Big Stories

Lucky draw: బంపరాఫర్.. ఓటేయండి ల్యాప్‌టాప్‌లు, డైమండ్ రింగ్స్ తీసుకెళ్లండి

bhopal launches lucky draw: దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎక్కడా చూసినా పార్లమెంట్ ఎన్నికల హడావుడీ కనిపిస్తోంది. అయితే, అంతేస్థాయిలో ఓటింగ్ విషయమై కూడా ఓటర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ఉన్నతాధికారులు సైతం బస్టాండులు, దుకాణాల వద్దకు వెళ్లి ఓటర్లకు ఓటింగ్ లో పాల్గొనాలని, పోలింగ్ శాతాన్ని పెంచాలని అవగాహన కల్పించిన విషయం కూడా విధితమే.

- Advertisement -

తాజాగా కూడా మధ్యప్రదేశ్ లోని భోపాల్ జిల్లా ఎన్నికల అధికారులు ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. ఈ మేరకు నజరానాలు కూడా ప్రకటించారు. రండి ఓటేయండి ల్యాప్ టాప్ లు, డైమండ్ రింగులు గెల్చుకోండి అంటూ నజరానాలు ప్రకటించారు. అంతేకాదు.. టీవీలు, ఫ్రిజ్ లు, బైక్ లు, స్కూటర్లను కూడా బహుమతులుగా ఇస్తామంటూ ఆఫర్లు పకటించారు. ఇందుకోసం భోపాల్ లో కొన్ని చోట్ల కూపన్ బాక్సులను కూడా ఏర్పాటు చేశారు. అభ్యర్థులు తమ వివరాలతో ఫారాలను నింపి ఆ కూపన్ బాక్సులలో వేయాలి.. విజేతలు తాము ఓటేసినట్టు వేలిపై ఉన్న సిరా ముద్రను చూపినంక వారికి బహుమతి ఇవ్వనున్నట్లు తెలిసింది. అయితే, 2019 ఎన్నికలతో పోలిస్తే 2024 పార్లమెంటు ఎన్నికల్లో మొదటి, రెండో విడత పోలింగ్ లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తక్కువగా ఓటింగ్ శాతం నమోదవడంతో అధికారులు ఈ బహుమతి స్కీమ్ ను ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది.

- Advertisement -

Also Read: మోదీ మరో ఐదేళ్లు అధికారంలో ఉంటే దేశం సర్వనాశనమే: ఖర్గే

అయితే, పార్లమెంటు మొదటి దశ, రెండో దశ ఎన్నికల పోలింగ్ శాతాన్ని మంగళవారం ఈసీ ప్రకటించింది. మొదటి దశలో 66.14 శాతం, రెండో దశలో 66.71 శాతంగా పోలింగ్ నమోదైనట్లు ఈసీ పేర్కొన్నది. అయితే, అంతకుముందు ప్రతిపక్షాలు మాట్లాడుతూ.. పోలింగ్ శాతం ప్రకటించడంలో ఈసీ ఎందుకు ఆలస్యం చేస్తుందని, మొదటి దశ ఎన్నికలు జరిగి 11 రోజులైంది.. రెండో దశ ఎన్నికలు జరిగి నాలుగు రోజులవుతుంది.. అయినా కూడా ఎందుకు పోలింగ్ శాతాన్ని ప్రకటించడంలేదంటూ ఈసీని ప్రశ్నించిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్ లో తక్కువ శాతం ఓటింగ్ నమోదవడంతో అధికారులు ఈ స్కీమ్ ను ప్రవేశపెట్టినట్లు సమాచారం. మే 7న భోపాల్ లో పార్లమెంటు మూడో దశ ఎన్నికల పోలింగ్ జరగనున్నది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News