Big Stories

CM Jagan Mohan Reddy: చంద్రబాబు వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనాన్ని తెలియజేస్తున్నాయి: సీఎం జగన్

CM Jagan Mohan Reddy: ఏపీలో జరగబోయే ఎన్నికలు రానున్న ఐదేళ్ల భవిష్యత్తు అని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. జగన్‌కు ఓటేస్తే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని అన్నారు. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన మేనిఫెస్టోను 99 శాతం అమలు చేశామని స్పష్టం చేశారు. ఎన్నికలు అయ్యాక చంద్రబాబు మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తారని అన్నారు.

- Advertisement -

బొబ్బిలి రోడ్ షోలో పాల్గొన్న జగన్ చంద్రబాబుపై విమర్శల వర్షం గుప్పించారు. సాధ్యం కాని హామీలతో చంద్రబాబు మోసం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనాన్ని తెలియజేస్తున్నాయని సీఎం జగన్ మండిపడ్డారు. 2014లో సాధ్యం కాని హామీలిచ్చారని గుర్తు చేశారు. ఆడబిడ్డ పుడితే అకౌంట్లో 25 వేలు వేస్తామన్నారని.. వేశారా అని సీఎం జగన్ ప్రశ్నించారు. రైతు రుణమాఫీ చేశారా.. పొదుపు సంఘాల రుణాలు రద్దు చేశారా అని ప్రశ్నించారు. అర్హులైన వారికి 3 సెంట్లు ఇస్తామన్నారు .. ఇచ్చారా అని చంద్రబాబుపై సీఎం జగన్ ఫైర్ అయ్యారు.

- Advertisement -

ఇక ఇప్పటి వరకు 2 లక్షల 30 వేల ఉద్యోగాలిచ్చామని సీఎం జగన్ స్పష్టం చేశారు. 58 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. అవ్వాతాతలు, అక్కా చెల్లెళ్ల దీవెనలే తనకు శ్రీరామ రక్ష అని అన్నారు. వైసీపీకి ఓటేస్తే సంక్షేమ పథకాలన్ని కొనసాగుతాయని.. లేకుంటే అమలు కావని సీఎం తెలిపారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News