Big Stories

Plastic Food:- ప్లాస్టిక్ ఫుడ్ ప్యాకేజింగ్‌తో అలాంటి ముప్పు..

Plastic Food:– తినే తిండి, పీల్చే గాలి.. ఆరోగ్యంపై ప్రభావం చూపించే వాటిలో ఈ రెండు ప్రముఖ స్థానాల్లో ఉంటాయి. కానీ పెరుగుతున్న కాలుష్యం వల్ల ఇవి కూడా కలుషితం అయిపోయి మానవాళి ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నాయి. కేవలం తినే ఆహారం మాత్రమే కాదు.. ఆ ఆహారం కోసం చేసే ప్యాకేజింగ్ కూడా ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని శాస్త్రవేత్తలు ఇటీవల బయటపెట్టారు. అందుకే ఫుడ్ ప్యాకేజింగ్‌పై కూడా ఓ కన్నేసి ఉంచడం అవసరమని తెలిపారు.

- Advertisement -

ఒబిసిటీ అనేది ప్రాణాంతక వ్యాధి కాదు.. అని పూర్తిగా కొట్టిపారేయలేము. ప్రపంచవ్యాప్తంగా ఈమధ్య ఒబిసిటీ కేసులే ఎక్కువగా పెరిగిపోయాయి. ముఖ్యంగా అమెరికాలోని యువతలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తోంది. 1980ల్లో అమెరికాలో 14 శాతం యువత ఒబిసీటీ బారినపడ్డారు. ఇప్పుడు ఆ సంఖ్య 42 శాతానికి పెరిగింది. అంతే కాకుండా 2035లోపు దాదాపు ప్రపంచంలోని సగం జనాభా ఒబిసీటీ వల్ల ఇబ్బందులు పడుతుందని స్టడీ చెప్తోంది. చిన్నపిల్లలు, టీనేజర్లలో కూడా ఒబిసిటీ వల్ల కలిగే ఇబ్బందులు పెరిగిపోతూనే ఉన్నాయి.

- Advertisement -

ఎక్కువగా తినడం, సరిగా వ్యాయమం చేయకపోవడం మాత్రమే ఒబిసిటీకి కారణాలు అని శాస్త్రవేత్తలు కూడా పూర్తిగా నిర్ధారణకు రాలేకపోతున్నారు. అందుకే ఒబిసిటీకి అసలు ఏఏ అంశాలు కారణమవుతున్నాయి అనే కోణంలో పరిశోధనలు మొదలుపెట్టారు. అయితే ప్లాస్టిక్‌తో ప్యాక్ చేయబడిన ఆహారం కూడా ఒబిసిటీకి కారణమే అని వారి పరిశోధనల్లో బయటపడింది. గతేడాది నుండి ఈ కోణంలో వారు పూర్తిస్థాయిలో పరిశోధనలు చేసిన తర్వాతే ఈ నిర్ధారణకు వచ్చారు.

పూర్తిగా ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌తో ఉన్న 34 ఆహార పదార్థాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. వీటిలో వారికి ఏకంగా 55 వేల కెమికల్స్ బయటపడ్డాయి. అందులో కేవలం 629 మాత్రమే వారు కనిపెట్టగలిగారు. అందులో 11 కెమికల్స్‌ ఒబిసిటీకి దారితీస్తాయని కనుగొన్నారు. దీంతో పాటు ఈ కెమికల్స్ ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా దారితీస్తాయని అన్నారు. కాకపోతే ఈ కెమికల్స్ ఏంటని, వాటి లక్షణాలు ఏంటి అని వారికి పూర్తిగా వివరాలు తెలియలేదు. అందుకే ఈ విషయంలో క్షుణ్ణంగా పరీక్షలు చేపట్టాలని శాస్త్రవేత్తలు నిర్ణయించుకున్నారు. ఇప్పుడు మాత్రం ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ఒబిసిటీకి దారితీస్తుందని నిర్ధారించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News