E-Paper
Advertisement

Viral Serial Clip: ఇదేం సీరియల్ సామి.. ఏకంగా ఏలియెన్స్‌నే ఏడిపించేశారుగా.. ఇది చూస్తే నవ్వు ఆగదు..!

Viral Serial Clip: ఇదేం సీరియల్ సామి.. ఏకంగా ఏలియెన్స్‌నే ఏడిపించేశారుగా.. ఇది చూస్తే నవ్వు ఆగదు..!
Advertisement

Viral Serial Clip: నిన్న మొన్నటి వరకు ఏలియన్స్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేవి ఇంగ్లీష్ సినిమాలే. హాలీవుడ్‌లో స్పేస్ నుంచి వచ్చిన ఏలియెన్స్, సైన్స్ ఫిక్షన్ కథలు, గ్రాఫిక్స్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేవి. ఆ తర్వాత కొద్ది రోజులకే హిందీ సినిమాల్లో కూడా ఏలియన్స్ కాన్సెప్ట్ కనిపించింది. ఇక ఆపై మన సౌత్ సినిమాల్లో కూడా ఈ కాన్సెప్ట్‌కు మంచి క్రేజ్ వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితి మరింత ముందుకు వెళ్లింది. ఏకంగా హిందీ సీరియల్స్‌లో కూడా ఏలియన్స్ కాన్సెప్ట్ రావడం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.

అన్నిటికన్నా ముఖ్యంగా తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో క్లిప్ బాగా వైరల్ అవుతోంది. ఈ క్లిప్ చూస్తే నిజంగానే నవ్వు ఆగదు. ఒక హిందీ సీరియల్‌లో ఏలియన్స్‌ని చూపిస్తూ ఎమోషనల్ సీన్ క్రియేట్ చేశారు. సీరియల్ డైరెక్టర్ భావోద్వేగాలు పండించాలని ఎంత ప్రయత్నించినా, ప్రేక్షకులకు మాత్రం ఆ సీన్ కామెడీగా మారిపోయింది.

Advertisement

ఆ సీన్‌లో ఇద్దరు ఏలియన్స్ ఉంటారు. వాళ్లకు హీరోయిన్ హారతి ఇస్తూ కనిపిస్తుంది. పక్కనే హీరో, అలాగే హీరో-హీరోయిన్‌కు ఉన్న చిన్న కూతురు కూడా ఉంటుంది. అంతా చూసి ఇదేం ట్విస్ట్ అనిపించేలా సీన్ కొనసాగుతుంది. ఆ తర్వాత ఆ ఏలియన్స్ ఒక్కసారిగా హీరోయిన్ కాళ్లు మొక్కుతారు. ఇది చూసి హీరోయిన్ షాక్ అవుతుంది. వెంటనే “మీరు మా కాళ్లు ఎందుకు తాకుతున్నారు?” అని అడుగుతుంది.

?igsh=dmJqcHZ5MXoxcTdp

Advertisement

అందుకు ఆ ఏలియన్స్ చాలా సీరియస్‌గా సమాధానం చెబుతారు. “మా సిస్టం మీ సంస్కృతి ప్రకారం తల్లిదండ్రుల కాళ్లు తాకి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పింది” అని అంటారు. అంతేకాదు, “మేము మిమ్మల్ని అమ్మా అని పిలవవచ్చా?” అని కూడా అడుగుతారు. ఇంకా “మాకు అమ్మ లేదు.. కానీ ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని అమ్మగా భావిస్తున్నాం” అంటూ ఎమోషనల్ డైలాగ్స్ చెబుతారు.

దానికి హీరోయిన్ కూడా సెంటిమెంట్‌గా స్పందిస్తుంది. “మీరు చిన్న పిల్లలు కాదు కానీ పర్లేదు. ఈ రోజు నుంచి నేను మీ అమ్మని” అని చెప్పడం ఆ సీన్ హైలైట్. ఈ మొత్తం వీడియో చూసిన నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు.

ఈ వీడియోని షేర్ చేస్తూ “అందుకే ఏలియన్స్ మన ఇండియాకి రారు” అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. సీరియల్స్ కోసం ఎమోషన్ పేరుతో ఏదైనా చూపించవచ్చా అంటూ చాలామంది ట్రోల్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ ఏలియన్ సీన్ మాత్రం సోషల్ మీడియాలో మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చిందని చెప్పాలి.

ALSO READ: Prabhas: నీ గొంతు నా మనసును తాకింది.. హీరోయిన్ పై ప్రభాస్ ప్రశంసలు..

Related News

చీరకట్టులో శివజ్యోతి..ఆ భారీ హారం చూస్తే మతిపోవాల్సిందే!

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Big Stories

Advertisement
×