BigTV English

Hydra Bulldozers Ready: మూసీ ఆక్రమణలు.. రెడీగా హైడ్రా బుల్డోజర్లు, ఇప్పటికే నోటీసులు.. రేపోమాపో

Hydra Bulldozers Ready: మూసీ ఆక్రమణలు.. రెడీగా హైడ్రా బుల్డోజర్లు, ఇప్పటికే నోటీసులు.. రేపోమాపో

Hydra Bulldozers Ready:  తెలంగాణలో హైడ్రా నెక్ట్స్ టార్గెట్ ఏంటి? మళ్లీ కూల్చివేతలు ఎప్పుడు ? ఏయే ప్రాంతాలపై హైడ్రా దృష్టి పెట్టింది? ఈసారి మూసీ ఆక్రమణలను టార్గెట్ చేసిందా? రెవిన్యూ అధికారులు అక్రమణదారులకు ఇప్పటికే నోటీసులు ఇచ్చారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.


రేవంత్‌రెడ్డి సర్కార్ మనస పుత్రిక మూసీ అభివృద్ధి ప్రాజెక్టు. దీన్ని పట్టాలు ఎక్కించేందుకు సిద్ధమైంది. దీనికి సంబందించి తెర వెనుక పనులు చకచకా జరిగిపోయతున్నాయి. గడిచిన కొన్నేళ్లగా మూసీ కెనాల్‌కు ఇరువైపులా అక్రమ కట్టడాలు భారీగా వెలిశాయి. కాలువను కుదించిమరీ అక్రమ కట్టడాలు కట్టేశారు కబ్జాదారులు. పెద్ద పెద్ద భవనాలు వెలిశాయి.

గడిచిన వారంరోజులుగా రెవిన్యూ అధికారులు ఇదే పనిలో నిమగ్నమయ్యారు. పలు ప్రాంతాల్లో సర్వే కూడా చేశారు. అక్రమణదారులకు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది రేవంత్ సర్కార్. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని తాత్కాలిక, శాశ్వత నిర్మాణాలు తొలగించేందుకు ప్లాన్ చేసింది.


హైదరాబాద్‌లోని ఆసిఫ్ నగర్, అంబర్ పేట్, బహదూర్ పురా, చార్మినార్, గొల్కొండ, హిమాయత్ నగర్, నాంపల్లి, సైదాబాద్ పరిధిలో భారీగా అక్రమ కట్టడాలు ఉన్నట్లుగా తేల్చారు రెవిన్యూ అధికారులు. అలాగే రంగారెడ్డి జిల్లాలోని గండిపేట్, రాజేంద్రనగర్, సరూర్ నగర్, రామంతపూర్ మూసీ కాలువను కుదించి నిర్మాణాలు కట్టేశారు.

ALSO READ: అబద్ధాల కాంగ్రెస్: హరీష్ రావు ఆగ్రహం

నార్సింగ్ నుంచి నాగోలు వరకు అంటే 25 వేల కిలోమీటర్ల మేరా 12 వేలకు పైగా అక్రమణలను గుర్తించారు. చాలావరకు మూసీ కాలువ ఇరువైపులా కాలనీలు సైతం వెలిశాయి. వీటి అక్రమ నిర్మాణాలు తొలగించే బాధ్యతను హైడ్రాకు అప్పగించినట్టు సమాచారం.

మూసీ కాలువకు ఇరువైపులా ఎన్నో కుటుంబాలు ఏళ్ల తరబడి ఉంటున్నాయి. వీరికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. కొందరైతే గోదాములు ఏర్పాటు చేసి వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. త్వరలో వీటిని తొలగించే ప్రక్రియ మొదలుకానున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నమాట. ఈ వారం లేదా వచ్చేవారం నుంచి తొలుత మూసీకి ఇరువైపులా ఉండే ఆక్రమణలు తొలగించబోతున్నారన్నమాట.

Related News

KTR: హరీష్ రావుపై కవిత ఆరోపణలు.. కేటీఆర్ సంచలన ట్వీట్

Bathukamma Festival: గిన్నిస్ బుక్ లోకి బతుకమ్మ..! ఆ ఆలోచన తనకు రాలేదని కవితమ్మ బాధ

Kavitha: పార్టీ నుంచి కవిత సస్పెండ్..! ఇప్పటికే ట్విట్టర్‌లో బీఆర్ఎస్ గట్టి కౌంటర్, ఇక మిగిలింది అదేనా..?

Kavitha: నాపై ట్రోల్ చేస్తే తోలు తీస్తా బిడ్డా.. కొందరు నరకం చూపించినా..?, కవిత సంచలన వ్యాఖ్యలు

MLC Kavitha: బీఆర్‌ఎస్‌లో ఆ ఇద్దరు అవినీతి అనకొండలు.. కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు..

CM Revanth Reddy: తెలుగు వ్య‌క్తికి జాతీయ స్థాయిలో ఛాన్స్.. ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి పరిచయ కార్యక్రమంలో సీఎం రేవంత్

Big Stories

×