E-Paper
Advertisement

ఆ అమ్మాయి ఎవరంటే .. ప్రేమ గురించి మనసు విప్పిన ఉప్పల్ బాలు!

ఆ అమ్మాయి ఎవరంటే .. ప్రేమ గురించి మనసు విప్పిన ఉప్పల్ బాలు!
Advertisement

Uppal Balu:బిగ్‌బాస్ అగ్నిపరీక్ష షో తర్వాత ఉప్పల్ బాలు పేరు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తుందన్న సంగతి తెల్సిందే.ఇక ఈ షోలో తనకు జరిగిన అనుభవాల గురించి,అలాగే తన జీవితంలో ప్రేమ గురించి,తాను ఎవరిని పెళ్లి చేసుకుంటాను అనే విషయాల గురించి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టాడు

ముఖ్యంగా షోలో తనను అవమానించారని, ఆ బాధను తట్టుకోలేక చాలా ఏడ్చానని తెలిపాడు. గతంలో ఎప్పుడూ సరదాగా, నవ్వుతూ కనిపించే తాను ఈ మధ్య చాలా మారిపోయానని అసలు విషయం బయటపెట్టాడు.షోలో జరిగిన విషయాల తర్వాత తాను తీవ్రంగా బాధపడ్డానని అయితే తన తండ్రి చనిపోయినప్పుడు కూడా ఇంతగా బాధపడలేదని, కానీ బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో ఎదురైన అనుభవాలు తనను ఎంతగానో బాధించాయని ఎమోషనల్ అయ్యాడు .

Advertisement

ఇక ఓక దశలో వీడియోలు చేయాలన్న ఆసక్తి కూడా తగ్గిపోయిందని, మానసికంగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయానని తెలిపాడు.. అయితే తన బావ తనకు అండగా నిలిచారని, బాధను పక్కనపెట్టి కొత్త కంటెంట్ చేయాలని, మంచి వీడియోలు రూపొందించాలని ప్రోత్సహించారని చెప్పాడు. కుటుంబ సభ్యులు తనను ఆ పరిస్థితి నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారని వివరించాడు.

ఇక అగ్నిపరీక్షలో తనకు ఎదురైన పరిస్థితులపై బాలు తన అసంతృప్తి బయట పెట్టాడు. తనను షోలోకి తీసుకుంటారని ఎంతో ఆశపడ్డానని, అక్కడ తనతో పాటు వచ్చిన వాళ్ళు కూడా తనకు అవకాశం వస్తుందని చెప్పారని గుర్తుచేసుకున్నాడు. కానీ చివరకు తనను ఎంపిక చేయకపోవడం బాధ కలిగించిందని అన్నారు. అయితే తనకు ఎక్కువ బాధ కలిగించింది అవకాశం రాకపోవడం కంటే, స్టేజ్‌పై జరిగిన అవమానమే అని స్పష్టం చేశాడు. భవిష్యత్తులో మరో అవకాశం వస్తుందనే ఆశతో వచ్చేశానని చెప్పాడు.

Advertisement

ఇక ఈ ఇంటర్వ్యూలో నవదీప్‌పై కూడా ఉప్పల్ బాలు గట్టిగానే రియాక్ట్ అయ్యాడు.అగ్నిపరీక్షలో ఎదురయ్యే సవాళ్లను తట్టుకోవాలని నవదీప్ చెప్పిన కామెంట్స్ ని తాను సపోర్ట్ చేయనని అన్నాడు. షోలో ఎవరిని ఎంపిక చేయాలి, ఎవరిని పక్కన పెట్టాలి అనే విషయంలో ముందుగానే అనుకొని ఉండవచ్చని అనుమానాన్ని వ్యక్తం చేశాడు. తన అభిప్రాయం ప్రకారం, షో నిర్వాహకులు తమకు అవసరమైన వారిని ఎంపిక చేసుకుంటారని, టాలెంట్ ఉన్నవారికి కూడా కొన్నిసార్లు అవకాశం దక్కకపోవచ్చని చెప్పారు.

అయితే ఈ అనుభవం తర్వాత బిగ్‌బాస్‌కు వెళ్లకూడదని పూర్తిగా నిర్ణయించుకోలేదని, భవిష్యత్తులో సెలబ్రిటీగా పిలిస్తే వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. తన బావ వెళ్లమంటే వెళ్తానని, ఆయన వద్దంటే వెళ్లనని సరదాగా అన్నాడు.

ప్రస్తుతం నడుస్తున్న బిగ్‌బాస్ సీజన్ గురించి అడిగినప్పుడు, తాను హౌస్‌లో ఉంటే ప్రేక్షకులను మరింత ఎంటర్‌టైన్ చేసేవాడినని అన్నాడు బాలు . తనలో చాలా రకాల కోణాలు ఉన్నాయని, హౌస్‌లోకి వెళ్తే అవన్నీ బయటపడేవని చెప్పాడు.

బిగ్‌బాస్‌లో పాల్గొనడానికి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారని అడిగిన ప్రశ్నకు, ప్రస్తుతం నెలకు సుమారు రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు సంపాదిస్తున్నానని తెలిపారు. తన సంపాదనలో కుటుంబాన్ని చూసుకోవడం ముఖ్యమని, ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నానని, భవిష్యత్తులో సొంత ఇల్లు కొనాలనే కోరిక ఉందని చెప్పాడు.

ఇక తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ, పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఇప్పుడు ఉందని బాలు తెలిపారు. తెలంగాణకు చెందిన ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని, తమ పరిచయం దాదాపు రెండేళ్లుగా కొనసాగుతోందని చెప్పాడు. అయితే ఆ అమ్మాయి తల్లి ఒప్పుకుంటేనే అది జరుగుతుందని అన్నాడు.

పెళ్లి విషయంలో కట్నం ఆశించనని, పరిస్థితులను బట్టి తాను కూడా సర్దుకుపోతానని అన్నాడు. ఒకప్పుడు పెళ్లి చేసుకోకుండా ఉండిపోతానని చెప్పినా, కాలం, పరిస్థితులను బట్టి మన ఆలోచనలు మారుతుంటాయని అన్నాడు. ప్రస్తుతం తన బావ సపోర్ట్ తో కొత్త కంటెంట్‌పై దృష్టి పెడుతున్నానని , తనకు సపోర్ట్ గా నిలిచిన అభిమానులందరికీ థాంక్స్ చెబుతూ ఇకపై మంచి వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తానని అన్నాడు.మొత్తానికి బాలు తన మనసులోని మాటలని బయట పెట్టగా అవిపుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి.

ALSO READ :నవదీప్ ఒక చిల్లరగాడు ..ఉప్పల్ బాలు షాకింగ్ కామెంట్స్

Tags

Related News

నవదీప్ ఒక చిల్లరగాడు ..ఉప్పల్ బాలు షాకింగ్ కామెంట్స్

ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో చెప్పేసిన త్రిగుణ్!

ఫోక్ సింగర్ మధుప్రియ ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

కొత్త బిజినెస్ ప్రారంభించిన బుల్లితెర నటి హరిత!

చిన్న మిస్టేక్.. కన్నీళ్లు పెట్టుకున్న వంశీ.. అసలేం జరిగిందంటే?

హౌస్ మేట్స్ కి వైల్డ్ కార్డ్స్ ఊహించని ట్యాగ్.. మరీ అంత బుర్ర తక్కువా?

తల్లి కాబోతున్న బిగ్ బాస్ ప్రేరణ..ఆ మూవీ స్టైల్ లో సీమంతం!

Big Stories

Advertisement
×