Bigg Boss 10 New Timings: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి మరో సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది బిగ్ బాస్ (Bigg Boss) .. ఇప్పటికే తెలుగులో 9 సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ షో మరి కొన్ని గంటల్లో చాలా గ్రాండ్ గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభం కాబోతోంది. దశావతారం అనే వినూత్న కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ ల్యాండ్ మార్క్ సీజన్ కోసం బిగ్ బాస్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా సెప్టెంబర్ 6 అనగా నేడు సాయంత్రం 7:00 గంటలకు స్టార్ మా, జియో హాట్ స్టార్ ఫ్లాట్ ఫామ్ లలో ఈ షో ప్రసారం కాబోతోంది.
సాధారణంగా ఇప్పటివరకు 9 సీజన్లు పూర్తికాగా, అలా ప్రసారమైన ప్రతి సీజన్ కూడా సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 10 గంటల సమయంలో ప్రసారం అయ్యేది. శని, ఆదివారాలు స్పెషల్ ఎపిసోడ్లలో మాత్రం రాత్రి 9:00 గంటలకు ప్రసారం చేసే వాళ్ళు. అయితే ఇప్పుడు మార్చిన టైమింగ్స్ ప్రకారం.. సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 9:30 గంటలకే టెలికాస్ట్ కాబోతోంది. నాగార్జున హోస్ట్ గా వ్యవహరించే వీకెండ్ స్పెషల్ ఎపిసోడ్లు అనగా శని, ఆదివారాలలో మాత్రం రాత్రి 9 గంటలకే ప్రసారం చేయనున్నారు. ఈ కొత్త టైమింగ్స్ తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నాగార్జున ఎవరూ ఊహించని మార్పులు జరగబోతున్నాయని ముందే హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో ఒకటి ఈ టైమింగ్స్ కాబోలు అంటూ నెటిజన్స్ ఈ విషయంపై కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈ టైమింగ్ మార్చడానికి కారణం షో టిఆర్పి రేటింగ్ పెంచడానికే. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ , ఉద్యోగాలు చేసేవారు , ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉండే వారికి ఇబ్బంది కలుగుతోంది. ప్రతిరోజు గంటసేపు ప్రసారమయ్యే ఈ షో రాత్రి 10:00 గంటలకు ప్రారంభమైతే.. పూర్తయ్యేసరికి 11 గంటలవుతుంది. అందుకే ఆడియన్స్ కోసం నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
నిజానికి బిగ్ బాస్ సీజన్ వన్ 2017 లో ప్రారంభమైనప్పుడు ఎన్టీఆర్ హోస్ట్ గా ఈ షో ప్రారంభించారు. అప్పట్లో మొదటి సీజన్ రాత్రి 9:30 గంటలకే ప్రసారమయ్యేది. 2018 లో నాని హోస్టుగా నిర్వహించిన 2వ సీజన్ కూడా ఇదే సమయానికే వచ్చేది. అయితే నాగార్జున 3వ సీజన్ నుంచి బాధ్యతలు చేపట్టారు. దాదాపు అదే టైమింగ్ కే ప్రచారం అయింది కానీ నాలుగవ సీజన్ నుంచి ప్రసార సమయాన్ని మార్చారు. అలా రాత్రి 10 గంటలకు ఈ షో ప్రసారం అయింది. ఇక ఇప్పుడు ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ తొమ్మిదిన్నర గంటలకి ప్రసారం చేయబోతున్నారు. ఇకపోతే ఈ సీజన్లో 10 మంది సెలబ్రిటీలు, 6గురు అగ్నిపరీక్ష ద్వారా ఎంపికైన కామనర్స్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు.