E-Paper
Advertisement

ఏపీ పిల్లలకు ఢిల్లీలో ఈ తిప్పలు ఎందుకు?..విజయసాయి రెడ్డి ఫైర్!

ఏపీ పిల్లలకు ఢిల్లీలో ఈ తిప్పలు ఎందుకు?..విజయసాయి రెడ్డి ఫైర్!
Advertisement

Delhi Hostels: ఢిల్లీలో చదువుకుంటున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల వసతి సమస్యపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి స్పందించారు. ఢిల్లీ యూనివర్సిటీ దగ్గరలో హాస్టల్ వసతులు సరిగ్గా లేకపోవడంతో ఏపీ నుంచి అక్కడికి వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ట్విటర్ వేదికగా తెలిపారు. ఈ క్రమంలో ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా హాస్టళ్లను నిర్మించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.

ఢిల్లీ యూనివర్సిటీలో లక్షలాది మంది విద్యార్థులు చదువుతుంటే.. వారికి అందుబాటులో ఉన్న హాస్టల్ గదులు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయని తెలిపారు. దీంతో బయట నుంచి ఢిల్లీకి వెళ్లే విద్యార్థులు ప్రైవేట్ పీజీలు, రెంటెడ్ రూమ్స్ ని ఆశ్రయించాల్సి వస్తోందని చెప్పారు. భారీ అద్దెలతో పాటు కొన్ని ప్రాంతాల్లో సరిగ్గా భద్రత కూడా లేకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

Advertisement

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతి ఏడాది పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఢిల్లీకి వెళ్తున్నారు. మంచి కాలేజీల్లో సీట్లు సంపాదించుకున్నా.. అక్కడ ఉండేందుకు సరైన వసతులు లేకపోవడం మరో పెద్ద సమస్యగా మారుతుంది. చదువు కోసం సొంత ఊరిని, కుటుంబాన్ని వదిలి వెళ్లే విద్యార్థులకు తక్కువ ఖర్చుతో కూడిన వసతి అందుబాటులో ఉండటం చాలా అవసరమని విజయసాయి రెడ్డి అభిప్రాయపడ్డారు.

తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలో ఉన్న శ్రీ వెంకటేశ్వర కాలేజీ పరిస్థితిని కూడా ఆయన ఈ సందర్భంగా లేవనెత్తారు.వేలాది మంది విద్యార్థులు చదువుతున్న ఈ కాలేజీలో హాస్టల్ చాలా చిన్నగా ఉందని తెలిపారు. దీంతో మిగిలిన విద్యార్థులు తప్పనిసరి పరిస్థితుల్లో బయట ప్రైవేట్ పీజీలను వెతుక్కోవాల్సి వస్తోందని చెప్పారు.

Advertisement

ఇక ఈమధ్య ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో విద్యార్థులు ఉంటున్న ప్రైవేట్ పీజీ భవనం కూలిపోవడంతో ఈ హాస్టల్ వసతుల గురించి మరోసారి చర్చలోకి వచ్చింది. ఇప్పటికే ఈ సంఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు కూడా.

ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీలో ప్రత్యేకంగా ఏపీ విద్యార్థుల కోసం హాస్టల్ భవనాలను ఏర్పాటు చేయాలని విజయసాయి రెడ్డి కోరారు. అబ్బాయిలు, అమ్మాయిలకు ప్రత్యేక వసతి కల్పించడంతో పాటు భద్రత కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు అందుబాటులో ఉండేలా సబ్సిడీ ధరలతో వసతి కల్పిస్తే మరింత ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నారు.

నిజంగా విజయసాయి రెడ్డి లేవనెత్తిన విధంగా ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకుంటే మాత్రం ఢిల్లీలో చదువుకునే ఏపీ విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుందని చెప్పాలి.

Tags

Related News

13 రోజులకే పాస్‌పోర్ట్.. ఇచ్చాపురం చిన్నారి ప్రపంచ రికార్డు

ఇబ్రహీంపట్నం స్టేషన్‌లో రమా నందనా విచారణ.. ఏం జరిగిందంటే?

జాబ్స్ అడిగితే కేసులా బాబు? ఇదేం దారుణం: జగన్ ఫైర్

బొత్స ఫ్యామిలీకి బిగ్ షాక్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి చిన్న శ్రీను

ఏపీకి భారీ వర్ష గండం.. 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవిపై పోస్టులా.. జనసైనికులకు పవన్ కళ్యాణ్ వార్నింగ్!

ఆంధ్రప్రదేశ్ హస్తకళాకారులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్!

Big Stories

Advertisement
×