Big Stories

Electric Car Mileage : ఎలక్ట్రిక్ కార్ రేంజ్ తగ్గిపోయిందా.. అయితే ఇలా చేయండి!

Electric Car Mileage : దేశీయ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ కార్ల హవా నడుస్తోంది. వీటి విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి. మీరు ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయబోతున్నట్లయితే దాని నిజమైన మైలేజ్ గురించి తెలుసుకోండి. ఎందుకుంటే కార్ల కంపెనీలు తమ ప్రకటనలలో ఈ సమాచారాన్ని అందించవు. అంతే కాకుండా వారు క్లెయిమ్ చేసిన టెస్ట్ రేంజ్ మైలేజ్ భారతీయ రోడ్లు ప్రకారం రాకపొవచ్చు. అయినప్పటికీ కంపెనీ ఖచ్చితంగా క్లెయిమ్ చేసిన మైలేజ్ లేదా రేంజ్ వస్తుందని చెబుతుంది.

- Advertisement -

కంపెనీ క్లెయిమ్ చేయబడిన రేంజ్ టెస్ట్ చేయడానికి కారు ఎయిర్ కండిషనింగ్ లేకుండా 25 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద రోడ్డుపై గంటకు 50 కిలోమీటర్ల వేగంతో టెస్ట్ చేశారు. నిజమైన రేంజ్ రావాలంటే మీరు ఈ-కారు నడుపుతున్నప్పుడు 50 కి.మీ కంటే ఎక్కువ వేగంతో డ్రైవ్ చేయాలి. మీరు కాకుండా చాలా మందిని కారులో కూర్చోబెట్టుకోకూడదు. భారీ ట్రాఫిక్ లేదా గుంతలు రోడ్లు ఉన్నా మైలేజ్ క్లెయిమ్ ఫెయిల్ అవొచ్చు. కంపెనీలు తమ ప్రకటనలలో ఈ సమాచారాన్ని అందించవు.

- Advertisement -

Also Read : హైబ్రిడ్ టెక్నాలజీపై హ్యుందాయ్ ఫోకస్.. 2026 నాటికి మొదటి వెహికల్!

దేశీయ ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్‌లో 74 శాతం వాటాను కలిగి ఉన్న టాటా ఎలక్ట్రిక్ మొబిలిటీ  చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఆనంద్ కులకర్ణి మాట్లాడుతూ.. దేశంలో మోడిఫైడ్ ఇండియా డ్రైవ్ సైకిల్ ఆధారంగా వాహనం రేంజ్ నిర్ణయించబడుతుంది. అటువంటి పరిస్థితిలో గంటకు 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో నడపడం కచ్చితంగా రేంజ్‌ను తగ్గిస్తుంది. మా డీలర్లు సేల్ సమయంలో కస్టమర్‌లకు రేంజ్‌కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందజేస్తారు. అయినప్పటికీ కస్టమర్ తన సొంతంగా డ్రైవ్ చేస్తే రేంజ్ మారవచ్చు. అలానే పెట్రోల్, డీజిల్ వాహనాల మధ్య క్లెయిమ్ చేయబడిన రేంజ్‌లో కూడా తేడా ఉంది. నాలుగేళ్ల క్రితమే ఈ-కార్లు మార్కెట్‌లోకి వచ్చాయి. ఛార్జింగ్ స్టేషన్లు కూడా తక్కువగా ఉన్నాయి.

ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచే గరిష్టంగా 90 కిలోమీటర్ల వేగంతో వాహన రేంజ్‌ను ఫిక్స్‌ చేసేందుకు కసరత్తు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. టాటా కంపెనీ ప్రకారం వారి క్లెయిమ్ పరిధి 460 అయితే కస్టమర్లు వచ్చినప్పుడు వారు కేవలం 300-320 కిమీ మైలేజీని మాత్రమే చెబుతారు. ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్ ఎప్పుడూ ఒకేలా ఉండదని సొసైటీ ఆఫ్ మాన్యుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ డైరెక్టర్ జనరల్ సోహిందర్ గిల్ తెలిపారు. బ్యాటరీ పాతదయ్యే కొద్దీ దాని సామర్థ్యం తగ్గిపోతుంది. కొత్త బ్యాటరీ ఎలక్ట్రాన్లు, ఇతర రసాయనాలు తాజాగా ఉంటాయి.

Also Read : అమ్మాయిలకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎంతో ప్రత్యేకం.. రూ. 50 వేల లోపే కొనుగోలు చేయవచ్చు

క్లెయిమ్ చేయబడిన రేంజ్ విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే వారు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని వినియోగదారు సెల్‌కు ఫిర్యాదు చేయవచ్చని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో 2023-24లో భారతదేశంలో 40 లక్షల ప్యాసింజర్ కార్లు విక్రయించగా ఎలక్ట్రిక్ కార్ల సంఖ్య 90,432 మాత్రమే. ఎలక్ట్రిక్ కార్లలో క్యాబ్‌లు ప్రధాన వాటాను కలిగి ఉన్నాయి. ఈ కార్లు ప్రధానంగా నగరాల్లో పనిచేస్తాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News