Big Stories

WhatsApp Account Restriction Feature : వాట్సాప్ నుంచి షాకింగ్ ఫీచర్.. ఇక తప్పు చేస్తే శిక్ష తప్పదు!

WhatsApp Account Restriction Feature : ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే టాప్ చాటింగ్ యాప్ వాట్సాప్. ఈ పాపులర్ యాప్‌ని ఇతర చాటింగ్ యాప్‌లకు దీటుగా నిలిపేందుకు కంపెనీ పేరెంట్ కంపెనీ మోటా నిరంతరం క‌ృషి చేస్తోంది. ఇందులో భాగంగానే కొత్తకొత్త ఫీచర్లను ఇప్పటికే పరిచయం చేసింది. తాజాగా మరోకొత్త ఫీచర్‌ను ఇంట్రడ్యూస్ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ ఫీచర్ వినియోగదారులందరికీ ఒకే రకమైన అనుభవాన్ని అందిస్తుంది. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

- Advertisement -

WABetaInfo నివేదిక ప్రకారం.. Meta వాట్సాప్‌ అకౌంట్‌ను కొంత సమయం పాటు బ్లాక్ లేదా రెస్టిక్ట్ చేసే ఫీచర్‌ను తీసుకొస్తుంది. దీని కారణంగా వినియోగదారులు పొరపాటు చేస్తే వారు కొంత సమయం వరకు ఎటువంటి సమాచారాన్ని ఇతరులకు పంపలేరు. ఒక రకంగా చెప్పాలంటే తప్పు చేసిన వారికి ఇది చిన్న శిక్ష. ఖాతా బ్లాక్ చేసినప్పటికీ వినియోగదారులు ఇప్పటికే ఉన్న చాట్‌లు చూడొచ్చు. మెసేజ్‌లను రిసీవ్ చేసుకోవచ్చు. రిప్లై కూడా ఇవ్వగలుగుతారు. కానీ ముఖ్యమైన కమ్యూనికేషన్‌ని పంపలేరు.

- Advertisement -

Also Read : ఈ నెలలో రిలీజ్ కానున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. లిస్ట్ చూసేయండి!

WhatsApp ఎలా బ్లాక్ చేస్తుందంటే?

వాట్సాప్‌లో తప్పు చేసిన వారిని పట్టుకోవడానికి కొన్ని ప్రత్యేక టూల్స్ ఉపయోగిస్తుంది. వీటి ద్వారా అకౌంట్ కలిగిన వ్యక్తి స్పామ్‌ను పంపుతున్నారా లేదా ఒకేసారి చాలా మందికి మెసేజెస్ పంపుతున్నారా,  మరేదైనా వాట్సాప్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారా అని తనిఖీ చేస్తుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ టూల్స్ మీ చాటింగ్ లేదా కాల్‌ల కంటెంట్‌లను చదవలేవు.

ఎందుకంటే వాట్సాప్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను ఉపయోగిస్తుంది. ఈ టూల్స్ మీరు WhatsAppని ఎలా ఉపయోగిస్తున్నారు అంటే మీరు తరచుగా సమచారాన్ని పంపుతున్నారో లేదా మీరు ఏదైనా ఆటోమేటిక్ ప్రోగ్రామ్‌లను ఉపయోగిస్తున్నారా వంటి వాటిని మాత్రమే చూస్తుంది. ఇలా తప్పు చేసిన వారి ఖాతాలను గుర్తిస్తుంది.

Also Read : వన్‌ప్లస్ ఫోన్లపై ఆఫర్లే ఆఫర్లు.. ఒక్కో వేరియంట్‌పై వేలల్లో డిస్కౌంట్!

వాట్సాప్ వారి ఖాతాలను పూర్తిగా నిలిపివేయదు. కొంతకాలం మాత్రమే పనిచేయకుండా చేస్తుంది. ఇది వినియోగదారులు వారి తప్పులను సరిదిద్దుకునే అవకాశం. వారి డేటా కూడా సురక్షితంగా ఉంటుంది. ఇలాంటి ఆంక్షలు విధించడం ద్వారా వాట్సాప్ తప్పు చేసిన వారిని శిక్షించవచ్చని భావిస్తుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్‌లో ఉంది. యాప్‌కి అప్‌డేట్‌లో తీసుకురానుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News