BigTV English

Road collapses, 19 people killed: సడన్‌గా కుంగిన రోడ్డు, వాహనాలు ఒకదానిపై మరొకటి

Road collapses, 19 people killed: సడన్‌గా కుంగిన రోడ్డు, వాహనాలు ఒకదానిపై మరొకటి

South china road collapse news(Today’s international news): బుధవారం ఎర్లీ మార్నింగ్ మూడు గంటలు దాటింది. గడియారంలో గంటల ముళ్లు మెల్లగా నాలుగు వైపు వెళ్లోంది. హైవేపై వాహనాలు వేగంగా దూసుకు పోతున్నాయి. ఇంతలోనే పెద్ద కుదుపు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 వాహనాలు ఒకదానిపై మరొకటి పడిపోయాయి. ఏమైందో తెలుసుకునే లోపు 19 మంది మృత్యువాతపడ్డారు. ఈ ఘటన సౌత్ చైనాలోని గ్వాంగ్ డాంగ్ ప్రావెన్సులో చోటు చేసుకుంది.


చైనా వార్తల ప్రకారం మీజౌ- డాబు కౌంటీల మధ్య హైవే ఒక్కసారిగా కుంగిపోయింది. ఈ ప్రమాదంలో 19 మంది స్పాట్‌లో మరణించారు. 49 మందికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకున్నాయి. క్షతగాత్రులను లోయ నుంచి బయటకు తీసి అంబులెన్సుల ద్వారా సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి సమీపంలోని సీసీటీవీ కెమెరాలో దృశ్యాలు రికార్డు అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ ఆపరేషన్‌లో 500 నుంచి 700 మందికి పైగా పాల్గొన్నారు. ఆసుపత్రిలో ఉన్న కొందరు పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు డాక్టర్లు. ఇటీవల సౌత్ చైనాలో వానలు ముంచెత్తుతున్నాయి. హిల్స్ ప్రాంతంలోని రోడ్డు కావడంతో కూలి ఉంటుందన్నది అధికారులు అంచనా. ముఖ్యంగా రోడ్డు కుంగిన సమయంలో భారీగా గొయ్య ఏర్పడిందని చెబుతున్నారు. మొత్తానికి ఘటనపై ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.


 

 

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×