Big Stories

New Maruti Swift : మారుతి నుంచి సరికొత్త స్విఫ్ట్.. బుకింగ్స్ ఓపెన్!

New Maruti Swift : దేశీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో హ్యాచ్‌బ్యాగ్ కార్లకు ఫుల్ డిమాండ్ ఉంది. ఈ సెగ్మెంట్‌లో వివిధ కార్ల కంపెనీలు మధ్య భారీ పోటీ నడుస్తుంది. మారుతీ సుజుకీ స్విఫ్ట్,బలెనో, వ్యాగనార్, హ్యూందాయ్ ఐ 20 వంటి కార్లు ఈ సెగ్మెంట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లుగా చెప్పవచ్చు. కొనుగోలుదారులు ఎక్కువగా వీటివైపే మొగ్గుచూపుతున్నారు.

- Advertisement -

ఎందుకంటే ఈ కార్ల నిర్వహణ చాలా తక్కువగా ఉంటుంది. ధర కూడా అందుబాటులో ఉంటుంది. ఈ నేపథ్యంలోనే స్విఫ్ట్ 2024 కొత్త మోడల్‌ను దేశీయ మార్కెట్‌లో తీసుకురానుంది. అయితే లాంచ్‌కు ముందే కంపెనీ ఈ కారు బుకింగ్‌ను కూడా ప్రారంభించింది. ఈ కారు ఎలా బుక్ చేయాలి? ఫీచర్లు, తదితర విషయాలు తెలుసుకోండి.

- Advertisement -

కంపెనీ మారుతి సుజుకి స్విఫ్ట్ 2024 బుకింగ్ ప్రారంభించింది. కంపెనీ ఫోర్త్ జనరేషన్ స్విఫ్ట్‌‌గా త్వరలో భారతదేశంలో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. కంపెనీ ప్రకారం.. 2024 స్విఫ్ట్ ఆన్‌లైన్‌లో లేదా అరేనా డీలర్‌షిప్‌లో ద్వారా బుక్ చేసుకోవచ్చు. కొత్త స్విఫ్ట్‌ను బుక్ చేసుకోవడానికి మీరు రూ.11,000 ముందుగా చెల్లించాల్సి ఉంటుంది.

Also Read : అమ్మాయిలకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎంతో ప్రత్యేకం.. రూ. 50 వేల లోపే కొనుగోలు చేయవచ్చు

మారుతీ SEO పార్థో బెనర్జీ మాట్లాడుతూ.. మారుతి సుజుకి కొత్త స్విఫ్ట్‌ని మారుతున్న కాలానికి అనుగుణంగా అభివృద్ధి చెందిన ఒక ఐకానిక్ బ్రాండ్. దీనికి 29 లక్షల బలమైన కస్టమర్ బేస్ ఉంది. ఈ కారు అనేక అవార్డులు, ప్రశంసలు ఐకానిక్ స్విఫ్ట్ అందుకుంది. ఎపిక్ కొత్త స్విఫ్ట్ దాని స్పోర్టీ లుక్ ఇస్తుంది. తక్కువ ఉద్గారాలతో పర్యావరణ అనుకూలంగా ఉంటుంది. స్విఫ్ట్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేస్తుందని అన్నారు.

ఈ కొత్త స్విఫ్ట్‌ కారులో 1.2 లీటర్ 3 సిలిండర్ జెడ్-సిరీస్ పెట్రోల్ ఇంజన్ చూడొచ్చు. ఇది మరింత పర్యావరణ అనుకూలమైన ఇంజన్. కారు లీటర్‌కు సుమారుగా 35 నుంచి 40 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుందని అంచనా. సరికొత్త డిజైన్, ఫీచర్లు, అనేక అప్ డేట్స్‌‌తో ఈ కారు లాంచ్ కానుంది.

Also Read : 1980-90లలో ప్రజల హృదయాలను గెలుచుకున్న కార్లు ఇవే.. వీటి క్రేజ్ చూస్తే పిచ్చెక్కిపోద్ది..!

స్విఫ్ట్ 2024‌ను ఎప్పుడు లాంచ్ చేయవచ్చు?
ఈ సమాచారాన్ని కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. అటువంటి పరిస్థితిలో కంపెనీ మే 10 నాటికి కొత్త జనరేషన్ స్విఫ్ట్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News