BigTV English

Pawan Comments: వైసీపీకి, జగన్‌కు పొలిటికల్ హాలిడేను ప్రకటించాలి: పవన్ కల్యాణ్

Pawan Comments: వైసీపీకి, జగన్‌కు పొలిటికల్ హాలిడేను ప్రకటించాలి: పవన్ కల్యాణ్

Pawan Kalyan Comments: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. బుధవారం మండపేటలో ఆయన మాట్లాడుతూ.. అన్యాయాన్ని ఎదుర్కోవడమే జనసేన లక్ష్యమని, 12 రోజుల్లో కొత్త ప్రభుత్వం రాబోతుందని, రూ. 3 వేల నిరుద్యోగ భృతి ఇస్తాం.. వ్యవసాయానికి 9 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తామంటూ పవన్ కల్యాణ్ అన్నారు. రైతులను జగన్ ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదన్నారు. కౌలు రైతులు చనిపోయినా కూడా జగన్ ఏ రోజు కూడా స్పందించలేదన్నారు. తాము అధికారంలోకి వస్తే వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యనితనిస్తామన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు . కేంద్రం నుంచి వచ్చే గ్రామపంచాయతీల నిధులను డైరెక్టుగా గ్రామపంచాయతీలకే వెళ్లేవిధంగా కృషి చేస్తామన్నారు.


తనని ఎన్నో మాటలు అన్నారని.. అయినా కూడా తాను ఏనాడు కూడా బాధపడలేదని.. ఏ పార్టీ రాజకీయ నాయకుల మీద తనకు వ్యకిగతంగా ఎలాంటి ద్వేషం లేదని.. తాను బయటికొక మాట లోపలొకమాట చెప్పబోనని.. తనకున్నది కేవలం ఏపీ అభివృద్ధి కావడమే తన లక్ష్యమని పవన్ కల్యాణ్ అన్నారు. ‘మీ కోసమే నా తపన.. ఓటు చీలకూడదు.. వైసీపీ అవినీతి కోటలను బద్ధలు కొట్టాలి.. కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి.. మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలి’ అన్నది తన ఏకైక లక్ష్యమని ఆయన అన్నారు. వైసీపీకి, జగన్ కు పొలిటికల్ హాలిడేను ప్రకటించాలన్నారు. కనీసం ప్రతిపక్షంలో కూడా జగన్ ఉండకుండా కూటమి పార్టీలకు ఓటు వేయాలన్నారు.

Also Read: చంద్రబాబు వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనాన్ని తెలియజేస్తున్నాయి: సీఎం జగన్


వైఎస్ జగన్ కులాలను వాడుకుని ఎదుగుతున్నాడని, కులాల్ని దాటుకుని వెళ్లకపోతే రాష్ట్రం సర్వనాశనమవుతుందని పవన్ కల్యాణ్ అన్నారు. మేనిఫెస్టోలోని ప్రతి హామీ నెరవేరుస్తామని ఆయన అన్నారు. మీరు నినాదాలు చేస్తున్నారు ఓకే.. కానీ ఆ నినాదం ఓటుగా మారాలి.. అప్పుడే మన పార్టీకి గుర్తింపు వస్తది, సమస్యలపై తాను పోరాటం చేసే అవకాశముంటందంటూ అభిమానులను కోరారు.

Tags

Related News

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు? అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Big Stories

×