BigTV English
Advertisement

Trinayani Serial Today Episode: విశాల్‌ కోసం వచ్చిన విశాలాక్షి – భుజంగమణి కోసం సుమన ప్లాన్‌

Trinayani Serial Today Episode: విశాల్‌ కోసం వచ్చిన విశాలాక్షి – భుజంగమణి కోసం సుమన ప్లాన్‌

Trinayani Serial Today September 18th:  ఎగ్జైంటింగ్‌ గా సుమన బుల్లి బావగారు ఏమన్నారు మీరు భుజంగ మణి కోసం వెళ్దామనుకుంటున్నారా? అని అడుగుతుంది. అవును నాకు దారి తెలియగానే వెళ్తాను. ఒకవేళ నీకు దారి తెలిస్తే ముందు నువ్వు వెళ్లు నీ వెనకే నేను వస్తాను అంటాడు. దీంతో ఈరోజు మీర ఎంత అందంగా కనిపిస్తున్నారో తెలుసా? అంటుంది సుమన. దీంతో సుమన దారి మధ్యలో తప్పిపోతే బాగుండు అని మనసులో అనుకుంటాడు విక్రాంత్‌.


వల్లభను ఆకాశానికి ఎత్తిన హాసిన

తర్వాత వల్లభను తీసుకుని హాసిని రాజాధిరాజా వల్లభ రాజావారు వేంచేస్తున్నారహో అంటూ కిందకు తీసుకువస్తంది. ఎప్పుడు మీ ఆయన చేయి కూడా పట్టుకోని నువ్వు ఇవాళ చేయి పట్టుకుని అంతలా మెచ్చుకుంటూ తీసుకొస్తున్నావు అంటూ దురందర అడుగుతుంది. దీంతో భుజంగమణి ని మా ఆయన వెళ్లి తీసుకొస్తారు అని చెప్తుంది హాసిని. దీంతో వల్లభ కంగారుపడుతూ ఏయ్‌ నేను బతకాలని లేదా నీకు అంటాడు. దీంతో కుక్క బతుకు ఎన్నాళ్లని బతుకుతారు. మీ అమ్మ వేసే బిస్కెట్లకు ఆశపడకుండా మణి కోసం ఒక సారి ట్రై చేయోచ్చు కదా అంటుంది. దీంతో నేను వెళ్లను అంటాడు వల్లభ. ఇంతలో నయని బావ గారు మీరు వెళ్లాల్సిన అవసరం లేదు. అని చెప్పగానే విశాల్‌ మీరు ఎక్కువగా ఆలోచించవద్దు ఆ భుజంగమణి గురించి ఆ గజగండకు తెలిస్తే ఆయన కూడా ప్రయత్నిస్తాడు కదా అంటాడు. దీంతో అందరూ షాక్‌ అవుతారు. ఎలా వచ్చిన సరే మనం పసిగడితే తన దగ్గర ఉన్న పంచకమణిని దక్కించుకోవచ్చు కదా? అంటుంది. ఐడియా మంచిదే కానీ ఎలా గుర్తుపట్టడం అని ఆలోచిస్తుంటారు.


తాను గజగండను అని దురందరను బెదిరించిన సుమన

 తర్వాత గాయత్రి ఆడుకుంటుంటే సుమన పాలు తీసుకొని వస్తుంది. దీంతో దురందర షాక్‌ అవుతుంది. అసలు నువ్వు సుమనవేనా? అని అడగ్గానే కాదు నేను గజగండను అంటుంది. దీంతో దురందర ఉలక్కిపడుతుంది. గట్టిగా అరుస్తుంది. అందరూ వస్తారు. ఏమైందని అడుగుతారు. మన ఎదురుగా ఉన్నది సుమన కాదు గజగండ అని చెప్పగానే అందరూ షాక్‌ అవుతారు. అందరూ సుమనను ప్రశ్నలు వేస్తారు. ఉన్నట్టుండి గాయత్రి పాప మీద ఎందుకు  ప్రేమ పుట్టిందో చెప్తావా? సుమన అని అడగ్గానే ఇంతలో విశాలాక్షి నేను చెప్తాను అమ్మా అంటూ వస్తుంది. విశాలాక్షిని చూసిన విశాల్‌ హ్యాపీగా ఫీలవుతాడు. నిన్ను చూసి ఎన్ని రోజులైంది అమ్మా అంటాడు. నిన్ను చూడాలనే వచ్చాను అంటుంది. దీంతో వల్లభ నువ్వు చూడాల్సింది విశాల్‌ ను కాదు. విశాల్‌ చేయిని, ఆ చెయ్యి చూడు ఎలా మొద్దు బారిపోయిందో అంటాడు. ఎన్నో దానధర్మాలు చేసిన ఆ చేయి మొద్దు బారిపోయిందా? అంటూ సుమన గాయత్రి పాపను మచ్చిక చేసుకుని మానసా దేవి ఆలయానికి తీసుకెళ్లాలని సుమన అనుకుంది అని విశాలాక్షి చెప్తుంది. దీంతో అందరూ షాక్‌ అవుతారు.

Also Read: కావ్యన బతిమాలిన రాజ్‌ – జీవితంలో ఆ గడప తొక్కనన్న కావ్య

అక్క బాధ చూడలేక వెళ్లాలనుకున్న : సుమన

 తిలొత్తమ్మ నిజంగా నువ్వు అక్కడికి వెళ్లాలి అనుకున్నావా సుమన అని అడుగుతుంది. దీంతో మా అక్క బాధ చూడలేక వెళ్లాలి అనుకున్నాను అత్తయ్య అని సుమన చెప్తుంది. అయితే సుమన నువ్వు  వెళ్లాలి అనుకుంటే నయనికి చెప్పాలి కదా అంటాడు విశాల్‌. దురందర, సుమనను తిడుతుంది. ఒక్కసారి వెళ్లిన మీ అక్కే తికమక పడింది నువ్వు ఎలా వెళ్తావు అనుకున్నావు అంటుంది. సుమన భుజంగమణి తీసుకురావడం అంత ఈజీ కాదు అని విశాలాక్షి చెప్పగానే.. వల్లభ మమ్మీ ఈ పిల్లకు భుజంగమణి గురించి ఎలా తెలుసు? అదే కాదు నయని తీసుకొచ్చిన మణిని గజగండ తీసుకెళ్లింది కూడా నాకు తెలుసు అని విశాలాక్షి చెప్తుంది. దీంతో అందరూ షాక్‌ అవుతారు.

గజగండ గురించి విశాలాక్షికి చెప్పిన విశాల్‌

ఇంతలో విశాల్‌ గజగండ గురించి చెప్తాడు. ఒకసారి తనలా వచ్చాడని చెప్పి గాయత్రి పాప వల్లే సేఫ్‌గా ఉన్నామని చెప్తాడు. దీంతో నేను చెప్పినట్టు చేస్తే వాణ్ని పట్టి బంధించవచ్చు అని ఒక మూట నయనికి ఇస్తుంది. ఇది విప్పు అని చెప్పగానే నయని మూట విప్పుతుంది. అందులో  చాలా బంగారం ఉంటుంది. అవన్నీ బంగారమేనా? అని తిలొత్తమ్మ అడుగుతుంది. దీంతో అవునని విశాలాక్షి చెప్తుంది.  ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్‌ ఏపిసోడ్‌ కు ఎండ్‌ కార్డు పడుతుంది.

Related News

Nagababu: మాట నిలబెట్టుకున్న మెగా బ్రదర్.. బాబాయ్ కల నెరవేర్చారుగా!

TV: పెళ్లైన 5 ఏళ్లకు పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ నటి.. ఎవరంటే?

Illu Illalu Pillalu Today Episode: నర్మదపై వేదవతి కోపం.. లంచం తీసుకుంటు దొరికిన నర్మద.. శ్రీవల్లి ఫుల్ హ్యాపీ..

Brahmamudi Serial Today November 7th:‘బ్రహ్మముడి’ సీరియల్‌: కూయిలీని కొట్టిన రాహుల్‌ – వీడియో తీసిన రంజిత్‌   

Nindu Noorella Saavasam Serial Today November 7th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: బెడిసికొట్టిన మనోహరి ప్లాన్‌  

GudiGantalu Today episode: ఘనంగా సుశీల బర్త్ డే వేడుక.. ప్రభావతి పై బాలు సెటైర్.. సుశీల సర్ప్రైజ్ గిఫ్ట్..

Intinti Ramayanam Today Episode: పల్లవికి షాకిచ్చిన మీనాక్షి.. కమల్ దెబ్బకు పల్లవికి మైండ్ బ్లాక్.. అవనికి తండ్రి ఎవరో తెలుస్తుందా..?

Today Movies in TV : శుక్రవారం టీవీల్లోకి స్టార్ హీరోల సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

Big Stories

×