E-Paper
Advertisement

ఇండస్ట్రీలో తొక్కేసారు.. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో ప్లేట్లు కడిగాను..కన్నీళ్లు పెట్టుకున్న విశ్వ?

ఇండస్ట్రీలో తొక్కేసారు.. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో ప్లేట్లు కడిగాను..కన్నీళ్లు పెట్టుకున్న విశ్వ?
Advertisement

Tv Actor Vishwa: యువ అనే సీరియల్ ద్వారా బుల్లితెర నటుడిగా పరిచయమైన విశ్వ మొదటి సీరియల్ తోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. గంగ మంగ, గంగతో రాంబాబు వంటి సీరియల్స్ లో నటించారు అయితే ఈయన ఇండస్ట్రీలోకి సీరియల్ నటుడిగా కాకుండా సినిమాలలో అవకాశాలను అందుకుంటూ వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చారు అనంతరం నాగార్జున నిర్మాతగా వ్యవహరించిన యువ సీరియల్ లో అవకాశం రావడంతో బుల్లితెరవైపు అడుగులు వేశానని తెలిపారు.

బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్..

ఇలా పలు సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తూనే మరోవైపు రెండు తెర సినిమాలలో కూడా నటిస్తున్నారు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంతో పాటు బీబీ జోడి కార్యక్రమంలో కూడా కంటెస్టెంట్ గా పాల్గొని సందడి చేశారు. విశ్వ ఇటీవల ఫిట్నెస్ సెంటర్ కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న విశ్వ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా చేయడం గురించి, అలాగే ఈయన ఎదుర్కొన్న ఇబ్బందులకు గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

రేషన్ బియ్యంతోనే కడుపు నింపుకున్నాము..

Advertisement

ఒకానొక సమయంలో తన కెరియర్ పై పెద్ద ఎత్తున రాజకీయాలు జరిగాయని తెలిపారు .ఎంతోమంది తనకు అవకాశాలు రాకుండా తొక్కేసారని తద్వారా అవకాశాలు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డామని తెలిపారు. ఆ సమయంలో తాము తినడానికి కూడా తిండి లేకపోవడంతో రేషన్ బియ్యంతోనే కడుపు నింపుకున్నామని తెలిపారు. ఇక ఇండస్ట్రీలో ఆ అవకాశాలు రాకపోవడంతో తన తమ్ముడితో కలిసి ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టామని విశ్వ తెలిపారు. ఇక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతున్న సమయంలో పని వాళ్లు లేకపోతే చివరికి అక్కడ తిన్న ప్లేట్లు కూడా తాను కడిగానని ఈ సందర్భంగా విశ్వ తన కెరియర్ లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

పెద్ద సినిమాలో బుల్లితెర నటుడు విశ్వ…

Advertisement

ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా విశ్వ తన తమ్ముడు సందీప్ మరణం గురించి కూడా మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తన తమ్ముడు ప్రతి పనిలోనూ ఎంతో చలాకిగా ఉండేవాడని అన్ని పనులు ఎంతో చక్కగా చేసేవారని తెలిపారు. ఉన్నఫలంగా తన తమ్ముడు మరణించడంతో జీవితంలో అన్నీ కోల్పోయాననే భావన కలిగింది. అయితే తమ్ముడి మరణం సమయంలో ఎంతో కృంగిపోయినా తిరిగి జీవితంలో మళ్లీ నిలబడ్డానని విశ్వ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక ప్రస్తుతం ఈయన బుల్లితెర సీరియల్స్ కు దూరంగా ఉన్నప్పటికీ వెండితెర సినిమాలలో నటిస్తున్నారు. ప్రస్తుతం పెద్ది సినిమాలో కూడా విశ్వ నటిస్తున్నట్లు తెలియచేశారు.

Also Read: ప్రాణాలకు తెగించినా ఒక్క పలకరింపు లేదు.. టాలీవుడ్ తీరుపై శర్వా ఎమోషనల్!

Related News

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

Big Stories

Advertisement
×