BigTV English

Flood damages: రూ.5,438కోట్ల వరద నష్టం.. కేంద్ర ప్రభుత్వానికి నివేదిక!

Flood damages: రూ.5,438కోట్ల వరద నష్టం.. కేంద్ర ప్రభుత్వానికి నివేదిక!

State Government Report to Central Team Flood damages:  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. దీంతో వరదలు, వాగులు, వంకలు ఉగ్రరూపం దాల్చాయి. ఈ వరదల కారణంగా సంభవించిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందం రాష్ట్రంలో పర్యటించింది. కర్నల్ కేపీ సింగ్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం సీఎస్, ప్రభుత్వ సీనియర్ అధికారులతో చర్చలు జరిపింది. ఈ మేరకు ప్రభావిత ప్రాంతాల్లో సంభవించిన వరద నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి నివేదించారు.


తెలంగాణలో సంభవించిన నష్టం విలువ రూ.5,438కోట్లుగా ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశామని తెలిపారు. పూర్తిస్థాయి అంచనా ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. వాతావరణ శాఖ అలర్ట్ చేసిన వెంటనే అతి తక్కువ సమయంలోనే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల కారణంగా ప్రాణ నష్టాన్ని తగ్గించామన్నారు. కాగా, ముంపు ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు వేగంగా చేయడంతోపాటు బాధితులకు సాయం అందేందుకు వీలుగా మార్గదర్శకాలను సులభతరం చేయాలని కోరింది.

ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలోని వరదప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర విపత్తు నిర్వహణ బృందాలు పర్యటించాయి. మొత్తం ఆరుగురు సభ్యులు రెండు బృందాలుగా విడిపోయి ఖమ్మం జిల్లాలోని కూసుమంచి, ఖమ్మం గ్రామీణం, తిరుమలాయపాలెం మండలాల్లో తొలిరోజు క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులు, రైతుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ సలహాదారు, కేంద్ర హోం శాఖ జాయింట్ డైరెక్టర్ కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్, ఆర్థిక శాఖ డిప్యూటీ డైరెక్టర్ మహేశ్ కుమార్, వ్యవసాయ శాఖ నుంచి శాంతినాథ్ శివప్ప ఒక బృందంగా పర్యటించారు. రెండో బృందంలో రోడ్లు భవనాల శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎస్ కే కుశ్వంగ, గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి టినైల్ ఖాన్సూన్, ఎస్ఆర్ఎస్‌సీ నుంచి శశివర్ధన్ రెడ్డి పర్యటించారు.


Also Read: మందుబాబులకు భారీ శుభవార్త.. అక్టోబర్ 1 నుంచి..

తొలుత కూసుమంచి మండలం భగత్ వీడుకు చేరుకున్న అధికారులు బృందం దెబ్బతిన్న పంటను పరిశీలించారు. కోతకు గురైన ఇసుక మేటలు వేసిన పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ మేరకు రైతులు పంట నష్టంపై అన్నదాతలు తమకు జరిగిన నష్టాన్ని బృంద సభ్యులకు వివరించారు. అనంతరం జాతీయ రహదారిపై పాలేరు నియోజకవర్గంలో జరిగిన వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకించారు.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×