Big Stories

CEO Vikas Raj : మొదలైన పోస్టల్ బ్యాలెట్ల ప్రింటింగ్.. మే 3 నుంచి హోమ్ ఓటింగ్ ప్రారంభం : సీఈఓ వికాస్ రాజ్

CEO Vikas Raj on Loksabha Elections : తెలంగాణలో మే 13న లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో ఎంతమంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారో సీఈఓ వికాస్ రాజ్ వెల్లడించారు. ఈ ఎన్నికల్లో 525 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. 285 మంది అభ్యర్థులు స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారని తెలిపారు. అత్యధికంగా సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి 45 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. అత్యల్పంగా ఆదిలాబాద్ స్థానంలో 12 మంది పోటీ చేస్తున్నారని పేర్కొన్నారు.

- Advertisement -

ఎన్నికల నేపథ్యంలో ఓటరు స్లిప్పుల పంపిణీ ప్రారంభమైందని తెలిపారు. హైదరాబాద్ లో లోక్ సభ ఎన్నికల నిమిత్తం 3986 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేశామన్నారు. కొన్ని ప్రాంతాల్లో 2-3 బ్యాలెట్లను వాడుతున్నామన్న వికాస్ రాజ్.. 7 స్థానాల్లో 3 ఈవీంలను వాడాల్సి ఉంటుందన్నారు. 9 స్థానాల్లో కేవలం 2 ఈవీఎంలను వాడుతున్నట్లు తెలిపారు. ఇక ఆదిలాబాద్ లోక్ సభ స్థానానికైతే 1 ఈవీఎం సరిపోతుందని తెలిపారు.

- Advertisement -

Also Read : అమిత్ షా ఫేక్ వీడియో కేసు, గడువు కోరిన తెలంగాణ కాంగ్రెస్

ఎన్నికల నిమిత్తం ఈసీతో మాట్లాడి అదనంగా ఈవీఎంలను తెప్పిస్తున్నట్లు తెలిపారు. జిల్లాల్లో ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ల ప్రింటింగ్ ప్రక్రియ మొదలైందని, మే 3వ తేదీ నుంచి హోమ్ ఓటింగ్ ప్రారంభమవుతుందని సీఈఓ వికాస్ రాజ్ వెల్లడించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News