BigTV English
Advertisement

Aghori News: అఘోరీ నన్ను.. నా చెల్లిని పెళ్లి చేసుకుంది.. శ్రీవర్షణి అన్న ఆరోపణలు

Aghori News: అఘోరీ నన్ను.. నా చెల్లిని పెళ్లి చేసుకుంది.. శ్రీవర్షణి అన్న ఆరోపణలు

Lady Aghori News: రెండు తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరీ అంటే తెలియనివారు ఉండరు. అయితే గత కొన్ని రోజుల క్రితం మంగళగిరికి చెందిన శ్రీవర్షిణి అనే అమ్మాయి లేడీ అఘోరీతో వెళ్లిన విషయం తెలిసిందే. నిన్న మంగళగిరి పోలీస్ స్టేషన్ లో శ్రీ వర్షిణి తల్లిదండ్రులు ఫిర్యాదు కూడా చేశారు. తన కూతరును లేడీ అఘోరీ కిడ్నాప్ చేసిందని ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు.


లేడీ అఘోరీ నన్ను పెళ్లి చేసుకుంది: శ్రీ వర్షిణి అన్న

అయితే తాజాగా.. శ్రీవర్షణి అన్న విష్ణు సంచలన ఆరోపణలు చేశాడు. ‘నన్ను మా చెల్లిని లేడీ అఘోరీ పెళ్లి చేసుకుంది. చెన్నై నుంచి తీసుకొచ్చిన మంగళసూత్రాలతో నా మెడలో తాళి కూడా కట్టింది’ అని ఆయన సంచలన ఆరోపణలు చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతే కాదు, ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వివాదం రోజురోజుకు ఎక్కువ అవుతోంది. లేడీ అఘోరీ నిజంగా అఘోరీనా? లేక ఇదంతా ఆమె పబ్లిసిటీ స్టంటా? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ‘నా బిడ్డను లేడీ అఘోరీ వశం చేసుకుంది.. మా బిడ్డ మీద ఏదో మంత్రం వేసి తన దగ్గరే ఉంచుకుంటోంది. మేము ఎంత మాత్రం చెప్పినా ఆమె మా మాట వినడం లేదు. మా అమ్మాయి మానసికంగా బలహీనంగా ఉంది’ అంటూ తండ్రి కోటయ్య తల బాదుకున్నాడు.


అంతకు ముందు శ్రీ వర్షిణ అన్న అఘోరీ గురించి మాట్లాడాడు. లేడీ అఘోరీ గురించి పలు కీలక విషయాలు వెల్లడించాడు. ‘అఘోరీ నన్ను సెక్సువల్ గా టార్చర్ పెట్టింది. ఒక రోజు మా ఇంట్లో ఉన్నప్పుడు మందు, కండోమ్ లు తీసుకురమ్మని ఫోర్స్ చేసింది. అఘోరీకి పొలిటికల్ లీడర్లతో కూడా కనెక్షన్ ఉంది. ఆమెను ఆర్థికంగా కొందరు నేతలు ఆదుకుంటున్నారు. ఇంట్లో ఉన్నప్పుడు నా చెంప బుగ్గలు గిల్లడం చేసేది. నా బుగ్గలు కొరికింది. లేడీ అఘోరీ అమ్మాయి కాదు. మగ లక్షణాలు ఉన్న వింత జీవి’ అని అతను చెప్పుకొచ్చాడు.

‘మా చెల్లితో ఏకాంతంగా కూర్చొని రాత్రి సమయంలో  చేతులతో ముద్రలు వేసేది. మా చెల్లిని ప్రతిసారి ముద్దులు పెడుతూ ఇరిటేట్ చేసేది. మా మీద పడి బుగ్గలు నెమిరేది. ఇంట్లో ఉన్నన్నీ రోజులు మమ్మిల్ని సెక్సువల్ హారాస్‌మెంట్ చేసింది. మా చెల్లి, లేడీ అఘోరీ ఏం చెబితే అదే చేస్తుంది. చెల్లిని లేడీ అఘోరీ వశపరుచుకుంది. మా ఇంట్లో ఉన్నప్పుడు మా చెల్లిని తోడుగా పెట్టుకుని ఒక్క రూంలోనే ఉన్నారు. మా చెల్లి మానసికంగా బాగో లేదు. లేడి అఘోరీ మందు పెట్టి వశపరుచుకుంది. ఇప్పుడు మా చెల్లి.. మా కుటుంబ సభ్యులు వద్దు. అఘోరీ వద్దనే ఉంటా అంటుంది’ అని శ్రీవర్షిణి అన్న చెప్పాడు.

నేను అఘోరీతోనే ఉంటా: శ్రీవర్షిణి

లేడీ అఘోరీతో ఉన్న శ్రీవర్షిణి మాట్లాడుతూ.. ‘నా ఇష్టంతోనే నేను అఘోరీతో వెళ్లాను. నేను ఎట్టి పరిస్థితుల్లో నేను ఇంటికి రాను. అఘోరీ మాతతోనే ఉంటాను. మీరు నాకు పర్సనల్ గా కాల్ చేయండి. మీడియా ముందుకు వచ్చి నాకు కాల్ చేయొద్దు’ అని చెప్పుకొచ్చింది.

ALSO READ: JOBS: టెన్త్ పాసైతే చాలు భయ్యా.. స్టైఫండ్ ఇచ్చి జాబ్ ఇస్తారు.. ఇంకా వారం రోజులే..!

Related News

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్

AP Investments: ఏపీకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు.. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం..

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Big Stories

×