BigTV English
Advertisement

Trinayani Serial Today September 15th: ‘త్రినయని’ సీరియల్‌: గాయత్రిని చంపేస్తానన్న గజగండ – నయనిని అవమానించిన సుమన

Trinayani Serial Today September 15th: ‘త్రినయని’ సీరియల్‌: గాయత్రిని చంపేస్తానన్న గజగండ – నయనిని అవమానించిన సుమన

trinayani serial today Episode: గాయత్రి పాపే గాఢ నిద్రలో ఉన్న నన్ను నిద్రలేపి ఇక్కడికి తీసుకొచ్చింది కాబట్టి సరిపోయింది అంటాడు విశాల్‌. హాసిని వెళ్లి గాయత్రి పాపను ఎత్తుకుని నీవల్లే ఆ మాంత్రికుడు ఇక్కడి నుంచి పారిపోయాడని ముద్దాడుతుంది. దీంతో ఎప్పుడు ఎవరి రూపంలో వస్తాడో తెలియడం లేదు. జాగ్రత్తగా ఉండకపోతే కష్టమే అని తిలొత్తమ బెదిరిస్తుంది. దీంతో అందరూ షాక్‌ అవుతారు.


గాయత్రి పాపను చంపేస్తాను: గజగండ

తర్వాత వల్లభ, తిలొత్తమ్మ గజగండ దగ్గరకు వస్తారు. గజగండను చూసిన వల్లభ ఏ రూపంలోనో వస్తావనుకున్నాను కానీ నీ రూంలోనే వచ్చావు అంటాడు. అయితే మీరు గుర్తుపట్టాలని నా రూపంలోనే వచ్చానని చెప్తాడు గజగండ. దీంతో నువ్వు విశాల్‌ రూపంలో వచ్చినా ఆ గాయత్రి పాప గుర్తు పట్టింది కదా? అంటుంది తిలొత్తమ్మ. ఇంతలో అసలు మా పెద్దమ్మ ఆ మణికి సంబంధిచింది అని మీకు ఎలా తెలుసో చెప్పండి గండాజీ అంటాడు వల్లభ దీంతో గజగండ ప్లాష్‌ బాక్‌ చెప్తాడు. ఆ మణికి సంబంధించిన పేపర్లు గాయత్రి దేవి ఎలా దాచి పెట్టింది. ఎక్కడ దాచిపెట్టింది. గాయత్రి దేవి గజగండకు చెప్పి విషయాలను చెప్తాడు గజగండ. అంతా విన్న వల్లభ నువ్వు ఉన్నావా? మమ్మీ అంటాడు. దీంతో వినడం ఏంటి నేను అక్కడే ఉండి అంతా చూశాను. నేను అప్పుడు గాయత్రి అక్క దగ్గర నేను సెక్రటరీ అయితే గజగండ అకౌంటెంట్‌ గా చేసేవాడు. ఆ మణి కోసం మంత్రాలు నేర్చుకున్నాడు అని తిలొత్తమ్మ చెప్తుంది. తర్వాత మనకు ఆ గాయత్రి పాప అడ్డొస్తుందని తిలొత్తమ్మ చెప్పగానే ఆ గాయత్రిని ఏదైనా చేస్తాను అంటాడు గజగండ.


సుమన తల పగులగొట్టిన గాయత్రి దేవి

మరోవైపు కాలింగ్‌ బెల్‌ మోగుతుంటే దురందర అసహనంగా వెళ్లి డోర్‌ తీస్తుంది. ఎదురుగా వచ్చిన వల్లభ, తిలొత్తమ్మ లను చూసి షాక్‌ అవుతుంది. కోపంగా మెయిన్‌ డోర్‌ ఎందుకు క్లోజ్‌ చేశారని తిలొత్తమ్మ అడుగుతుంది. దీంతో విక్రాంత్‌ దొంగల వస్తారని వేశాము అంటాడు. హాసిని వచ్చారు కదా? అదే అత్తయ్యా మా ఆయన ఇక దొంగల ఎక్కడి నుంచి వస్తారు.. అనగానే గజగండ ఏక్కడి నుంచి వస్తాడో అని భయంతో పిన్ని తలుపులు వేసి బాబాయ్‌ ని కాపలాగా పెట్టింది అని సుమన చెప్తుంది. ఇంతలో ఎవ్వరూ బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటే బాగుంటుందని నయని చెప్తుంది. ఇంట్లోనే ఉండటానికి మాకేమైన కాళ్లు చేతులు పడిపోయాయా? ఏంటి అని వల్లభ వెటకారంగా మాట్లాడటంతో అవి పోతే బాగుండని కోరుకుంటున్నావా? ఏంటి? అంటుంది హాసిని.

Also Read: సైమా అవార్డ్స్ 2024 : నాని సినిమాలకు 8 అవార్డులు.. విజేతలు వీరే

దీంతో తిలొత్తమ్మ కోపంగా తమాషా చేసింది చాలు కానీ ఎందుకైనా మంచిది పిల్లల్ని కూడా ఒక కంట కనిపెడుతూనే ఉండండి అంటుంది. దీంతో విశాల్‌ ఏమైందమ్మా ఏదైనా సమస్యనా.. అని అడుగుతాడు. ఆ గజగండ పెద్దవాళ్లలాగే రాగలిగాడు. ఇక పిల్లల్లా రాలేడా? చెప్పండి అని చెప్పడంతో అందరూ షాక్‌ అవుతారు. అలా వచ్చినా తెలియక మా అక్క పాలు పట్టినా పడుతుంది అంటూనే ఇంకా చూసుకోకుండా ఉంటే ఆ గజగండ మా అక్క బెడ్‌ రూంలోకి దూరినా దూరేవాడు అంటూ సుమన అంటుంటే ఇంతలో గాయత్రి దేవి ఫోటో వచ్చి సుమన తలపై పడుతుంది. సుమన కింద పడిపోతుంది. అందరూ కంగారుపడుతుంటారు. ఇంతలో గాయత్రి పాప నీళ్లు తీసుకొచ్చి సుమన మీద పోస్తుంది. సుమన లేచి తనను ఎవరు కొట్టారని అడుగుతుంది. గాయత్రిదేవి ఫోటో వచ్చి తగిలిందని చెప్తారు. దీంతో సుమన మళ్లీ నయనిని తిడుతుంది. నయని పాపను తీసుకుని లోపలికి వెళ్తుంది.

సుమనకు వార్నింగ్‌ ఇచ్చిన విక్రాంత్‌

తర్వాత బెడ్‌ రూంలో ఉన్న సుమన దగ్గరకు విక్రాంత్‌ వెళ్లి నువ్వు రేపు ఫ్రీగా ఉంటావు కదా? అని అడుగుతాడు. నేను ఎప్పుడు బిజీగా ఉన్నాను.. అని ఎదురు బదులిస్తుంది సుమన. దీంతో ఎప్పుడూ వాళ్లను వీళ్లను ఆడిపోసుకుంటూ బిజీగా ఉంటావు కదా? అందుకే అడిగాను అని విక్రాంత్‌ చెప్పడంతో సుమన ఇరిటేటింగ్‌ గా విక్రాంత్‌ ను తిడుతుంది. దీంతో నీకోసం రేపు పంచ్‌ టీవీ వాళ్లు వస్తారట నీ ఇంటర్వూ కావాలని అడుగుతున్నారు అని చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. సుమన గాయత్రిదేవి ఫోటోను హాల్‌ లోంచి తీసి స్టోర్‌ రూంలో వేయమనండి అంటుంది. దీంతో ఇంకొక్క మాట మాట్లాడినా నీ ఫోటో గోడమీద పెట్టాల్సి వస్తుందని విక్రాంత్‌ హెచ్చరించి వెళ్లిపోతాడు విక్రాంత్‌.

తిలొత్తమను ఆడుకుందామన్న వల్లభ

మరోవైపు గార్డెన్‌ కూర్చున్న వల్లభ తనకు టైం పాస్‌ కావడం లేదని ఇద్దరం కలిసి ఆడుకుందామా? అని తిలొత్తమను అడుగుతాడు. దీంతో తిలొత్తమ్మ వల్లభను తిడుతూ చిన్నపిల్లలే ఆడుకుంటాను నువ్వు కాదు అంటుంది. అయితే నువ్వు నయని, విశాల్‌ ల జీవితంతో ఆడుకుంటున్నావుగా అంటాడు. తిలొత్తమ్మ వల్లభను తిడుతూ ముందు నువ్వు గాయత్రి పాప గురించి ఆలోచించు అని చెప్తుంది. ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్‌ ఏపిసోడ్‌ కు ఎండ్‌ కార్డు పడుతుంది.

Related News

Nagababu: మాట నిలబెట్టుకున్న మెగా బ్రదర్.. బాబాయ్ కల నెరవేర్చారుగా!

TV: పెళ్లైన 5 ఏళ్లకు పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ నటి.. ఎవరంటే?

Illu Illalu Pillalu Today Episode: నర్మదపై వేదవతి కోపం.. లంచం తీసుకుంటు దొరికిన నర్మద.. శ్రీవల్లి ఫుల్ హ్యాపీ..

Brahmamudi Serial Today November 7th:‘బ్రహ్మముడి’ సీరియల్‌: కూయిలీని కొట్టిన రాహుల్‌ – వీడియో తీసిన రంజిత్‌   

Nindu Noorella Saavasam Serial Today November 7th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: బెడిసికొట్టిన మనోహరి ప్లాన్‌  

GudiGantalu Today episode: ఘనంగా సుశీల బర్త్ డే వేడుక.. ప్రభావతి పై బాలు సెటైర్.. సుశీల సర్ప్రైజ్ గిఫ్ట్..

Intinti Ramayanam Today Episode: పల్లవికి షాకిచ్చిన మీనాక్షి.. కమల్ దెబ్బకు పల్లవికి మైండ్ బ్లాక్.. అవనికి తండ్రి ఎవరో తెలుస్తుందా..?

Today Movies in TV : శుక్రవారం టీవీల్లోకి స్టార్ హీరోల సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

Big Stories

×