Baby Passport:పుట్టి 13 రోజులు కూడా పూర్తికాకముందే ఓ చిన్నారి పాస్‌పోర్ట్ తీసుకుంది. ఇంత చిన్న వయసులో పాస్‌పోర్ట్ పొందిన చిన్నారిగా కొత్త రికార్డు సృష్టించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీంతో ఈ చిన్నారి గురించి ఇప్పుడు అందరూ ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు.
ఇచ్చాపురం పట్టణానికి చెందిన వ్యాపారవేత్త వజ్రపు వెంకటేష్ కుటుంబంలో ఈ సంఘటన జరిగింది. ఆయన కుమారుడు ఆశీష్, గీతమాధురి దంపతులకు పాప జన్మించింది. ఆ చిన్నారికి అగస్య ప్రిన్సీ అని పేరు పెట్టారు. పాప పుట్టిన 13 రోజులకే పాస్‌పోర్ట్ రావడంతో కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగితేలుతున్నారు.
13 రోజుల వయసులోనే పాస్‌పోర్ట్
మాములుగా పాస్‌పోర్ట్ అంటే పెద్దవాళ్ళు,విదేశాలకు వెళ్లేవాళ్లు పాస్‌పోర్ట్ తీసుకుంటారని అనుకుంటాం. కానీ చిన్న పిల్లలకు కూడా పాస్‌పోర్ట్ తీసుకునే అవకాశం ఉంటుందని చాలా మందికి తెలీదు. గతంలో 19 రోజుల వయసులో ఓ చిన్నారి పాస్‌పోర్ట్ పొందిన రికార్డు ఉంది.అయితే తాజాగా ఇప్పుడు అగస్య ప్రిన్సీ 13 రోజుల వయసులోనే పాస్‌పోర్ట్ పొందడంతో ప్రపంచంలోనే అతి చిన్న వయసులో పాస్ పోర్ట్ తీసుకున్న వ్యక్తిగా అగస్య ప్రిన్సీ రికార్డ్ స్ప్రుష్టించింది.
పాప పుట్టిన వెంటనే కుటుంబ సభ్యులు పాస్‌పోర్ట్ కోసం ప్రక్రియ మొదలుపెట్టారట. అవసరమైన పత్రాలు సిద్ధం చేసి దరఖాస్తు చేయడం తో వెరిఫికేషన్ అయిన తర్వాత పాస్‌పోర్ట్ అందించారట అధికారులు. దీంతో పాప పుట్టిన ఆనందంతో పాటు ఈ రికార్డు కూడా రావడంతో కుటుంబంలో సంతోషం రెట్టింపైందనే చెప్పాలి.
ఇక తమ పాపకు ఇంత చిన్న వయసులోనే పాస్‌పోర్ట్ రావడం చాలా సంతోషంగా ఉందని చెబుతున్నారు తల్లిదండ్రులు.ఈ విషయం తమ కుటుంబానికి మాత్రమే కాకుండా ఇచ్చాపురానికి కూడా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్
తమ కుమార్తె సాధించిన ఈ ఘనతను ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నిస్ బుక్ ప్రపంచ రికార్డుగా గుర్తించాయని తల్లిదండ్రులు తెలిపారు. ఈ విషయాన్ని బిగ్ టీవీతో ప్రత్యేకంగా పంచుకోవడం విశేషం. మొత్తానికి చిన్నారి పాస్‌పోర్ట్, రికార్డుకు సంబంధించిన వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
పుట్టి 13 రోజులకే పాస్‌పోర్ట్ అంటే వినడానికి కూడా కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది. అందుకే ఈ విషయం తెలిసిన వాళ్లు “ఇంత చిన్న పాపకు అప్పుడే పాస్‌పోర్ట్ ఏంటి?” అంటూ మాట్లాడుకుంటున్నారట . అయితే పాస్‌పోర్ట్ పొందడానికి వయసు అడ్డు కాదని ,విదేశాలకి వెళ్ళే అవసరం ఉన్న చిన్నారులకు కూడా పాస్‌పోర్ట్ ఇస్తారట.
ALSO READ:ఏపీ పిల్లలకు ఢిల్లీలో ఈ తిప్పలు ఎందుకు?..విజయసాయి రెడ్డి ఫైర్!
అగస్య ప్రిన్సీ విషయంలో మాత్రం ఇంత చిన్న వయసులో పాస్‌పోర్ట్ రావడమే ప్రత్యేకమనే చెప్పాలి. ఒకవైపు పాప పుట్టిన ఆనందం.. మరోవైపు పుట్టిన కొద్ది రోజులకే అరుదైన రికార్డు వచ్చిందన్న సంతోషం. దీంతో అగస్య ప్రిన్సీ కుటుంబంలో ఇప్పుడు పండగ వాతావరణం కనిపిస్తోంది. బంధువులు, స్నేహితులు చిన్నారిని అభినందిస్తున్నారు.
ఏదేమైనా.. పుట్టిన 13 రోజులకే పాస్‌పోర్ట్ పొందిన అగస్య ప్రిన్సీ ఇప్పుడు ఇచ్చాపురంలో హాట్ టాపిక్‌గా మారింది.