Dark Comedy Thriller OTT : సినిమాల్లో హీరోలు ఎంతటి ప్రమాదాన్నైనా ఎదుర్కొని చివరికి బయట పడతారని ప్రేక్షకులకు ఒక నమ్మకం ఉంటుంది. కానీ నిజ జీవితంలో ఓ ప్రముఖ నటుడు తన అదృష్టాన్ని నమ్ముకుని ఓ విలాసవంతమైన వేడుకకు వెళ్లి, అక్కడి నుంచి ప్రాణాలతో బయట పడితే చాలని భయపడుతుంటే… అందులోనూ అతన్ని బంధించిన వాళ్లు సాధారణ నేరగాళ్లు కాకుండా, అగ్నిపర్వతం దగ్గర బలి ఇవ్వాలనే ఆలోచనతో ఉన్న ఓ విచిత్రమైన మతసంఘం అయితే ? ఇలాంటి అసాధారణ పరిస్థితిని సెటైర్, హింస, ఉత్కంఠతో మేళవించే చిత్రం ‘సాక్రిఫైస్’ (Sacrifice). మరి ఈ ఇంగ్షీషు డార్క్ కామెడీ థ్రిల్లర్ ఎప్పటి నుంచి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? అంటే…
ఇందులో క్రిస్ ఎవాన్స్ పోషించిన పాత్ర అదృష్టం కలిసిరాని ఓ సినీ నటుడిది. ఒకప్పుడు తన వృత్తిలో గుర్తింపు సంపాదించినా, ఇప్పుడు ఆ స్టార్ డమ్ ఫేడవుట్ అవుతుంది. అలాంటి సమయంలో గ్రీస్ లోని ఓ అందమైన ద్వీపంలో జరిగే విలాసవంతమైన ఛారిటీ వేడుకకు అతను హాజరవుతాడు. అక్కడ ప్రముఖులు, ధనవంతులు, ప్రభావశీలులు చేరుతారు. బయటకు చూస్తే అది పేరు, ప్రతిష్ఠ, దాతృత్వం చుట్టూ తిరిగే వేడుక. కానీ ఆ వేడుక వెనుక దాగి ఉన్న ఉద్దేశాలు మాత్రం వేరేలా ఉంటాయి.
ఈ వేడుకలోకి అడుగు పెట్టిన నటుడు ఊహించని పరిస్థితుల్లో ఓ షాకింగ్ సంఘటనను ఎదుర్కొంటాడు. అగ్నిపర్వతం చుట్టూ తమకంటూ ఓ భయంకరమైన నమ్మకాల ప్రపంచాన్ని నిర్మించుకున్న బృందం అతన్ని బంధిస్తుంది. ఆ బృందానికి అతను ఓ ప్రత్యేక ప్రయోజనం కోసం అవసరమవుతాడు. ఒక్కసారిగా తన ప్రాణాలే ప్రమాదంలో పడటంతో, ఇప్పటి వరకు తెరపై హీరోగా నటించిన వ్యక్తి నిజ జీవితంలో ఎలా స్పందిస్తాడన్నది కథలో ప్రధాన ఆకర్షణగా మారుతుంది.
ఆ కల్ట్ నుంచి తనను తాను కాపాడుకోవడానికి అతను ఏం చేస్తాడు ? అతన్ని బలివ్వాలి అనుకోవడం వెనుక ఉన్న ఈ బృందం ఉద్దేశం ఏమిటి ? రీల్ లైఫ్ లో స్టార్ అయిన ఆ వ్యక్తి రియల్ లైఫ్ లో ఈ ఘటనను ఎలా ఎదుర్కొంటాడు ? అందులో నుంచి ఎలా బయట పడతాడు ? అనేది తెలియాలంటే సినిమాపై ఓ లుక్కేయండి.
Also Read : చదువుకున్న స్కూల్కే టీచర్గా… పిల్లలతో ఈ మాజీ స్టూడెంట్ పడుతున్న కష్టాలు చూస్తే నవ్వులే నవ్వులు
‘సాక్రిఫైస్’ మూవీ నెట్ఫ్లిక్స్ (Netflix)లో అక్టోబర్ 16న విడుదల కానుంది. అయితే తెలుగు డబ్బింగ్ అందుబాటులో లేదు. కానీ ఇంగ్షీషులో స్ట్రీమింగ్ అవుతుంది. అన్యా టేలర్-జాయ్ (Anya Taylor-Joy), విన్సెంట్ కాసెల్ (Vincent Cassel), అంబికా మోడ్ (Ambika Mod), సామ్ రిచర్డ్సన్ (Sam Richardson), సల్మా హాయెక్ (Salma Hayek) తదితరులు ఈ చిత్రంలో నటించారు. రొమైన్ గవ్రాస్ (Romain Gavras) దర్శకత్వం వహించారు. ఈ సినిమా పురాణాల నుంచి ప్రేరణ పొందిన కథాంశాన్ని ఆధునిక అంశాలతో కలిపి తెరపైకి తీసుకొస్తుంది. ఒక ప్రముఖుడి ప్రతిష్ఠ, డబ్బు, గుర్తింపు అన్నీ ఉన్నా ప్రాణం ప్రమాదంలో పడినప్పుడు అవేవీ ఉపయోగపడకపోవచ్చనే ఆలోచన ఈ సినిమాలో చూడడానికి కొత్తగా ఉంటుంది.