BigTV English
Advertisement

Nindu Noorella Saavasam Serial: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఈరోజు ఎపిసోడ్

Nindu Noorella Saavasam Serial: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఈరోజు ఎపిసోడ్
Nindu Noorella Saavasam serial today September 12th Episode: తన వాళ్ళ గురించి అమర్ కు తెలుసని కానీ ఎందుకో నిజం బయట పెట్టడం లేదని అరుంధతి అనుకుంటుంది. మిస్సమ్మకు చెప్పి నిజం రాబట్టాలనుకుంటుంది. వెంటనే మిస్సమ్మ దగ్గరకు వెళ్లి ఆరు గురించి మీ ఆయన తెలుసుకున్నారా? అని అడుగుతుంది. దీంతో భాగీ లేదంట అక్క అని చెప్పగానే నాకెందుకో మీ ఆయన అన్ని తెలుసుకుని ఉంటాడనిపిస్తుంది కానీ మీకు నిజం చెప్పడం లేదేమోనని అంటుంది. భాగీ కూడా అవును అక్కా ఆయన అనాథ ఆశ్రమానికి వెళ్లి వచ్చినప్పటి నుంచి  ఏదోలా ఉన్నాడు. అనవసరంగా మొన్న నాపై కోపం తెచ్చుకున్నారు అంటుంది భాగీ. అయితే నువ్వే ఎలాగైనా ఆయన నుంచి నిజం తెలుసుకోవాలని ఆరు చెప్పడంతో అవునని భాగీ అంటుంది.
 మనోహరికి వార్నింగ్ ఇచ్చిన రణవీర్
  మరోవైపు రణవీర్ కారుకు ఎదురుగా మనోహరి వెళ్తుంది. దీంతో రణవీర్ కోపంగా కారు దిగి వచ్చి ఏంటి మనోహరి చావాలని అంత ఆశగా ఉందా? బతుకు మీద విరక్తి వచ్చిందా? నాకే ఎదురొస్తున్నావు అంటాడు. దీంతో మనోహరి కోపంగా రణవీర్ను  ఏం కావాలి నీకు చెప్పు ఏం కావాలి నీకు. ఎందుకు నన్ను ఇలా హింసిస్తున్నావు. మన పెళ్లిలో ప్రేమ లేదు నాకు నీతో బతకాలని లేదు. ఆ ఇంట్లో నాకు సంతోషమే లేదు. అయినా నువ్వెందుకు నావెంట పడుతున్నావు అంటూ నిలదీస్తుంది. దీంతో రణవీర్ తనకు దుర్గ కావాలని..  తనతో నేను కోల్పోయిన జీవితం కావాలని అది నువ్వు తిరిగి తెచ్చి ఇవ్వగలవా? నువ్వు చేసిన తప్పులకు నేను పాత రణవీర్ అయ్యుంటే నిన్ను ఎప్పుడో చంపేవాణ్ని కానీ నాకు ఇప్పుడు కావాల్సింది నీ చావు కాదు నా దుర్గ అని రణవీర్ చెప్పగానే మనోహరి ఆలోచించి  ఏంటి రణవీర్ నీ గురించి నాకు తెలిసి కూడా నీ కూతురుని నీకు అప్పగిస్తానని ఎలా అనుకున్నావు.
నేను నీ కూతురును నీకు అప్పగించిన మరుక్షణం నువ్వు నన్ను ప్రాణాలతో వదలవని నాకు తెలుసు అనగానే రణవీర్ కోపంగా ఏయ్ ఇన్ని సార్లు దుర్గ గురించి మాట్లాడావు కదా.. ఒక్కసారి కూడా నా కూతురు అని పలకవా? అని రణవీర్ అడగ్గానే పలకనని మన పెళ్లి సరిగ్గా జరగలేదని చెప్తుంది మనోహరి.  దీంతో తిన్నింటి వాసాలు లెక్కపెట్టే నువ్వు.. నీ ఫ్రెండును చంపి తన జీవితాన్ని నీకు కావాలని తిరుగుతున్నావు చూడు అని రణవీర్ అనగానే మనోహరి షాక్ అవుతుంది. ఇంతలో తేరుకుని అమర్తో నా జీవితం సెట్ అయ్యేదాకా నీ కూతురు గురించి నీకు చెప్పను అంటుంది. దీంతో కోపంగా నా కూతురు గురించి నీతోనే చెప్పిస్తానని రణవీర్ వెళ్లిపోతాడు రణవీర్.
మిస్సమ్మను భాగీ అంటూ ప్రేమగా పిలిచిన అమర్
  మరోవైపు రూంలో ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్న అమర్ మిస్సమ్మను భాగీ అని పేరు పెట్టి పిలుస్తాడు. కిచెన్ లో ఉన్న భాగీ హ్యాపీగా పైకి పరుగెత్తుకువెళ్తుంది. అది చూసిన శివరాం, నిర్మల హ్యాపీగా ఫీలవుతారు. చూశావా నిర్మల.. భాగీ ఒక్క పిలుపునకే ఇంతలా పరుగెడుతుంది అంటే ఇంక ప్రేమ పంచితే ఇంకెంత ఆనందిస్తుందో  కదా అనగానే అవునండి అమర్ మిస్సమ్మను ప్రేమతో స్వీకరించే రోజు కోసం కోటి కళ్లతో నేను ఎదురుచూస్తున్నాను అంటుంది నిర్మల. పైకి వెళ్లిన భాగీని అమర్ ఎదురుగా వచ్చినా కూడా ఉలకవు, పలకవు ఏంటి అని అడగ్గానే మీరు మొదటిసారి నన్ను పేరు పెట్టి పిలిచారు అందుకే పలకలేకపోయా?  అంటుంది భాగీ.  అమర్ మాత్రం అదేంటి ఎప్పుడు నీ పేరుతోనే కదా పిలుస్తాను. ఇవాళ కొత్తగా ఏం పిలిచాను అంటాడు. అయితే ఇవాళ మీరు నన్ను భాగీ అని పిలిచారు అంటుంది భాగీ. దీంతో అమర్ లేదు నేను నిన్ను మిస్సమ్మ అనే కదా పిలిచాను అంటూ తాను భాగీ అని పిలిచింది గుర్తు చేసుకుంటాడు అమర్. దీంతో భాగీ హ్యాపీగా ఫీలవుతుంది. వెంటనే అమర్.. మిస్సమ్మ అని పిలవడం అలవాటైపోయింది. భాగీ అని పిలవడానికి కొంచెం టైం పడుతుంది అని అది కాదు విషయం  వినాయక చవితి వస్తుంది కదా మీ నాన్న, పిన్నిని రమ్మని చెప్పు అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం అని అమర్ చెప్పగానే..  నేను పిలిస్తే రారని.. అదే మీరు పిలిస్తే వస్తారు అని భాగీ చెప్పగానే.. అయితే  నువ్వు రెడీ అవ్వు ఇద్దరం కలిసి  మీ ఇంటికే వెళ్లి పిలుద్దాం అని అమర్ చెప్పగానే భాగీ హ్యాపీగా ఫీలవుతుంది.
 రణవీర్ ను చంపేందుకు మనోహరి ప్లాన్
 మరోవైపు మనోహరి, బాబ్జీని కలిసి రణవీర్ను ఏదో ఒకటి చేయాలని చెప్తుంది. దీంతో సరేనని చెప్పి చంపాల్సి వస్తే ఆ రణవీర్ ను చంపేస్తానని చెప్తాడు బాబ్జీ.  మరోవైపు రామ్మూర్తి పడుకుని ఉంటే మంగళ తిడుతుంది. ఏం సాధించావని ప్రశాంతంగా పడుకున్నావని నిట్టూరుస్తుంది. రామ్మూర్తి, మంగళ గొడవపడుతుంటే ఇంతలో భాగీ, అమర్ వస్తారు. వినాయకచవితికి రమ్మని పిలవగానే రామ్మూర్తి మొహమాట పడుతుంటాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.


Related News

Big tv Kissik Talks: చైతన్య మాస్టర్ మరణం పై రాజు ఎమోషనల్… ఆఖరి మాటలు అవే అంటూ!

Big tv Kissik Talks: జానీ మాస్టర్ అరెస్ట్ .. అలా చేయకుండా ఉండాల్సింది.. ఢీ రాజు కామెంట్స్ వైరల్!

Big tv Kissik Talks: సూసైడ్  ఆలోచన చేసిన ఢీ రాజు.. ఊపిరి ఆడలేదంటూ!

Sai Kiran: 46 ఏళ్ల వయసులో తండ్రి.. ఘనంగా నటి సీమంతం.. వీడియో షేర్‌ చేసిన హీరో!

Nindu Noorella Saavasam Serial Today November 8th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  బ్లాక్ మ్యాన్ గురించి నిజం తెలుసుకున్న మిస్సమ్మ 

Illu Illalu Pillalu Today Episode: నర్మదకు భద్ర స్ట్రాంగ్ వార్నింగ్.. ఇంట్లో రచ్చ చేసిన శ్రీవల్లి..భాగ్యం దెబ్బకు ఆనందరావుకు షాక్..

Brahmamudi Serial Today November 8th:‘బ్రహ్మముడి’ సీరియల్‌: కూయిలీని చంపాడని రాహుల్ ను అరెస్ట్ చేసిన పోలీసులు    

Intinti Ramayanam Today Episode: మీనాక్షి పై అనుమానం.. నిజం తెలిసిపోతుందా..? చక్రధర్ కు టెన్షన్..

Big Stories

×