BigTV English

Hezbollah Hashem Safieddine: హిజ్బుల్లా తదుపరి నాయకుడు హషెం సఫీద్దీన్ మృతి.. ధృవీకరించిన ఇజ్రాయెల్ సైన్యం

Hezbollah Hashem Safieddine: హిజ్బుల్లా తదుపరి నాయకుడు హషెం సఫీద్దీన్ మృతి.. ధృవీకరించిన ఇజ్రాయెల్ సైన్యం

Hezbollah Hashem Safieddine| లెబనాన్ లోని హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ తదుపరి నాయకుడు హషెం సఫీద్దీన్ కొన్ని రోజుల క్రితమే చనిపోయాడని.. ఇజ్రాయెల్ సైన్యం బుధవారం ఉదయం ప్రకటించింది. సెప్టెంబర్ నెలలో హిజ్బుల్లా అగ్రనాయకుడు హసన్ నస్రల్లాని ఒక భారీ రాకెట్ బాంబుతో దాడి చేసి ఇజ్రాయెల్ సైన్యం హత్య చేసింది. హిజ్బుల్లా హెడ్ క్వార్టర్స్ లో హసన్ నస్రల్లా ఉండగా ఈ దాడి జరగడంతో ప్రపంచదేశాలన్నీ ఆశ్చర్యపోయాయి.


హషెం సఫీద్దీన్‌తో పాటు హిజ్బుల్లా ఇంటెలిజెన్స్ కమాండర్ అలి హుస్సేన్ హజీమా కూడా ఇజ్రాయెల్ చేసిన దాడిలో చనిపోయాడని సమాచారం. దీనికి సంబంధించి ఇజ్రాయెల్ సైన్యం ట్విట్టర్ ఎక్స్ లో ఒక అధికారిక పోస్ట్ చేసింది. ”హిజ్బుల్లా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చీఫ్ హషెం సఫీద్దీన్, హిజ్బుల్లా ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్ట‌ర్స్ కమాండర్ అలి హుస్సేన్ హజీమా ఇద్దరూ లెబనాన్ లోని దహియో ప్రాంతంలోని హిజ్బుల్లా మెయిన్ ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్ పై జరిగిన దాడిలో దాదాపు మూడు వారాల క్రితమే చనిపోయారు. ” అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ పోస్ట్ చేసింది. మరోవైపు హషెం సఫీద్దీన్ మృతిపై హిజ్బుల్లా తరపు నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

Also Read: ప్రజలు చనిపోతుంటే విలాసాల్లో నాయకుడు.. యహ్యా సిన్వర్ టన్నెల్ వీడియో బయటపెట్టిన ఇజ్రాయెల్


హషెం సఫీద్దీన్ ఎవరు?
హిజ్బుల్లా అగ్రనాయకుడు హసన్ నస్రల్లాకు (Hasan Nasrallah) సన్నిహితుడు, బంధువు అయిన హషెం సఫీద్దీన్ హిజ్బుల్లా మిలిటరీ కార్యకలాపాలకు నేతృత్వం వహించే జిహాద్ కౌన్సిల్, హిజ్బుల్లా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కు కీలక సభ్యుడు. దీంతో పాటు హిజ్బుల్లా ఆర్థిక, పరిపాలన వ్యవహారాల బాధ్యత కూడా ఇతనే చూసుకునేవాడు. చాలా కాలంగా హిజ్బుల్లా అగ్రనేత హసన్ నస్రల్లా అనారోగ్యం కారణంగా, ఇతర భద్రతా కారణాల వల్ల బహిరంగ సమావేశాలకు హాజరయ్యేవాడు కాదు. దీంతో ఆయన బాధ్యతలన్నీ హషెం సఫీద్దీన్ వహించేవాడు. ముఖ్యంగా ఇజ్రాయెల్ గాజా యుద్ధం ప్రారంభమైన తరువాత హషెం సఫీద్దీన్.. హిజ్బుల్లా అధికార ప్రతినిధిగా చాలా సార్లు ప్రసంగాలు చేశాడు.

హిజ్బుల్లా అగ్రనాయకుడు హసన్ నస్రల్లా విదేశాలకు వెళ్లినప్పుడల్లా అతని ప్రతినిధిగా హిజ్బుల్లాను ముందుకు నడిపే బాధ్యత హషెం సఫీద్దీన్ పై ఉండేది. గత కొన్ని సంవత్సరాలుగా ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా హషెం సఫీద్దీన్ నిర్ణయాలు తీసుకునేవాడు.

Also Read: ‘ఇది మీ దేశం కాదు’.. ఆస్ట్రేలియా పార్లమెంటులో బ్రిటన్ రాజుకు ఘోర అవమానం

మిలిటెంట్ గ్రూప్‌తో పాటు హిజ్బుల్లా.. లెబనాన్ లో ఒక రాజకీయ పార్టీ కూడా. హిజ్బుల్లా రాజకీయ వ్యవహారాలు, నిర్ణయాల తీసుకునేందుకు షురా కౌన్సిల్ ఉంది. ఈ కౌన్సిల్ లో కూడా సఫీద్దీన్ కీలక సభ్యుడు. అంటే లెబనాన్ రాజకీయాలు, ఇజ్రాయెల్ వ్యతిరేక విధానాలు రూపొందించడంలో హషెం సఫీద్దీన్ ముఖ్య పాత్ర పోషించాడు.

హషెం సఫీద్దీన్ (Hashem Saffieddin) మృతిపై ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ లెఫ్టెనెంట్ హర్జి జలేవీ మట్లాడుతూ.. “నస్రల్లాను, అతని వారసుడు సఫీద్దీన్, మిగతా హిజ్బుల్లా సీనియర్ నాయకులందరినీ ముగించేశాం. ఇజ్రాయెల్ దేశానికి, ఇజ్రాయెల్ పౌరులకు హాని కలిగించాలని ప్రయత్నించే ఎవరినైనా మట్టుబెడతాం” అని చెప్పారు.

మరోవైపు లెబనాన్ లో ఇజ్రాయెల్ వరుసగా డ్రోన్ దాడులు చేస్తోంది. దీంతో పాటు ఇజ్రాయెల్ సైన్యం దక్షిన లెబనాన్ లోని హిజ్బుల్లా స్థావరాలపై దాడుల చేస్తోంది. ఇప్పటివరకు ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్ లో దాదాపు 1500 మంది చనిపోయారని సమాచారం.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×