E-Paper
Advertisement

నవదీప్ ఒక చిల్లరగాడు ..ఉప్పల్ బాలు షాకింగ్ కామెంట్స్

నవదీప్ ఒక చిల్లరగాడు ..ఉప్పల్ బాలు షాకింగ్ కామెంట్స్
Advertisement

Uppal Balu:ఉప్పల్ బాలు..పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు.తనదైన హావభావాలతో నిత్యం సోషల్ మీడియాలో అభిమానులని ఎంటర్ టైన్ చేసే బాలు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు చెప్పుకొచ్చాడు.ఈ క్రమంలో అగ్నిపరీక్షకి జడ్జ్ లా వ్యవహరించిన నవదీప్ పై ఒక రేంజ్ లో మండిపడ్డాడు.

ముఖ్యంగా బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో పాల్గొన్న తర్వాత తాను బాగా బాధపడ్డానని, కొంతకాలం డిప్రెషన్‌లోకి వెళ్లానని చెప్పాడు. తనను సెలెక్ట్ చేయకపోవడం కంటే, అక్కడ ఎదురైన అవమానాలు, బయట వచ్చిన విమర్శలే తనని ఎక్కువగా బాధ పెట్టాయని తెలిపాడు.

Advertisement

బిగ్‌బాస్‌లోకి వెళ్లి తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని అనుకున్నానని ,తన కుటుంబం, అభిమానుల కోసం ఆ ఛాన్స్ తనకి వస్తే బాగుంటుంది అని ఎంతో ఆశించానని తెలిపాడు. అయితే, అగ్నిపరీక్ష తర్వాత తన గురించి వచ్చిన కామెంట్లు, మీమ్స్ తనను తీవ్రంగా బాధ పెట్టాయని చెప్పాడు. తన వీడియోలు చూసేవారికి తానెలాంటి వ్యక్తినో తెలుసని, అయినప్పటికీ తనను కార్యక్రమానికి పిలిచి అందరి ముందు అవమానించడం బాధ కలిగించిందని అన్నాడు.

ఇక అగ్నిపరీక్ష లో సెలెక్ట్ కాకపోవడంతో కొంతకాలం హైదరాబాద్‌కు దూరంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు. అందుకే ఫోన్లు కూడా సరిగా ఎత్తకుండా ఒంటరిగా ఉండిపోయానని, తన పరిస్థితి చూసి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారని చెప్పాడు. తనను ఆ పరిస్థితి నుంచి బయటకు తీసుకురావడానికి కుటుంబ సభ్యులు ఎంతో ప్రయత్నించారని వివరించాడు.

Advertisement

అగ్నిపరీక్షలో తనను పిలిపించింది టీఆర్పీ కోసమేనని ఆరోపించాడు బాలు. అయితే, తనను సెలెక్ట్ చేయకపోవడంపై అంతగా బాధపడలేదని, కానీ తనను తిట్టడం, అవమానించడం మాత్రం తట్టుకోలేకపోయానని స్పష్టం చేశాడు.ఇక తన అభిమానులు ఫోన్ చేసి నవదీప్ ఒక చిల్లర గాడు అని ,వాడి గురించి అసలు నువ్వెందుకు బాధ పడాలని తనకి ధైర్యం చెప్పారని తెలిపాడు.

ఇక బిగ్‌బాస్ వైల్డ్‌కార్డ్ ఎంట్రీపై వస్తున్న వార్తల గురించి బాలు మాట్లాడుతూ తనకు ఇప్పటివరకు ఎలాంటి కాల్స్ లేదా మెసేజ్‌లు రాలేదని అయితే, నాగార్జున అవకాశం ఇచ్చి పంపిస్తే మాత్రం బిగ్‌బాస్‌లోకి వెళ్లడానికి సిద్ధమని తెలిపాడు. చిన్నప్పటి నుంచి నాగార్జున అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం ప్రసారమవుతున్న బిగ్‌బాస్ సీజన్‌ను తాను చూడటం లేదని తెలిపాడు బాలు. తన అభిప్రాయం ప్రకారం, గతంలో ఉన్నంత ఎంటర్ టైన్ మెంట్ ఇప్పుడు లేదని తను లేకపోవడంతో
షోలో ఎంటర్‌టైన్‌మెంట్ తగ్గిందని తన గురించి గొప్పగా చెప్పుకున్నాడు. ఇక బిగ్‌బాస్ రేటింగ్స్ పడిపోయాయని కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇక ఈ సందర్భంగా కంటెస్టెంట్ల గురించి మాట్లాడుతూ తన ఫ్రెండ్ అపూర్వ బాగా ఆడుతోందని ఆమె ఆటతీరు, మాట్లాడే విధానం తనకు నచ్చాయని, అపూర్వ టాప్‌ 5లో నిలవాలని కోరుకుంటున్నానని చెప్పాడు. శాలిని, దేవ్‌జాన్‌, ముకేష్‌, టెంపర్ వంశీల గురించి కూడా తన అభిప్రాయాలను బయటపెట్టాడు బాలు.

బిగ్‌బాస్‌లో పాల్గొనేందుకు డబ్బు కూడా ముఖ్యమేనని బాలు స్పష్టం చేశాడు. తన కుటుంబాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉందని, అందుకే డబ్బుకి ప్రాధాన్యత ఇస్తానని చెప్పాడు. మరోవైపు, బిగ్‌బాస్‌తో పాటు టీవీ షోలు, సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని బాలు తెలిపాడు. మొత్తానికి, అగ్నిపరీక్ష లో ఎదురైన అవమానాలపై అలాగే నవదీప్ పై బాలు చేసిన కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

ALSO READ :ఫోక్ సింగర్ మధుప్రియ ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

Tags

Related News

ఆ అమ్మాయి ఎవరంటే .. ప్రేమ గురించి మనసు విప్పిన ఉప్పల్ బాలు!

ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో చెప్పేసిన త్రిగుణ్!

ఫోక్ సింగర్ మధుప్రియ ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

కొత్త బిజినెస్ ప్రారంభించిన బుల్లితెర నటి హరిత!

చిన్న మిస్టేక్.. కన్నీళ్లు పెట్టుకున్న వంశీ.. అసలేం జరిగిందంటే?

హౌస్ మేట్స్ కి వైల్డ్ కార్డ్స్ ఊహించని ట్యాగ్.. మరీ అంత బుర్ర తక్కువా?

తల్లి కాబోతున్న బిగ్ బాస్ ప్రేరణ..ఆ మూవీ స్టైల్ లో సీమంతం!

Big Stories

Advertisement
×