BigTV English

Brahmamudi Serial Today Episode: కావ్యన బతిమాలిన రాజ్‌ – జీవితంలో ఆ గడప తొక్కనన్న కావ్య

Brahmamudi Serial Today Episode: కావ్యన బతిమాలిన రాజ్‌ – జీవితంలో  ఆ గడప తొక్కనన్న కావ్య

Brahmamudi Serial Today Episode : ఇంట్లో అందరూ ఇంకా కావ్యను తీసుకుని ఇందిరాదేవి, సీతారామయ్య రాలేదని వెయిట్‌ చేస్తుంటారు. ఇంతలో కారొచ్చి ఆగుతుంది. కారులోంచి ఇద్దరే దిగడం చూసిన అపర్ణ షాక్‌ అవుతుంది. చూశావా? ఈ ముసలోళ్లు వెళితే ఆ కావ్య రాదని నేను ముందే చెప్పాను కదా అంటూ రాహుల్‌కు మెల్లగా చెప్తుంది రుద్రాణి. వాళ్లకు ఎదరుగా వెళ్లిన రాజ్‌ ఆ మహారాణి రాలేదా? తాతయ్య అని అడుగుతాడు. అపర్ణ కావ్య ఎక్కడ అత్తయ్య అని ఇందిరాదేవిని అడుగుతుంది. అయితే కావ్య రాలేనని చెప్పిందని దీనకంతటికి రాజ్‌ కారణం అని ఇందిరాదేవి అంటుంది. మేము వెళ్లి పిలిచినా కావ్య రాదని అపర్ణ ముందే  చెప్పినా మేము వినకుండా వెళ్లాము.


రాజ్‌ వెళ్లి పిలిస్తేనే కావ్య వస్తుంది.

మాకు అర్థం అయింది ఏంటంటే రాజ్‌ వెళ్లి పిలిస్తేనే కావ్య వస్తుంది. అందుకే రాజ్‌ నువ్వే వెళ్లి కావ్యను తీసుకురావాలి అని సీతారామయ్య చెప్తాడు. రాజ్‌ మాత్రం  నేను వెళ్లాలా? అది మాత్రం జరగదు ఎప్పటికీ అంటాడు. దీంతో ఇందిరాదేవి  వెళ్లి తీరాలి. తనను అవమానించి మనసు గాయపరచి ఇంట్లోంచి వెళ్లిపోయేలా చేసింది నువ్వు అందుకే వెళ్లాల్సింది నువ్వే. అని చెప్పగానే ఇలా అడగమని మీ మనవరాలు మీకు చెప్పి పంపించిందా? నాన్నమ్మా అంటాడు రాజ్‌. అయితే అలాగే అనుకో.. నువ్వు చేసిన పనిని సరిద్దిదుకో.. వెళ్లి బతిమిలాడుకుంటావో ఏం చేస్తావో కావ్యను  మాత్రం ఇంటికి తీసుకురా రాజ్‌ అని చెప్తుంది. అంటే ఎంటి ఇప్పుడు నేను వెళ్లి ఆవిడ గారి కాళ్లు పట్టుకుని తప్పైందని క్షమించమని అడగాలా?  అంటాడు రాజ్‌. అడిగినా తప్పు లేదంటుంది అపర్ణ. మీ మగవారికి ఆడదాని మనసు ముక్కలు చేయడమే తెలుసు. కానీ అతికించడం తెలియదు. అని అపర్ణ కరాకండిగా చెప్పగానే రాజ్‌ సరే అంటాడు. తన కాళ్లు పట్టుకుని బతిమిలాడమంటే బతిమిలాడతాను కానీ ఆవిడ గారు రాకపోతే మాత్రం నన్ను వదిలేయండి. మీరందరూ అడగమన్నట్లుగా అడుగుతాను. ఇప్పుడే వెళ్తున్నాను.


 రాహుల్‌, రుద్రాణిల నాటకం బెడిసికొట్టింది.

రాహుల్‌, రుద్రాణి మళ్లీ కావ్య ఇంటికి వస్తే ఎలా ఇంత నాటకం ఆడినా కావ్య ఇంటికి రావడం ఆపలేకపోయామని ఇరిటేటింగ్‌ గా ఫీలవుతుంటారు. ఏంటి మమ్మీ ఇలా జరిగింది. తాతయ్య, అమ్మమ్మ వెళ్లితే ఆ కావ్య  రాదని సంతోషపడ్డాం. కానీ ఇప్పుడు ఆ రాజ్‌ వెళితే కావ్య తప్పకుండా వస్తుంది అంటాడు రాహుల్‌.  అవున్రా..  నాకు అదే అర్థం కావడం లేదురా? రాజ్‌ వెళ్లకుండా ఉండటానికి చాలా అడ్డు పడ్డాను. కానీ స్వప్న వచ్చి అడ్డుపడింది అంటుంది రుద్రాణి. అది శకునికి ఎక్కువ, సైందవుడికి తక్కువ అన్నట్లు తయారైంది. ప్రతి విషయంలోనూ మనకు అడ్డుపడుతుంది మామ్‌ అంటాడు రాహుల్‌. నువ్వు చెప్పింది నిజమేరా.. కానీ దాని చేతే కావ్య ఇంటికి రాకుండా  చేయించాలి.

Also Read: ‘సత్యభామ’ సీరియల్‌: తండ్రిని చంపేందుకు రుద్ర ప్లాన్‌ – శోభనం గదిలోంచి వెళ్లిపోయిన హర్ష

అని మాట్లాడుకుంటుండగా రూంవైపు స్వప్న రావడం చూసిన రుద్రాణి రాహుల్‌ అవకాశం తనంతట తానే వెతుక్కుంటూ వస్తుంది చూడు. నువ్వు నేను  చెప్పినట్లు చేయ్‌ అంటుంది రాహుల్‌ ఓకే అంటాడు. రుద్రాణి ఏడుస్తూ నటిస్తూ.. ఇప్పుడు కావ్య ఇక్కడికి వస్తే..  గొడవ పెద్దదవుతుంది.  వదిన ఆరోగ్యం పాడవుతుంది. అలా జరిగితే రాజ్‌ శాశ్వతంగా కావ్యను వదిలేస్తాడు. నేను ఎంత చెప్పినా నా మాట ఎవరూ పట్టించుకోవడం లేదు. అని మాట్లాడుతుంటే  స్వప్న విని వెంటనే పక్కకు వెళ్లి కావ్యకు ఫోన్‌ చేస్తుంది. రాజ్‌ నీకోసం వస్తున్నాడు. నువ్వు ఇక్కడికి రావొద్దు నువ్వు వచ్చావంటే మా రుద్రాణి అత్తయ్య ప్లాన్స్‌ అన్ని బెడిసికొడతాయి అని చెప్పడంతో రాహుల్‌, రుద్రాణి షాక్‌ అవుతారు. ఫోన్‌ కట్‌ చేసిన స్వస్న వాళ్ల దగ్గరకు వెళ్లి నేను ఇలాగే మాట్లాడాలని మీరు అనుకున్నారు కదా? మీరేం చేసినా కావ్యను ఇంటికి రాకుండా ఆపలేరు అని చెప్పి వెళ్లిపోతుంది.

కృష్ణమూర్తి ఇంటికి వచ్చిన రాజ్‌

కనకం, కృష్ణమూర్తి మాట్లాడుకుంటూ బయట కూర్చుని ఉంటారు. ఇంతలో రాజ్‌ వస్తాడు. ఇద్దరూ రాజ్‌ను గౌరవంగా ఇంట్లోంచి పిలుస్తారు, రాజ్‌ రానని చెప్తాడు. ఇంతలో కావ్య వస్తుంది. ఏం మాట్లాడుకున్న వాళ్లే మాట్లాడుకోవాలని మనం మధ్యలో ఉంటే బాగోదని కృష్ణమూర్తి, కనకం లోపలికి వెళ్తారు. రాజ్ చూసి కావ్య  పలకకుండా పక్కకు వెళ్లి బొమ్మలకు పెయింట్‌ వేసుకుంటుంది. ఏంటే  నేనొస్తే కూడా పట్టించుకోకుండా పని చేసుకుంటున్నావు అంటూ రాజ్‌ అడుగుతాడు. అయితే ఏం చేయమంటారు? చేతిలో ఉన్న బొమ్మను ఏత్తేసి.. మీ కాళ్ల మీద పడి నా జన్మ ధన్యం అయిపోయింది అని చెప్పాలా? అని అడుగుతుంది. అవేమీ వద్దు కానీ మా ఇంటికి వెళ్దాం రా.. అంటాడు. కావ్య తాను ఇక రానని మళ్లీ వచ్చి మళ్లీ చచ్చేంత ఓపిక నాకు లేదని చెప్తుంది. రాజ్‌ వెటకారంగా బతిమాలుతుంటే కావ్య  నన్ను తీసుకెళ్లడానికి వచ్చారా? ఇక ఎప్పటికీ రాకుండా చేయడానికి వచ్చారా? ప్రశ్నిస్తుంది. మీకు నాకు ఎలాంటి రిలేషన్‌ లేదు. ఇక జీవితంలో ఆ ఇంటి గడపే తొక్కను అంటూ కావ్య చెప్తుంది. ఇంతటితో ఇవాళ్టీ బ్రహ్మముడి సీరియల్ ఏపిసోడ్‌ కు ఎండ్‌ కార్డు పడుతుంది.

Tags

Related News

Telugu Serial : గ్యాస్ బండ పట్టుకొని.. ఐదో అంతస్తు మీద నుంచి జంప్.. అయినా ఏం కాలేదు.. ఇదెక్కడి సీరియల్ మామా!

Brahmamudi Serial Today September 2nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఒకరి గోడు ఒకరికి చెప్పుకున్న అపర్ణ, ధాన్యలక్ష్మీ – నవ్వుకున్న ఇంద్రాదేవి

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. శ్రీకర్ పై మర్డర్ కేసు.. మనసులోని అక్కసును కక్కేసిన శ్రీయా..

Illu Illalu Pillalu Today Episode: ప్రేమ మాటకు ధీరజ్ షాక్.. నర్మద కోసం తెగించేసిన సాగర్.. వల్లికి కొత్త టెన్షన్..

GudiGantalu Today episode: మీనాకు ప్రభావతి క్లాస్.. రోహిణి కోరికను తీర్చిన మనోజ్.. పార్వతికి ఘోర అవమానం..

Tv Serial Actress : తెలుగు సీరియల్స్ లో నటిస్తున్న  హీరోయిన్స్ రియల్ ఏజ్ ఎంతో తెలుసా..? అస్సలు నమ్మలేరు..

Big Stories

×