Documentary on OTT: అవమానాలు, కష్టాలు, ఒంటరితనం… ఇవన్నీ ఎదురైనా వెనక్కి తగ్గకుండా తనకంటూ ఓ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న వ్యక్తి కథ ఎలా ఉంటుంది ? చిన్న స్థాయి నుంచి మొదలై, తన పేరు ప్రపంచానికి తెలిసేలా చేసిన ఓ రియల్ హీరో ప్రయాణాన్ని చూపించే డాక్యుమెంటరీ ‘Untold: Mr. T’. జీవితంలో ఎదురైన అవమానాలను బలంగా మార్చుకుని, క్రమంగా తన రంగంలో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న వ్యక్తి జీవితంలోని కీలక ఘట్టాలను ఈ డాక్యుమెంటరీలో ఆవిష్కరించారు. మరి ఈ ఇన్స్పైరింగ్ డాక్యుమెంటరీ ఏ ఓటీటీలో ఉంది ? తెలుగులో అందుబాటులో ఉందా లేదా ? అన్నది తెలుసుకుందాం పదండి.
‘అన్ టోల్డ్ మిస్టర్ టి’ ఓ నిజ జీవిత వ్యక్తి ప్రయాణం చుట్టూ సాగుతుంది. మొదట్లో ఎదురైన అవమానాలు, కష్టాలు అతని జీవితాన్ని వెనక్కి లాగుతున్నా, వాటినే ప్రేరణగా మార్చుకుని ముందుకు సాగుతాడు. ఒక్కో అవకాశం అతని జీవితంలో కొత్త మార్పును తీసుకొస్తుంది. క్రమంగా తన ప్రతిభను నిరూపించుకుంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటాడు. అయితే విజయం వచ్చిన తర్వాత కూడా సమస్యలు పూర్తిగా ముగిసిపోవు. తన పేరు, ఇమేజ్, కెరీర్‌ను నిలబెట్టుకోవడానికి మరోసారి పోరాడాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. ఆ ఒత్తిళ్లను ఎలా అధిగమించాడన్నదే కథలో కీలకమైన అంశం.
అసలు సామాన్యుడిగా మొదలైన అతని ప్రయాణం ఎక్కడికి చేరింది ? అవమానాలే అతని విజయానికి కారణమయ్యాయా ? ఎదురుదెబ్బల మధ్య తన గుర్తింపును ఎలా నిర్మించుకున్నాడు ? చివరికి చరిత్రలో తనకంటూ ఓ ముద్ర ఎలా వేశాడు ? అన్న ప్రశ్నలకు సమాధానంగా డాక్యుమెంటరీలో సాధారణ వ్యక్తిగా మొదలైన ఆయన ప్రయాణం, కష్టాలు, అవకాశాలు, ఎదురుదెబ్బలు, చివరికి సాధించిన విజయాల వరకు ఒక్కో దశను ఆసక్తికరంగా చూపించారు. తనపై వచ్చిన విమర్శలను ఎలా ఎదుర్కొన్నాడు ? కష్టాల్లోనూ తన లక్ష్యాన్ని ఎలా వదల్లేదు ? చివరికి తన జీవితాన్నే ఎలా మార్చుకున్నాడు ? అనేదే ఈ డాక్యుమెంటరీలో చూడాల్సిన స్పూర్తిదాయకమైన కథ.
‘అన్ టోల్డ్ మిస్టర్ టి’ ఇంగ్లీష్ డాక్యుమెంటరీ. నిజ జీవిత కథలు, స్ఫూర్తినిచ్చే విజయగాథలు, ప్రముఖ వ్యక్తుల జీవితంలోని తెలియని కోణాలు తెలుసుకోవాలనుకునే వారికి ఈ డాక్యుమెంటరీ ఆసక్తికరంగా అనిపించొచ్చు. ప్రస్తుతం Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ తెలుగు ఆడియో అందుబాటులో లేదు. ఇంగ్షీషులో మాత్రం స్ట్రీమింగ్ అవుతోంది.