Big Stories

Anti Cancer Drugs:- మరింత మెరుగ్గా యాంటీ క్యాన్సర్ డ్రగ్స్..

Anti Cancer Drugs:- టెక్నాలజీ ఎంత పెరిగినా.. కొన్ని వ్యాధులకు మాత్రం ఇంకా మెరుగైన చికిత్సను అందించవచ్చు అనే ఉద్దేశ్యంతో శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఒకప్పుడు క్యాన్సర్‌కు చికిత్స అనేది లేదు. క్యాన్సర్ వస్తే మరణం తప్పదు అనే భావన ఉండేది. కానీ ఆ తర్వాత శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడి క్యాన్సర్‌కు చికిత్సను అందించారు. అయినా ఇప్పటికీ ఏదో ఒక విధంగా క్యాన్సర్‌ గురించి పరీక్షలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా చేసిన పరీక్షల్లో ఒక ఆసక్తికర విషయం బయటపడింది.

- Advertisement -

క్యాన్సర్‌ను ఎదుర్కోవడానికి మనుషుల శరీరంలోనే యాంటిక్యాన్సర్ ఏజెంట్స్ ఉంటాయని శాస్త్రవేత్తలు చేసిన తాజా పరిశోధనల్లో తేలింది. మామూలుగా క్యాన్సర్‌కు ఉపయోగించే మందులు ఎక్కువగా ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. అవి ఎప్పటికైనా అనారోగ్యానికి కారణమవుతాయని వైద్యులు హెచ్చరిస్తూ ఉంటారు. అలా కాకుండా తాజాగా శాస్త్రవేత్తలు కనిపెట్టిన యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్ అనేవి ఎక్కువగా యాంటీ క్యాన్సర్ యాక్టివిటీకి కారణమవుతాయని, తక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తాయని అంటున్నారు.

- Advertisement -

యాంటీ క్యాన్సర్ డ్రగ్ డెవలప్మెంట్ కోసం శాస్త్రవేత్తలు చేసిన ఈ కొత్త పరిశోధనలు ఉపయోగపడతాయని చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కారణంగా ఎంతోమంది ప్రతీ ఏడాది మరణిస్తున్నారు. యాంటి క్యాన్సర్ డ్రగ్స్ అనేవి అందుబాటులో ఉన్నా కూడా అవి పూర్తిస్థాయిలో పేషెంట్లను నయం చేయలేకపోతున్నాయి. వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంటాయి. అందుకే ఈ కొత్త యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్ అనేవి పేషెంట్లకు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ప్రస్తుతం డాక్సోరూబిసిన్ అనే యాంటి క్యాన్సర్ డ్రగ్ ఎక్కువగా మార్కెట్లో అందుబాటులో ఉంది. దాని బదులుగా టెట్రారైల్ మిథేన్ కాంపౌండ్స్‌ను కలిపి మరింత మెరుగ్గా యాంటి క్యాన్సర్ డ్రగ్స్‌ను తయారు చేయాలని శాస్త్రవేత్తలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే దీనిపై చేపట్టిన పరిశోధనలు కూడా సక్సెస్ అయ్యాయి. దీనితో యాంటీ క్యాన్సర్ డ్రగ్స్‌ను తయారు చేయడం వల్ల ఇతర సెల్స్‌పై కూడా చెడు ప్రభావం చూపించదని నిర్ధారించారు. త్వరలోనే ఈ కోణంలో పూర్తిస్థాయిలో పరిశోధనలు చేసి.. మెరుగైన యాంటీ క్యాన్సర్ డ్రగ్స్‌ను మార్కెట్లోకి తీసుకురావాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News