E-Paper
Advertisement

ప్రాణాలకు తెగించిన ఒక్క పలకరింపు లేదు.. టాలీవుడ్ తీరుపై శర్వా ఎమోషనల్!

ప్రాణాలకు తెగించిన ఒక్క పలకరింపు లేదు.. టాలీవుడ్ తీరుపై శర్వా ఎమోషనల్!
Advertisement

Sharwanand: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న వారిలో నటుడు శర్వానంద్ ఒకరు. శర్వానంద్ ఇటీవల వరుస హిట్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంటున్నారు. ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా నారీ నారీ నడుమ మురారి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన శర్వానంద్ ఏప్రిల్ మూడవ తేదీ బైకర్(Biker) అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్నారు. ఇలా ఒక ఏడాదిలోనే రెండు సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు.

స్కై డైవింగ్ చేస్తూ ప్రమాదానికి గురైన శర్వా..

బైకర్ సినిమా మంచి సక్సెస్ కావడంతో శర్వానంద్ తదుపరి సినిమాలపై కూడా పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈయన ఇప్పటికీ పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే సీనియర్ నటి అమల అక్కినేనితో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. జాను సినిమా షూటింగ్ సమయంలో తనకు జరిగిన ప్రమాదం గురించి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. జాను సినిమా సమయంలో స్కై డైవింగ్ చేస్తున్న సమయంలో తాను ప్రమాదవశాత్తు కింద పడిపోయానని శర్వానంద్ తెలిపారు .ఆ క్షణం తాను చనిపోయానని అనుకున్నాను. అదృష్టవశాత్తు బయటపడ్డానని తెలిపారు.

గుర్తించలేని పరిస్థితులలో నేనున్నానా?

Advertisement

ఈ ప్రమాదంలో భాగంగా తనకు మీ పరీతమైన గాయాలు తగిలాయి తన చేయి కూడా తిరిగి వస్తుందనే నమ్మకాన్ని డాక్టర్లు కూడా ఇవ్వలేకపోయారు. ఇలా తాను చావు అంచుల వరకు వెళ్లి బయటకు వచ్చాను. ఇంత ప్రమాదానికి గురి అయినప్పటికీ టాలీవుడ్ మాత్రం నా ప్రమాదం గురించి మాట్లాడుకోలేదని ఈయన ఎమోషనల్ అయ్యారు. అంత పెద్ద ప్రమాదం నుంచి తాను తప్పించుకుంటే కనీసం ఒక్కరు కూడా తన గురించి మాట్లాడుకోలేదని తన యోగక్షేమాలు అడగలేదని శర్వానంద్ తెలిపారు. అయితే ఇక్కడ ఎవరు నన్ను పలకరించలేదనే బాధ కాకుండా కనీసం నన్ను గుర్తించలేని స్థితిలో ఇండస్ట్రీలో నేనున్నానా అనే బాధ ఎక్కువగా కలిగిందని అందుకే అప్పటినుంచి నాకంటూ ఒక గుర్తింపు సంపాదించుకోవాలని కసి పెరిగిందని తెలిపారు.

2027 సంక్రాంతి బరిలో శర్వా..

Advertisement

ఇండస్ట్రీ నన్ను గుర్తించాలి అంటే తాను కూడా మంచి సక్సెస్ అందుకోవాలని మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు రావాలని భావించాను. ఇక బైకర్ లాంటి సినిమాలో అవకాశం రావడంతో తాను చేయాల్సింది ఇలాంటి సినిమాలేనని, కథ విన్న వెంటనే ఈ సినిమాకు ఒప్పుకున్నానని శర్వానంద్ తెలిపారు. ఈ విధంగా ఇండస్ట్రీలో తన స్థానాన్ని ఎవరు గుర్తించకపోవడంతో చాలా బాధ కలిగిందని శర్వానంద్ అప్పటి సంఘటనలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక శర్వానంద్ ప్రస్తుతం భోగి అనే సినిమాతో పాటు శ్రీను వైట్ల డైరెక్షన్లో మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక శర్వానంద్ 2027 సంక్రాంతి పండుగ సందర్భంగా మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.

Also Read: లిటిల్ హార్ట్ డైరెక్టర్ తో అడివి శేష్ సినిమా… క్లారిటీ ఇచ్చిన సాయి మార్తాండ!

Related News

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

Big Stories

Advertisement
×