E-Paper
Advertisement

Amazon Great Summer Sale 2024 Offers : వన్‌ప్లస్ ఫోన్లపై ఆఫర్లే ఆఫర్లు.. ఒక్కో వేరియంట్‌పై వేలల్లో డిస్కౌంట్!

Amazon Great Summer Sale 2024 Offers : వన్‌ప్లస్ ఫోన్లపై ఆఫర్లే ఆఫర్లు.. ఒక్కో వేరియంట్‌పై వేలల్లో డిస్కౌంట్!
Advertisement

Amazon Great Summer Sale 2024 : దేశంలో ఎక్కువ మంది ప్రజలు ఏ కొత్త వస్తువును కొనుగోలు చేయాలన్నా ఆఫర్ల కోసం చూస్తుంటారు. ఎక్కడ తక్కువ ధరకు లభిస్తాయని సెర్చ్ చేస్తుంటారు. అయితే ఇటువంటి వారికి ఈ కామర్స్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ శుభవార్త చెప్పింది. మే 2 న మధ్యాహ్నం 12 గంటలకు గ్రేట్ సమ్మర్ సేల్ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌లకు అర్ధరాత్రి 12 గంటల నుంచి ఈ సేల్‌ను వినియోగించుకోవచ్చు.

సేల్ సమయంలో, ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు మొదలైన అనేక రకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తగ్గింపు ధరలకు అందిస్తున్నారు. కస్టమర్లు ధర తగ్గింపులతో పాటు అదనపు బ్యాంక్ ఆఫర్‌లు, కూపన్‌లు, ఎక్స్ఛేంజ్ డీల్‌లను పొందగలరు. రాబోయే Amazon సేల్‌లో మీరు OnePlus స్మార్ట్‌ఫోన్లపై వేలల్లో డిస్కౌంట్లు ప్రకటించింది. తక్కువ ధరకే ఫోన్లను కొనుగోలు చేయవచ్చు.

Advertisement

Also Read : ఐఫోన్ కొనాలని చూస్తున్నారా తమ్ముళ్లూ.. అయితే మే 2 న రెడీగా ఉండండి!

OnePlus 12
OnePlus 12 స్మార్ట్‌ఫోన్ 12GB + 256GB వేరియంట్ రూ. 64,999గా ఉంది. అమెజాన్‌లోని ప్రమోషనల్ బ్యానర్ ప్రకారం గ్రేట్ సమ్మర్ సేల్ సమయంలో బ్యాంక్ ఆఫర్‌లతో సహా ఫోన్‌ను రూ. 62,999 వద్ద కొనుగోలు చేయవచ్చు. ఎంపిక చేసిన క్రెడిట్ / డెబిట్ కార్డ్‌లపై వినియోగదారులు రూ. 2,500 వరకు తగ్గింపును పొందవచ్చు. హ్యాండ్‌సెట్‌లో నో-కాస్ట్ EMI ద్వారా కూడా దక్కించుకోవచ్చు.

Advertisement

OnePlus 12R
OnePlus 12R ఫ్లాగ్‌షిప్ OnePlus 12 మోడల్‌తో పాటు దేశంలో లాంచ్ చేశారు. హ్యాండ్‌సెట్ బేస్ 8GB + 128GB వేరియంట్ ధర రూ. 39,999గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ను సేల్ సమయంలో  రూ. 37,999కి కొనుగోలు చేయవచ్చు. దీనిపై కూడా నో-కాస్ట్ EMI ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. బ్యాంక్ ఆఫర్ కింద రూ. 1,500 అదనపు ప్రయోజనాన్ని పొందవచ్చు.

Also Read : రియల్ మీ P1 Pro 5G మొదటి సేల్ ఈ రోజే.. ఆఫర్లు చూస్తే వదలడం కష్టమే..!

OnePlus 11R
దేశంలో OnePlus 11R మొబైల్‌ను ఇటీవలే లాంచ్ చేశారు. దీని 8GB + 128GB వేరియంట్ ధర రూ. 35,999గా ఉంది. అయితే మీరు రాబోయే అమెజాన్ సేల్ సమయంలో హ్యాండ్‌సెట్ సోలార్ రెడ్ కలర్ వేరియంట్‌ను రూ. 29,999లతో కొనుగోలు చేయవచ్చు. దీనిపై కూడా నో-కాస్ట్ EMI ఆఫర్ అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్ కింద రూ. 1,500 అదనపు ప్రయోజనాన్ని పొందవచ్చు.

Tags

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×