E-Paper
Advertisement

Siima Awards 2024: సైమా అవార్డ్స్ 2024 : నాని సినిమాలకు 8 అవార్డులు.. విజేతలు వీరే

Siima Awards 2024: సైమా అవార్డ్స్ 2024 : నాని సినిమాలకు 8 అవార్డులు.. విజేతలు వీరే
Advertisement

Siima Awards 2024: దుబాయ్ వేదికగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (Siima Awards) 2024 వేడుక ఎంతో ఘనంగా, అట్టహాసంగా జరిగింది. సెప్టెంబర్ 14,15 తేదీల్లో నిర్వహిస్తున్న ఈ అవార్డుల వేడుకకు దక్షిణాది సినిమా ఇండస్ట్రీల అగ్రనటీనటులు హాజరై.. సందడి చేశారు. నిన్న జరిగిన సైమా అవార్డుల వేడుకలో.. 2023లో తెలుగు, కన్నడ భాషల్లో ఉత్తమ నటన కనబరిచిన నటీనటులకు, ఉత్తమ చిత్రాలకు సైమా అవార్డులు రాగా.. ఇతర తారలు వారి చేతులమీదుగా అవార్డులను అందించారు.

శనివారం జరిగిన వేడుకలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన రెండు సినిమాలకు నాలుగేసి అవార్డుల చొప్పున 8 అవార్డులు వచ్చాయి. వాటిలో దసరా సినిమాలో నాని నటనకు ఉత్తమ నటుడిగా అవార్డు లభించింది. ఇదే సినిమాలో నటించిన కీర్తి సురేశ్ కు ఉత్తమ నటిగా అవార్డు దక్కింది. ఇక ఉత్తమ సినిమాగా బాలయ్య-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన భగవంత్ కేసరి నిలిచింది.

Advertisement

Also Read: బాలయ్య ఫ్యాన్ ను కుక్కను కొట్టినట్లు కొట్టిన చిరు ఫ్యాన్..

చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సూపర్ హిట్ కొట్టిన మ్యాడ్ సినిమాకు రెండు అవార్డులు దక్కాయి. సప్తసాగరదాచె ఎల్లో-ఎ కన్నడ సినిమాలో నటించిన రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్ లు ఉత్తమ నటుడు, ఉత్తమ నటి అవార్డులు అందుకున్నారు.

Advertisement

మొదటి రోజు సైమా అవార్డులు అందుకున్నది వీరే

నాని – ఉత్తమ నటుడు (దసరా)

కీర్తి సురేశ్ – ఉత్తమ నటి (దసరా)

శ్రీకాంత్ ఓదెల – ఉత్తమ దర్శకుడు (దసరా)

దీక్షిత్ శెట్టి – ఉత్తమ సహాయ నటుడు (దసరా)

బేబీ ఖియారా – ఉత్తమ సహాయ నటి (హాయ్ నాన్న)

అబ్దుల్ వాహబ్ – ఉత్తమ సంగీత దర్శకుడు (హాయ్ నాన్న, ఖుషి)

శౌర్యువ్ – ఉత్తమ పరిచయ దర్శకుడు (హాయ్ నాన్న)

వైరా ఎంటర్టైన్ మెంట్స్ – ఉత్తమ పరిచయ నిర్మాత (హాయ్ నాన్న)

భగవంత్ కేసరి – ఉత్తమ సినిమా

విష్ణు – ఉత్తమ కమెడియన్ (మ్యాడ్)

సంగీత్ శోభన్ – ఉత్తమ పరిచయ నటుడు (మ్యాడ్)

వైష్ణవి చైతన్య – ఉత్తమ పరిచయ నటి (బేబీ)

భువన గౌడ – ఉత్తమ సినిమాటోగ్రఫీ (సలార్)

రామ్ మిర్యాల – ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ (బలగం- ఊరు పల్లెటూరు సాంగ్)

ఆనంద్ దేవరకొండ – ఉత్తమ నటుడు (క్రిటిక్స్) (బేబీ)

మృణాళ్ ఠాకూర్ – ఉత్తమ నటి (క్రిటిక్స్)

సాయ్ రాజేశ్ – ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్)

ఈ వేడుకకు శ్రియా శరణ్, ఫరియా అబ్దుల్లా, రానా, విజయ్ దేవరకొండ, శృతిహాసన్, నేహా శెట్టి, పూజా హెగ్డే వంటి తారలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. తారలతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×