Bigg Boss 10 Debjani Modak:బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 10 మరికొన్ని గంటల్లో చాలా గ్రాండ్ గా లాంచ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా హౌస్ లోకి అడుగుపెట్టే 10 మంది సెలబ్రిటీల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. వారిలో ‘ఎన్నెన్నో జన్మల బంధం’ సీరియల్ లో “వేద”గా అలరించిన నటి దేబ్జానీ మోదక్ (Debjani Modak)కూడా ఒకరు. అందం, అభినయంతో ఆకట్టుకుంటూ.. ప్రేక్షకులను అలరించిన ఈమె.. ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా మరింత పాపులారిటీ సొంతం చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈమె బ్యాక్ గ్రౌండ్ , రెమ్యూనరేషన్ డీటెయిల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్లో అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపిస్తూ.. వేద , సత్య పాత్రలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. అందం, అభినయంతో ఆకట్టుకుంటూ తెలుగమ్మాయిలా, తెలుగు ఆడియన్స్ హృదయాలను సొంతం చేసుకుంది ఈ చిన్నది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 10 లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టబోతోంది అంటూ వార్త వచ్చినప్పటి నుంచి ఈమెకు సంబంధించిన ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలోనే ఆమె వ్యక్తిగత జీవితం, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ఆమె రెమ్యూనరేషన్ ఎంత ? ఇలా పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. 1996 మార్చి 20న పశ్చిమ బెంగాల్ కలకత్తాలో జన్మించింది. ఇంట్లో అందరూ ప్రేమగా “కిన్ని” అని పిలుస్తారట. ప్లస్ 2 చదువుకునే సమయంలోనే మోడలింగ్, నటనలో ఆఫర్లు రావడంతో కరస్పాండెన్స్ ద్వారా తన చదువును పూర్తి చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన లైఫ్ కి సంబంధించిన అప్డేట్స్ కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
ALSO READ: బిగ్ బాస్ లవర్స్ కి గుడ్ న్యూస్.. టైమింగ్స్ లో భారీ మార్పు!
ఇంస్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె తొలిసారి 2013లో నాకౌట్ అనే బెంగాలీ సీరియల్ తో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత 2015లో అపోంజోన్ అనే మరో బెంగాలీ సీరియల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. తమిళంలో కూడా ఎన్నో సీరియల్స్ లో లీడ్ రోల్ పోషించింది. ఇప్పుడు తెలుగులో స్టార్ మా చానల్లో ఎన్నెన్నో జన్మల బంధం అనే సీరియల్ లో వేద పాత్రతో ఆకట్టుకుంటున్న ఈమె.. మరోవైపు జెమినీ టీవీలో వచ్చిన సత్యభామ అనే సీరియల్ లో ప్రధాన పాత్ర పోషిస్తుంది.
బెంగాలీ మొదలుకొని సౌత్ సీరియల్స్ వరకు పలు సీరియల్స్ లో నటిస్తూ భారీ పాపులారిటీ అందుకున్న దెబ్జానీ తెలుగు సీరియల్స్ లో ప్రధాన పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో కాల్ షీట్ ఆధారంగా రోజుకి రూ.15,000 నుండి రూ.25 వేల వరకు పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం. అంటే సుమారుగా నెలకు రూ.7 లక్షల కు పైగా ఈమె రెమ్యూనరేషన్ అందుకుంటుంది. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ఇక్కడ వారానికి ఏకంగా రూ.4 నుండి రూ.5 లక్షల రెమ్యునరేషన్ తో హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. మొత్తానికి అయితే బిగ్ బాస్ వల్ల ఈమెకు డబుల్ ప్రాఫిట్ లభిస్తోందని చెప్పవచ్చు.