E-Paper
Advertisement

Trinayani Serial Today Episode: పాయసంలో విషం పెట్టి గాయత్రిని చంపాలనుకున్న తిలోత్తమ్మ.. ఎలుక ఏం చేసిందటే..!

Trinayani Serial Today Episode: పాయసంలో విషం పెట్టి గాయత్రిని చంపాలనుకున్న తిలోత్తమ్మ.. ఎలుక ఏం చేసిందటే..!
Advertisement
Trinayani Serial Today September 12th Episode: కిచెన్ లో  పాయసం చేస్తున్న తిలోత్తమ దగ్గరకు వల్లభ వెళ్లి తన డ్రెస్ ఎలా ఉందని అడుగుతాడు. దీంతో తిలోత్తమ సైలెంట్గా ఉండమని చెప్తుంది. ఏమైందని వల్లభ అడగ్గానే తాను పాయసం చేస్తున్నాని చెప్తుంది తిలొత్తమ. అయితే పాయసం సైలెంట్ గానే ఉంటుంది.  అనగానే తిలోత్తమ్మ వల్లభ జేబులో చేయి పెట్టి అందులోంచి పాయిజన్ సీసా తీస్తుంది. దీంతో వల్లభ షాక్ అవుతూ ఏంటి మమ్మీ నా జేబులోంచి తీశావు అని అడగ్గానే విషం అని తిలొత్తమ్మ చెప్తుంది. వల్లభ భయపడిపోతాడు. వెంటనే ఆ పాయిజన్ ను పాయసంలో వేసి కలుపుతుంది తిలొత్తమ్మ. అది నువ్వు తింటావా? మమ్మీ అని వల్లభ అడగ్గానే ఇది వినాయకుడి పూజలో నైవేద్యంగా పెడతానని చెప్తుంది. పవిత్రమైన ప్రసాదం అని అందరూ తింటారు కదా మమ్మీ అనగానే నేను నాటకం ఆడి మనకన్నా ముందు అందులో విషం కలిసింది అని నయనికి తెలియాలి అంటుంది. అప్పుడే దొంగ ఏడుపు ఏడిసి నాటకం ఆడతాను అంటుంది. అయితే ఒకవేళ గాయత్రి పాప పాయసం తాగి చనిపోతే ఎలా అని వల్లభ అడగ్గానే.. అప్పుడు నయని జరగబోయేది కనిపెట్టలేకపోయిందని చెబుదాం అంటుంది తిలొత్తమ్మ.
మరోవైపు విక్రాంత్ వాళ్లు వినాయక పూజకు అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు. ఇంతలో అక్కడికి పాసయం తీసుకుని తిలొత్తమ్మ, వల్లభ, సుమన వస్తారు. ఇంకా పనులు పూర్తి కాలేందేంటని తిలొత్తమ అడుగుతుంది. అయితే మీరేం చేశారని పాయసం రుచి చూశారా? అంటూ  హాసిని ప్రశ్నిస్తుంది. ఎందుకు చెల్లి అలా మాట్లాడుతున్నావు అంటూ సుమన అడగడంతో మా ఆయన అలాంటి వాడేలే అక్కా అంటుంది.
నయనిని పూజ మొదలుపెట్టమన్న విక్రాంత్
ఇంతలో అక్కడికి నయని వస్తుంది. విక్రాంత్ పూజ మొదలు పెట్టండని చెప్తాడు. ఇంతలో సుమన విశాల్ బావను తీసుకురాలేదేంటని అడుగుతుంది. పాపం చేయి అలా అయ్యాక విశాల్ ఇంట్లో వాళ్లకు కూడా కనిపించడం లేదని తిలొత్తమ్మ వెటకారంగా మాట్లాడుతుంది. వల్లభ కూడా విశాల్ ను కించపరుస్తూ మాట్లాడటంతో నయని బాధపడుతుంది. ఇంతలో హాసిని వల్లభ, తిలొత్తమలను తిడుతుంది. దురంధర ఆపండని పూజ మొదలు పెట్టండని చెప్పి పూజ పూర్తి అయ్యాక ప్రసాదం తీసుకెళ్లి విశాల్ కు పూజ ఫలం దక్కినట్టేనని చెప్తుంది. దీంతో పూజ మొదలు పెట్టే ముందు నయని గణపతిని ప్రార్థిస్తుంది. విశాల్ బాబుకు మంచి జరగాలంటే  గజగండ తీసుకెళ్లిన పంచకమణి మళ్లీ మా చేతికి రావాలని అది సవ్యంగా తమ దగ్గరకు వచ్చేటట్టు చూడు స్వామి అని వేడుకుని పూజ మొదలుపెడుతుంది నయని.  మా అక్క కష్టాన్ని తొలగించడానికి ఆ పంచకమణి కావాలి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ మణి మన ఇంటికి రావాలని అందరూ దండం పెట్టుకోండని సుమన చెప్తుంది. సరే అని అందరూ దండం పెట్టుకుంటుంటే.. తిలొత్తమ్మ నేను తీసుకొచ్చిన పాయసంలో విషం ఉందని నయని ఇంకా ఎందుకు గ్రహించలేదు అని మనసులో అనుకుంటుంది.
నయనికి ధైర్యం చెప్పిన హాసిని
  ఇంతలో హాసిని, నయనిని హారతి వెలిగించమని చెప్తుంది. నయని బాధగా చూస్తుంటుంది. ఇంతలో దురందర నయనికి ధైర్యం చెప్తుంది. విక్రాంత్ కూడా వదినకు ఉన్న ధైర్యం మన ఇంట్లో ఎవ్వరికీ లేదని అంటాడు. ఇంతలో వల్లభ మమ్మీ కూడా సర్పదీవికి వెల్లి వచ్చింది కదరా? అంటాడు. అయితే వెళ్లి వచ్చింది ఆవిడేనా? అన్న డౌట్ నాకు ఇంకా ఉందని హాసిని అంటుంది. దీంతో నువ్వు ఏమైనా అనుకో నా కొడుకులు నన్ను గుర్తుపట్టారా? లేదా అన్నదే నాకు ముఖ్యం అంటుంది తిలొత్తమ్మ. ఇప్పుడు గొడవలు ఎందుకు అక్కా హారతి ఇవ్వండి ముందు అని సుమన చెప్పగానే నయని హారతి ఇస్తుంది. తర్వాత పూజ అయిపోతుంది.
పాయసం కిందపడేసిన ఎలుక
మాకు హారతి ఇచ్చారు మరి గాయత్రి పాపకు ఏమిస్తారు అని వల్లభ అడగ్గానే ప్రసాదం ఇవ్వండని తిలొత్తమ్మ చెప్తుంది. ఆ పాయసం ఇస్తే డ్రస్ మీద పోసుకుంటుంది అని విక్రాంత్ అంటాడు. ఇంతలో దురందర పాయసం తీసుకుని తిలొత్తమ్మ వదినకు ఇద్దాం అంటుంది. దీంతో వల్లభ ఏంటి మమ్మీకా? అంటూ కంగారుగా అడుగుతాడు. దీంతో అందరూ తినకూడనిది ఏమైనా చేశారా? అంటూ అడగ్గానే అదేం లేదని వల్లభ చెప్పగానే  హాసిని తీసుకుని తిలొత్తమ్మకు ప్రసాదం పెట్టబోతుంటే నాకేం వద్దని ముందు గాయత్రికి పెట్టమని తిలొత్తమ్మ చెప్పడంతో సుమన పాయసం తీసుకుని తినబోతుంటే విక్రాంత్ ఆపి పూజా ఏర్పాట్లు చేయని సుమన ఎందుకు ముందు ప్రసాదం తీసుకోవాలి నేను కష్టపడ్డాను నేనే తీసుకుంటాను అంటాడు. దీంతో హాసిని కూడా తాను ఎక్కువ కష్టపడ్డాను అంటుంది. ఇలా అందరూ ప్రసాదం కోసం గొడవ పెట్టుకుంటారు. ఇంతలో ఒక ఎలుక వచ్చి పాయసాన్ని కిందపడేసి వెళ్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. ఇంతటితో త్రినయని ఈరోజ ఏపిసోడ్ అయిపోతుంది.

Related News

Gundeninda GudiGantalu Today episode: కన్నీళ్లు పెట్టుకున్న మీనా.. బాలుకు నిజం తెలుస్తుందా..? ఇది కదా అసలు ట్విస్ట్..

Podarillu Today Episode : గ్రాండ్ గా బర్త్ డే వేడుక.. చక్రీ ప్లాన్ సక్సెస్.. చక్రీకి దిమ్మతిరిగే షాకిచ్చిన మహా..

Nindu Noorella Saavasam Serial Today Episode July 21st ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌కు నిజం చెప్పిన ఎస్సై  

Illu Illalu Pillalu Today Episodes: అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి.. నర్మదకు భద్రపై అనుమానం.. వేదవతి ఫుల్ హ్యాపీ..

Intinti Ramayanam Today Episode: పాపం మీనాక్షికి కన్నీళ్లు.. పల్లవి, కమల్ రొమాన్స్.. యోగా టీచర్ ఎంట్రీ అదుర్స్..

Brahmamudi Serial Today Episode July 21st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: దుగ్గిరాల ఇంటికి వచ్చిన రాజు   

Actress Sirisha : నటి శిరీష నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Godhavari Janu : ‘గోదావరి ‘ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. హీరోయిన్ అవుట్..

Big Stories

Advertisement
×