Big Stories

WiFi signals:- వైఫై సిగ్నల్స్‌తో మనిషి యాక్టివిటీని కనుక్కోవచ్చు..!

WiFi signals:- గాలిలో ప్రయాణించే ఎన్నో రకాల సిగ్నల్స్.. అప్పుడప్పుడు ఒకదానితో ఒకటి ఢీకొంటాయి. సాధారణంగా వర్షాలు, తుఫానులు వంటి సమయాల్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. టెక్నాలజీ అనేది పెరిగిన తర్వాత వైఫై సిగ్నల్స్ కూడా గాలిలో విపరీతంగా ప్రయాణించడం మొదలుపెట్టాయి. దాని వల్ల పలు అంతరాయాలు కలుగుతున్నాయని, అవి అమెరికాకు చెందిన గూఢాచారులకు సాయంగా నిలుస్తున్నాయన్న వార్త కొత్తగా ప్రచారంలోకి వచ్చింది.

- Advertisement -

రేడియో వేవ్స్ లాగానే వైఫే సిగ్నల్స్ కూడా మనుషుల వల్ల జరిగే అంతరాయాన్ని గుర్తుపట్టేస్తాయి. వాటికి అంతరాయం కలిగించింది ఏంటి, అది ఏ షేప్‌లో ఉంది, ఎంత స్పీడ్‌తో కదిలింది అనే విషయాలు కూడా ఈ సిగ్నల్స్ కనిపెట్టేస్తాయి. అయితే వైఫై సిగ్నల్స్ ద్వారా బయటికి ఎక్కువగా కనిపించని మనుషుల ప్రవర్తన గురించి స్టడీ చేయాలనే ఆలోచన శాస్త్రవేత్తలకు వచ్చింది. ఈ ఆలోచనను ముందుకు తీసుకెళ్లడం ద్వారా ఇది సాధ్యమని వారికి అర్థమయ్యింది. అందుకోసమే డెన్స్‌పోస్ ఫ్రమ్ వైఫై అనే ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టారు.

- Advertisement -

వైఫై రూటర్స్‌ నుండి వచ్చే సిగ్నల్స్‌ను ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో స్టడీ చేయించడం ద్వారా ఆ సిగ్నల్స్‌ను ఉపయోగిస్తున్న మనుషుల యాక్టివిటీ ఏంటో తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంటే ఆ సిగ్నల్స్ ఉపయోగిస్తున్న మనుషులు వారి రూమ్‌లో ఎక్కడికి కదులుతున్నారు, ఏం చేస్తున్నారు అనే విషయాలు తెలుసుకోవచ్చన్నారు. వారి యాక్టివిటీని తెలుసుకోవడాన్ని పోస్ట్ ఎస్టిమేట్స్ అంటారని తెలిపారు. ఈరోజుల్లో ఉన్న టెక్నాలజీ కంటే వారు చేసిన ఆలోచన చాలా అడ్వాన్స్‌గా ఉంటుందని శాస్త్రవేత్తలు బయటపెట్టారు.

మనుషుల కదలికలను తెలుసుకోవడం మాత్రమే కాకుండా.. 3డిలో వాటిని తయారు కూడా చేయగలమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇదివరకు కూడా వైఫై సిగ్నల్స్ మీద ఇలాంటి ప్రయోగాలు చేయడానికి ప్రయత్నించారు. కానీ అవి పూర్తిస్థాయిలో వర్కవుట్ అవ్వలేదు. అయితే ఈ ఐడియా అనేది మనుషుల ప్రైవసీని దెబ్బతీసే విధంగా ఉందని చాలామంది ఇప్పటికే వాదనలు మొదలుపెట్టారు. అందుకే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన విషయాలను ఎక్కువగా బయటికి రానివ్వడం లేదు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News