేం బాధపడను.. ఎందుకో తెలసా..? మా అక్క మరణానికి కారణం విశాల్‌ బావగానే అని తెలిసాక మనసు తేలిక పడింది. అంటూ మా అక్క విశాల్‌ బావగారిని పెళ్లి చేసుకుని కోటీశ్వరురాలు అయిందని మా ఊళ్లో అందరూ చెప్పుకుంటుంటే నేను కూడా పట్నం వచ్చి చూశాను. మా అక్కను కాదు.. ఆమె వైభవాన్ని అంటుంది. దీంతో అక్కడ మొదలైందన్నమాట అంటూ విక్రాంత్‌ కోపంగా సుమనను తిడతాడు.

గాయత్రిపాప పూసల దండ తీసుకొచ్చి నయనికి ఇస్తుంది. అది తీసుకుని గాయత్రి పాప మెడల వేస్తుంది నయని.. మాటలు రావు కానీ సైగలు మాత్రం బాగా చేస్తుంది ఈ పిల్ల అంటుంది తిలొత్తమ్మ. ఆ సైగల్లో చాలా అర్థాలు ఉంటాయి అత్తయ్యా అని చెప్తుంది హాసిని. అయితే నేను సైగలు చేస్తే ఏదేదో అంటారు అని అడుగుతాడు వల్లభ. నీ సైగల్లో చాలా కొంటె అర్థాలు ఉంటాయి బ్రో అంటాడు లోపలి నుంచి వస్తూ విక్రాంత్‌. ఇంతలో అక్కడికి విశాల్‌ వస్తాడు. పాప మెడలో ఈ దండ బాగుంది కదా అని అడుగుతుంది నయని.

బాగుందని విశాల్‌ చెప్తాడు. ఇంతలో సుమన బతికి ఉన్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయి అంటుంది. విక్రాంత్‌ ఏమన్నావు నువ్వు అంటూ కోపంగా తిడతాడు. అరేయ్‌ నయని గురించి అన్నదని ఇక్కడున్న అందరికీ తెలుసు కానీ నువ్వు మళ్లీ అడగకు.. అంటాడు. ఇంతలో నయని ఒక్కనిమిషం విక్రాంత్‌ బాబు అంటూ సుమన ఆ మాట అని మంచే చేసింది అంటూ చనిపోయాక ఫోటోకి దండ వేస్తారు. నాకు కలలో కనిపించిన ఆ ఫోటోకు దండ ఉంది కానీ మెడలో మాత్రం అమ్మవారి బిల్ల లేదు అని చెప్తుంది నయని.

ముక్కోటి వస్తుంటే ఎలుక చచ్చిన వాసన వస్తుందేంటి అని అంటుంది వాళ్ల అత్త. దీంతో నేను వచ్చినప్పుడల్లా అలా అంటావేంటి అత్తా అంటాడు. సరే నువ్వేమైనా అను కానీ నాకు చిల్లర ఏమైనా ఇస్తావా? అని అడుగుతాడు. ఇంతలో లోపల నుంచి గంట శబ్ధం వినిపిస్తుంటే లోపలికి వెళ్తాడు ముక్కోటి. నువ్వు కూడా ఒక్క రూపాయి ఇవ్వకే త్రినేత్రి అంటుంది బామ్మ. లోపలికి వెళ్లిన ముక్కోటిని అక్కడే ఆగు మామ అంటుంతి త్రినేత్రి. త్రినేత్రిని చూడగానే ముక్కోటి ఆగిపోతాడు. డోరు దగ్గరే నిలబడ్డ ముక్కోటిని లోపలికి వచ్చి తిడుతుంది బామ్మ. ఇంతలో త్రినేత్రి ఐదు వందలు ముక్కోటికి ఇస్తుంది ఆ డబ్బులు తీసుకుని వెళ్లిపోతాడు ముక్కోటి.

నీ మెడలో బిళ్లను గజగండ లాగిపారేస్తే అమ్మవారు వచ్చారని చెప్పావు అంటుంది తిలొత్తమ్మ. అవును మళ్లీ అమ్మవారే నీ మెడలో కట్టారని చెప్పావు నాకు బాగా గుర్తుంది అంటాడు వల్లభ. ముందు మా అక్క ఏదో చెప్తుంది. అది వినండి బావగారు అంటుంది సుమన. నయని నువ్వు ఏదో ఆలోచిస్తున్నాను అందులో ఏదో నిజమే ఉందనిపిస్తుంది. ఏంటది అని విశాల్‌ అడుగుతాడు. అవును బాబుగారు నామెడలో అయితే అమ్మవారి బిల్ల ఉంది. కానీ ఫోటోలో లేనట్టు అనిపించింది.

నేను అద్దంలో కనిపించినప్పుడు కూడా నా మెడలో అమ్మవారి బిల్ల కూడా లేదు. ఇంతలో మమ్మీ ఈ బిల్ల గోల ఏంటి మమ్మీ అంటాడు వల్లభ. అలా అంటే కళ్లు పోతాయి.. మీ అమ్మకు ఆలెరెడీ పోయాయి అంటుంది హాసిని. నీ మెడలో అమ్మవారి బిల్ల లేదంటే ఆది పోగొట్టుకుంటేనే నీకు ప్రాణగండం వస్తుదనా అర్థం అని అడుగుతాడు. అదే నాకు అర్థం కావడం లేదు బాబుగారు అంటుంది నయని. ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్‌ ఏపిసోడ్‌ కు ఎండ్‌ కార్డు పడుతుంది.

Related News

Dhee Bhoomika : ఢీ కంటెస్టెంట్ కి భారీ యాక్సిడెంట్… కారు తుక్కు తుక్కు

Smriti Irani: ఒక్క ఎపిసోడ్ లక్షల్లో రెమ్యూనరేషన్.. ఏమాత్రం తగ్గని మాజీ మంత్రి క్రేజ్!

Bindas Brothers: పేరుకే సెలబ్రిటీలం… సంపాదన మాత్రం నిల్.. బిందాస్ బ్రదర్స్ కన్నీటి కష్టాలు!

Big TV Kissik talks: తట్టుకోలేక సూసైడ్ అటెంమ్ట్ చేశా.. కిస్సిక్ షోలో అమర్‌దీప్ ఎమోషనల్!

Telugu TV Serials: ఈ వారం టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన సీరియల్స్.. గుండెనిండా గుడిగంటలు పరిస్థితి ఏంటి..?

Nindu Noorella Saavasam Serial Today August 8th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్ర విషయంలో ఆరుతో బాధపడ్డ మిస్సమ్మ

Big Stories

×